ఎగిరే కారుకు గ్రీన్ సిగ్నల్ తెలిపిన అమెరికా

Flying Car
గతంలో చెప్పుకున్నట్లుగానే ఎగిరే కారు (ఫ్లయింగ్ కారు) ఇకపై వాస్తవ రూపం దాల్చనుంది. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన "టెర్రాఫుజియా ట్రాన్సిషన్" కంపెనీ రూపొందిస్తున్న ఈ కార్లకు అమెరికా ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ తెలిపింది. రోడ్డుపైనే కాకుండా గాల్లో కూడా ప్రయాణించగలగడం ఈ కారు విశిష్టత. 'ట్రాన్సిషన్‌ రోడబుల్‌ లైట్‌ స్పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌'గా పిలిచే ఎగిరే కారు కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే తన రూపాన్ని మార్చుకొని పక్షిలా రెక్కలు విప్పుకొని గాల్లోకి రివ్వున ఎగిరిపోగలదు.

రానున్న ఐదేళ్లలో ఈ కారు ఫ్లయింగ్ కారు వాణిజ్య పరంగా మార్కెట్లో లభ్యం కావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారుకు రోడ్డుపై ప్రయాణించటానికి అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ప్రకటిచింది. ఇలాంటి మద్దతు ఉంటే యూరోపియన్ సేఫ్టీ ఏజెన్సీ ద్వారా కూడా క్లియెరెన్స్ జారీ చేయించడం సులువు అవుతుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసింది.

దాదాపు 2,50,000 అమెరికన్ డాలర్ల ఖరీదు చేసే ఈ టెర్రాఫుజియా కారు రెండు సీట్లు కలిగిన తేలికరకం ఎయిర్‌ క్రాఫ్ట్‌. ఒక సారి ఇందనంతో ట్యాంక్‌ను పుల్‌ చేస్తే 800 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది రోడ్డుపై గంటకు 65 మైళ్ల వేగంతోనూ, గాల్లో 115 మైళ్ల వేగంతోనూ ప్రయాణిస్తుంది. ఈ ఫ్లయింగ్ కారును గాల్లో నడపటానికి కేవలం 20 గంటల ఫ్లయింగ్‌ శిక్షణ తీసుకుంటే చాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 19, 2011, 18:08 [IST]
English summary
Terrafugia Transition, the flying car has got the clearance in the US, and experts are hoping it could soon hit roads within five years. The US National Highway Traffic Safety Administration paved the way for the flying car to be rolled out after recently announcing exemptions to allow it on American roads.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+