హమ్మయ్య.. మొత్తానికి ఎగిరే కారు వచ్చేస్తోంది! ధర ఎంతో తెలుసా?
గత కొన్ని సంవత్సరాల నుంచి ఫ్లైయింగ్ కార్లు వస్తున్నాయ్.. అని చెప్పుకుంటూనే ఉన్నాము. అయితే చెప్పుకున్నట్లుగానే చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'ఎక్స్‌పెంగ్ మోటార్స్' ఫ్లైయింగ్ కారును సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఫ్లైయింగ్ కార్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న చైనా ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. ఎక్స్‌పెంగ్ (Xpeng) మోటార్స్ యొక్క అనుబంధ సంస్థ 'ఎక్స్‌పెంగ్ ఏరోహెచ్‌టీ' (Xpeng AeroHT) ఈ కారును రూపొందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇది టెస్టింగ్ చివరి దశలో ఉన్నట్లు.. ఏ సమయంలో అయిన లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎక్స్‌పెంగ్ ఏరోహెచ్‌టీ మూడు ఫ్లైయింగ్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్ మరియు ఎక్స్2 అని పిలువబడే VTOL (వర్టికల్ ల్యాండింగ్ అండ్ టేకాఫ్) ఎయిర్‌క్రాఫ్ట్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతాయనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు, రానున్న రోజుల్లో వీటికి సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.
ఎక్స్‌పెంగ్ ఏరోహెచ్‌టీ ప్రకారం త్వరలో లాంచ్ కానున్న ఫ్లైయింగ్ కారు ల్యాండ్ మాడ్యూల్ 4 నుంచి 5 మందికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. చిన్న కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా కంపెనీ ఈ కారును రూపొందించింది. ఇది 6x6 ఆల్ వీల్ డ్రైవ్ మరియు ఇండిపెండెంట్ రియర్ వీల్ స్టీరింగ్ కలిగి మంచి ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీ కలిగి ఉంటుంది. ల్యాండ్ మాడ్యూల్ వెళ్లలేని చోట, ఎయిర్ మాడ్యూల్ స్వాధీనం చేసుకుంటుంది.

ఈ ఫ్లైయింగ్ కారులో స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ ల్యాండ్ మాడ్యూల్స్ రెండూ అందుబాటులో ఉంటాయి. రెండోది ఎయిర్ మాడ్యూల్‌ను అనేక సార్లు ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. VTOL ఎయిర్ మాడ్యూల్ ఫుల్ ఎలక్ట్రిక్ మరియు తక్కువ ఎత్తులో ఎగరటానికి అనుకూలంగా రూపొందించబడింది. ఇందులో మాన్యువల్ అండ్ ఆటోమాటిక్ డ్రైవ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి.
ఫ్లైయింగ్ మాడ్యూల్ ఫోల్డబుల్ రోటర్‌లను కలిగి ఉంటుంది. ఇది ల్యాండ్ మాడ్యూల్ లోపల సులభంగా సరిపోయేలా చేస్తుంది. చక్రాలకు బదులుగా నాలుగు కాళ్లతో హెలికాఫ్టర్ మాదిరిగా అనిపిస్తుంది. దీన్ని ఒక పెద్ద సైజ్ డ్రోన్ అని కూడా పిలవొచ్చు. ఎయిర్ మాడ్యూల్ ఇద్దరు ప్రయాణించడానికి అనుమతిస్తుంది. కంపెనీ దీనికి తగ్గట్టు డిజైన్ మరియు లిమిటెడ్ స్పీడ్ వంటి వాటిని ఫిక్స్ చేసింది.

2024 జనవరిలో లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో Xpeng ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ మాడ్యులర్ ఫ్లైయింగ్ కారు కోసం ఫ్రీ బుకింగ్ 2024 నాలుగో త్రైమాసికంలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. డెలివరీలు కూడా 2024 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీని ధర 1 మిలియన్ యువాన్స్ (సుమారు రూ. 1.15 కోట్లు) ఉండవచ్చని సమాచారం.
అనుకున్నట్టుగానే కంపెనీ ఎగిరే కారును సిద్ధం చేసింది. అయితే ఇందులో భద్రతకు సంబంధించిన ఫీచర్స్ అన్నీ పటిష్టంగా ఉన్నాయా? లేదా? అనేది చాలామందికి మనసులో మెదులుతున్న ప్రశ్న. కానీ కంపెనీ కూడా ఈ ఫ్లైయింగ్ కారులో తప్పకుండా వినియోగదారులకు కావలసిన అన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుపరిచి ఉంటుందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








