గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మితే ఇలాగే జరుగుతుంది!.. ఏమైందో తెలుసా?

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ప్రజలు అప్డేట్ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ చేతిలోకి వచ్చిన తరువాత అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు. నేడు ఎక్కడికి వెళ్లినా.. ఎమ్ చేయాలన్నా ఎవరి సహాయం లేకుండానే చేసుకోవడానికి పూనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడుతున్నారు. గూగుల్ మ్యాప్ సాయంతో కొత్త ప్రాంతాలకు కూడా వెళ్లిపోతున్నారు. అయితే కొన్నిసార్లు ఇదే మనల్ని తప్పుదోవ పట్టిస్తోంది. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయింది. అయితే వీరు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వీరు అబ్దుల్ రషీద్ మరియు తష్రీఫ్ అని గుర్తించారు. వీరిద్దరూ కర్ణాటకలోని ఉప్పినంగడిలోని ఆసుపత్రికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Following Google Maps the Car Went Wrong Route

కర్ణాటకలోని ఉప్పినంగడిలోని ఆసుపత్రికి వెళ్ళడానికి వారు గూగుల్ మ్యాప్ సాయంతో ముందుకు సాగుతున్నారు. అయితే గూగుల్ మ్యాప్ చూపిస్తున్న దారి ప్రకారం వారు వెళుతున్న సమయంలో వారికి ముందు వంతెన ఉందని తెలియదు, దీంతో వారు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే కష్టం మీద వారిద్దరూ కారు కిటికీల నుంచి బయటకు వచ్చేసారు. ఈ క్రమంలో వారికి చిన్న గాయాలైనట్లు సమాచారం.

కారు నుంచి బయటకు వచ్చిన తరువాత వారు.. ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. బంధువులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంధి విషయం తెలుసుకుని రంగంలో దిగారు. మొత్తం మీద నదిలో చిక్కుకున్న ఇద్దరినీ బయటకు తీశారు. ఈ ఘటన ఉదయం సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. బహుశా కారు పనికిరాకుండా పోయి ఉంటుందని తెలుస్తోంది.

Following Google Maps the Car Went Wrong Route

ప్రమాదం జరిగిన ప్రదేశంలోని వంతెన చాల ఎత్తులో ఉన్నట్లు సమాచారం. నదిలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల నీరు అక్కడకు చేరుకుంటుంది. అయితే నాలుగేళ్ల క్రితం అధికారులు కొత్త వంతెన నిర్మించారు. కానీ ఇప్పటికీ గూగుల్ మ్యాప్ పాత వంతెననే చూపిస్తోంది. గూగుల్ మ్యాప్ కొత్త మార్గాన్ని అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి కొత్త దారుల్లో వెళ్లాలనుకునే వారు తప్పకుండా గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే సరిపోదు.

నిజానికి ఆధునిక కాలంలో గూగుల్ మ్యాప్ అనేది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఉత్తమమైన మార్గాన్ని చూపించే న్యావిగేటర్. అయితే ఒక టెక్నాలజీ.. కాబట్టి ఇది నెట్‌వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గమ్యాన్ని చేరుకున్న తరువాత కూడా గమ్యాన్ని చేరుకున్నట్లు గూగుల్ మ్యాప్ చూపించదు. దీనికి ప్రధాన కారణం నెట్‌వర్క్. కొన్ని సందర్భాల్లో ఏకంగా తప్పుడు మార్గాలనే చూపిస్తాయి.

గూగుల్ మ్యాప్ తప్పుడు మార్గాలను చూపించినప్పుడు యూజర్ కూడా దాన్ని ఫాలో అవుతూ ప్రమాదంలో పడతారు. ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాదు, సిటీలలో కూడా ఇలాంటి సంఘటనకు జరిగాయి. గూగుల్ మ్యాప్ నమ్ముకుని వెళ్తే చివరకు ఓ ఎత్తైన గోడల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. గతంలో నటి శిల్పా శెట్టికి ఇలాంటి అనుభవం ఎదురైనట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.

గతంలో వెలుగులోకి వచ్చిన సంఘటనల్లో కొందరు గూగుల్ మ్యాప్ నమ్ముకుని అడవుల్లో చిక్కుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ సమయంలో వారికి ఎం చేయాలో తోచక రాత్రి ఆ అడవిలోనే ఉండాల్సి వచ్చింది. మరికొందరు గూగుల్ మ్యాప్ నమ్ముకుని ప్రాణాలే కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి గూగుల్ మ్యాప్ ఉపయోగించేవారు తప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 29, 2024, 12:05 [IST]
English summary
Following google maps the car went wrong route and fell into the river
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+