పాప్ సింగర్ ఫ్లో రిడా గోల్డ్ ప్లేటెడ్ బుగాటి వేరాన్
పాప్ స్టార్లకు క్రోమ్ ప్లేటెడ్ సూపర్‌కార్ల పిచ్చి పట్టుకున్నట్టుంది. ఇఠీవలే ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బైబర్ తమ 'ఫిస్కర్ కర్మ' కారును సిల్వర్ కలర్ క్రోమ్ కోటింగ్‌తో పెయింట్ చేయించుకున్న అందరి దృష్టిని ఆకట్టుకున్న సంగతి తెలిసినదే.
తాజాగా మరొక పాప్ సింగర్ కూడా బైబర్ బాటలోనే తన కారును గోల్డ్ ప్లేటెడ్ క్రోమ్ కలర్‌తో పెయింట్ చేయించుకున్నాడు. ప్రముఖ పాప్ సింగర్ ఫ్లో రిడా తన బుగాటి వేరాన్ సూపర్ కారును ఇదిగో ఇలా మార్చేయించుకున్నాడు.
అంతేకాదు, గోల్డ్ కలర్‌లో పెయింట్ చేసుకున్న ఈ బుగాటిని గోల్డెన్ గటి అని పిలుస్తున్నాడు ఈ పాటల బుల్లోడు. ఇది కేవలం కోటింగ్ మాత్రమే, అయితే ఈ కారు చక్రాలను మాత్రం 24 క్యారెట్ గోల్డ్‌తో తయారు చేశారు.
ఈ క్రోమ్ వర్క్‌ను ప్రముఖ వినైవ్ వ్రాపింగ్ కంపెనీ మెట్రో వ్రాప్జ్ చేసింది. సాధారణంగా రోడ్లపై గోల్డ్ కలర్ కార్లు ఎక్కువగా కనిపించవు. అలా కనిపిస్తే, మన కళ్లు ఆటోమేటిక్‌గా ఆ కారు వైపుకు మళ్లిపోతాయి. బహుశా అందుకేనేమో ఫ్లో రిడా తన గోల్డెన్ గటిని ఇలా కస్టమైజ్ చేయించుకున్నాడు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లుగా, ఎవరి కారు వారి ఇష్టం. మరి ఈ గోల్డెన్ బుగాటి వేరాన్ అందాన్ని మనం కూడా తనివితీరా చూసేద్దా రండి..!














Click it and Unblock the Notifications








