మనదేశంలో కూడా నిజం కానున్న ఎగిరే కార్లు; శ్రీకారం చుట్టిన చెన్నై కంపెనీ!

కారులో రోడ్డుపై ప్రయాణిస్తూ ఉన్నట్టుండి, హఠాత్తుగా గాలిలోకి విమానంలా ఎగిరిపోతే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా మరియు ఆసక్తికరంగా ఉంది కదూ! కానీ, ఇది త్వరలోనే నిజం కానుంది. ఇప్పటికే, కొన్ని గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్ పై పనిచేస్తుడంగా, మరికొన్ని కంపెనీలు ప్రోటోటైప్స్ మరియు టెస్ట్ ఫ్లైట్ లను విజయవంతంగా పూర్తి చేశాయి.

మనదేశంలో కూడా నిజం కానున్న ఎగిరే కార్లు; శ్రీకారం చుట్టిన చెన్నై కంపెనీ!

అయితే, భారతదేశంలో ఫ్లయింగ్ కార్ గురించి ఇప్పటి వరకూ ఏ సంస్థ కూడా ఓ ప్రణాళికతో ముందుకు రాలేదు. కాగా, ఇప్పుడు చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ మనదేశంలో కూడా ఫ్లయింగ్ కార్లు తయారు చేయడం సాధ్యమేనని రుజువు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ ఓ ప్రోటోటైప్ కాన్సెప్ట్ మోడల్ ను మరియు అఫీషియల్ స్కెచ్ లను కూడా విడుదల చేసింది.

మనదేశంలో కూడా నిజం కానున్న ఎగిరే కార్లు; శ్రీకారం చుట్టిన చెన్నై కంపెనీ!

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ఫ్లయింగ్ కారును చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ 'వినతా ఏరోమొబిలిటీ' (Vinata AeroMobility) తయారు చేసింది. సదరు కంపెనీ ఈ కాన్సెప్ట్ వాహనాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముందు ప్రదర్శించారు. ఈ హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు సివిల్ ట్రాన్స్‌పోర్ట్ మరియు అత్యవసర సేవలకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం

వినతా ఏరోమొబిలిటీ తయారు చేసిన ఈ ఫ్లయింగ్ కారును అక్టోబర్ 5, 2021 వ తేదీన లండన్‌ లో జరిగబోయే హెలిటెక్ ఎగ్జిబిషన్‌ లో కంపెనీ లాంచ్ చేయనుంది. ప్రస్తుతం, ఈ ఫ్లయింగ్ కారుకు కంపెనీ తుది మెరుగులు దిద్దుతోంది.

మనదేశంలో కూడా నిజం కానున్న ఎగిరే కార్లు; శ్రీకారం చుట్టిన చెన్నై కంపెనీ!

హైటెక్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది

ఈ ఫ్లయింగ్ కారు రోడ్డుపై సాధారణ కారులా మరియు గాలిలో క్వాడ్ కాప్టర్ (డ్రోన్ తరహా) వాహనంలా పనిచేస్తుంది. ఈ ఎగిరే కారును నడిపే డ్రైవర్ / పైలట్‌ ఇది కారు నడిపిన అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో నియంత్రించబడుతుంది, దీని కారణంగా ఈ ఫ్లయింగ్ కారును నడపడం చాలా సులభంగా ఉంటుంది.

మనదేశంలో కూడా నిజం కానున్న ఎగిరే కార్లు; శ్రీకారం చుట్టిన చెన్నై కంపెనీ!

ఈ ఫ్లయింగ్ కారు బయట నుండి చాలా స్టైలిష్‌ గా ఉంటుంది మరియు లోపలి వైపు ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది రియల్ టైమ్ జిపిఎస్ ట్రాకర్ ను కలిగి ఉంటుంది మరియు బెటర్ విజిబిలిటీ కోసం (360 డిగ్రీల వీక్షణ కోసం) ఇందులో విస్తృతమైన విండో కూడా ఉంటుంది.

ఈ ఎగిరే కారులో, యుద్ధ విమానాల్లో అందించినట్లుగా ఎజెక్షన్ పారాచూట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఫలితంగా, ప్రమాదం జరిగిన సమయంలో, ప్రయాణీకులు తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం దీని సాయంతో బయటపడవచ్చు. ఈ క్వాడ్ కాప్టర్ స్టైల్ ఫ్లయింగ్ కారులో కారుకి నాలుగు వైపులా డ్యూయెల్ ప్రొపెళ్లర్లతో కూడిన మోటార్లు ఉంటాయి.

మనదేశంలో కూడా నిజం కానున్న ఎగిరే కార్లు; శ్రీకారం చుట్టిన చెన్నై కంపెనీ!

అంటే, ప్రతి మోటార్ కు పైన క్రింద ఒక్కొక్క ఫ్యాన్ చొప్పున రెండు ఫ్యాన్లు ఉంటాయి. ఇలా మొత్తం నాలుగు మోటార్లకు 8 ఫ్యాన్లు ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫ్లయింగ్ కారులోని ఫ్యాన్లలో ఏ ఒక్క ఫ్యాన్ విఫలమైనా, మరొక ఫ్యాన్ కారు బ్యాలెన్స్‌ని నిర్వహించే విధంగా దీనిని రూపొందించారు.

ఈ ఎగిరే కారు బరువు 1100 కిలోలుగా ఉంటుంది మరియు ఇది 1300 కిలోల బరువును గాలిలోకి తీసుకువెళ్లగలదు. ఈ ఎగిరే కారు హైబ్రిడ్ వాహనం కాబట్టి, ఇది ఇంధనం మరియు బ్యాటరీ పవర్ రెండింటితో పనిచేస్తుంది. సాంప్రదాయ విమానాల మాదిరిగా కాకుండా, ఈ ఫ్లయింగ్ కారుని ఉన్న చోట నుండే నిలువుగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయటం సాధ్యమవుతుంది. దీనిని గాలిలోకి ఎగిరించడం కోసం ప్రత్యేకమైన రన్‌వే లాంటి వ్యవస్థ అవసరం లేదు.

మనదేశంలో కూడా నిజం కానున్న ఎగిరే కార్లు; శ్రీకారం చుట్టిన చెన్నై కంపెనీ!

టాప్ స్పీడ్ ఎంత?

ఈ ఫ్లయింగ్ కారు గరిష్టంగా గంటకు 120 కిమీ వేగంతో ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఇంధనం నింపిన తర్వాత, దానిని 60 నిమిషాల పాటు గాలిలో ఎగురవేయవచ్చు. ఇది భూమిపై నుండి 3,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ప్రస్తుతం, ఈ ఎగిరే కారును ఇద్దరు వ్యక్తుల కోసం రూపొందించబడింది, అయితే కొత్తగా రాబోయే మోడళ్లలో ప్రయాణీకుల సామర్థ్యం పెరుగే అవకాశం ఉంది.

మనదేశంలో కూడా నిజం కానున్న ఎగిరే కార్లు; శ్రీకారం చుట్టిన చెన్నై కంపెనీ!

ఎగిరే కార్లను తయారు చేసే గ్లోబల్ కంపెనీలు

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎగిరే కార్ల గురించి గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని కొన్ని గ్లోబల్ కంపెనీలు తమ ఫ్లయింగ్ కార్ మోడళ్లను పూర్తిగా సిద్ధం కూడా చేశాయి మరియు వాస్తవ వాతావరణంలో విజయవంతంగా పరీక్షించాయి. మరికొన్ని కంపెనీలైతే భవిష్యత్తులో వీటిని కస్టమర్లకు డెలివరీ చేయటం కోసం ఆర్డర్లను కూడా స్వీకరిస్తున్నాయి.

ఇటీవల, నెదర్లాండ్స్ కి చెంది ఓ కంపెనీ PAL-V ఎగిరే కారు ప్రొడక్షన్ మోడల్ ను సిద్ధం చేసింది. ఇప్పుడు ఈ ప్రయోగం చివరి దశలో ఉంది. అదే సమయంలో, అమెరికాకు చెందిన అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM) అనే కంపెనీ కూడా ఎగిరే కారును తయారు చేయనున్నట్లు ప్రకటించింది.

మనదేశంలో కూడా నిజం కానున్న ఎగిరే కార్లు; శ్రీకారం చుట్టిన చెన్నై కంపెనీ!

ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు బోయింగ్ మరియు ఎయిర్‌బస్ కూడా త్వరలో జపాన్‌లో ఎగిరే కార్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో, ప్రముఖ హెలికాప్టర్ తయారీదారు అయిన లాక్‌హీడ్ మార్టిన్ మరియు ఉబెర్ సంస్థలు కూడా ఈ ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్నాయి.

Most Read Articles

English summary
Flying cars in india to become reality soon chennai based startup revealed a prototype
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X