దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ సేవలు.. జెట్ స్పీడ్‌లో మీకు నచ్చిన నగరాల్లో వాలిపోవచ్చు..!!
2026 నాటికి దుబాయ్‌లో ఫ్లయింగ్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అతి త్వరలోనే వీటిని తీసుకురావడానికి ఒక సంచలనాత్మక ఒప్పందం జరగనుంది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) అర్బన్ ఎయిర్ మొబిలిటీలో టాప్‌లో కొనసాగుతోంది. ఇది భవిష్యత్తులో ఫ్లయింగ్ టాక్సీలను దుబాయ్ అంతటా విస్తృతం చేయనుంది.
కాలిఫోర్నియాకు చెందిన జాబీ ఏవియేషన్ మరియు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 2026 ప్రారంభంలో ఎమిరేట్‌లో ఎయిర్ టాక్సీ సేవలు ప్రజలకు కచ్చితంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2026 కంటే ముందే ఇందుకు సంబంధించిన టెస్ట్ రన్ విజయవంతంగా పూర్తి అవుతుందని జాబీ ఏవియేషన్ వివరించింది.

దుబాయ్‌లో ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశానికి ముందు దుబాయ్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది. నాలుగు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ముందుగా ఎయిర్ టాక్సీ సర్వీస్ సేవలు అందిస్తుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా మరియు పామ్ జుమేరా ఏరియాల్లో ఎయిర్ టాక్సీలు అందుబాటులో ఉండనున్నాయి.
గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఈ ఎయిర్‌టాక్సీలు ప్రయాణించగలవు. ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎయిర్ టాక్సీలు సేవలు అందించనున్నాయి. ప్రతి ఎయిర్ టాక్సీలో పైలట్‌తో సహా గరిష్టంగా ఐదుగురు వ్యక్తులకు ప్రయాణించవచ్చు. ఎయిర్ టాక్సీలోని పలు సౌకర్యాలతో ప్రత్యేకమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. ఈ ఎయిర్ టాక్సీలలో ప్రత్యేక రక్షణ వ్యవస్థను కూడా రూపొందించనున్నారు. ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ప్రయాణించవ్చు.

2017లో దుబాయ్‌లో డ్రైవర్ లేని ఎయిర్ టాక్సీని పరీక్షించారు . ఆ సమయంలో, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి స్వీయ-ఎగిరే టాక్సీ సేవగా ప్రచారం చేయబడింది. ఆ తర్వాత కొన్ని ప్రదేశాల్లో వీటికి శ్రీకారం చూపినప్పటికీ ఆశించినంత అభివృద్ధి చెందలేదు. అన్ని మార్గదర్శక సాంకేతికతల మాదిరిగానే, ఈ రంగంలో అనేక విధాలా పురోగతి సాధించినప్పటికీ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఇందుకు యునైటెడ్ స్టేట్స్‌తో సహా రెగ్యులేటరీ సర్టిఫికేషన్ అనేది ప్రధాన సమస్యగా ఉంది.
తాజాగా జాబీ ఏవియేషన్ మరియు RTA UAE యొక్క జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీతో కలిసి పని చేస్తుండటంతో త్వరలోనే ఎయిర్ టాక్సీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. USలో ఓహియోలోని డేటన్ ప్రాంతంలో టాక్సీ సేవల కోసం పెట్టుబడి పెడుతున్నట్లు జోబీ ప్రకటించింది. ఇక్కడ ఎయిర్ టాక్సీలను భారీగా ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇప్పటికే కాలిఫోర్నియాలో తయారీ సైట్‌ను కలిగి ఉంది. దీనిని 2023లోనే సంస్థ ప్రారంభించింది.

2026 నాటికి ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో టెస్ట్ ఫ్లైట్‌లు వచ్చే ఏడాది ప్రారంభం చేయనున్నట్లు Joby Aviation CEO మరియు వ్యవస్థాపకుడు, Joben Bevirt ప్రకటించారు. వాయు రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన ప్రముఖ బ్రిటిష్ కంపెనీ స్కైపోర్ట్స్‌కు వెర్టిపోర్ట్‌లను నిర్మించే బాధ్యతను కల్పించింది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








