వీడియో : హా.. హా.. ఫన్నీ దొంగలు.. పారిపోయారు!
డ్యుకాటి బైక్‌లంటే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. ఇలాంటి లక్కీ బైక్‌లను సొంతం చేసుకునేందుకు కొందరు బైక్ ప్రియులు చాల కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేస్తారు. కానీ, కొందరు వెధవలు (ఫూల్స్) మాత్రం అప్పణంగా ఇలాంటి ఖరీదైన బైక్‌లను దొంగిలించాలని ప్లాన్ చేస్తుంటారు. అలా ప్లాన్ చేసిన ఓ గ్యాంగ్, తమ దోపిడీ ప్రయత్నంలో ఎలా విఫలమైందో ఈ వీడియోలో చూడండి.
యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియోలో.. కొందరు దుండగలు పట్టపగలే డ్యుకాటి షోరూమ్‌లో బైక్‌ల దోపిడి యత్నం చేశారు. వీరంతా తమ మోపెడ్లపై డ్యుకాటి మోటార్‌సైకిల్ షోరూమ్‌కు వచ్చి, షోరూమ్ సిబ్బంది ముందే రెండు బైక్‌లను దొంగిలించే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
పట్టపగలే దోపిడీ యత్నానికి పాల్పడటంతో వారి ఫేట్ మారిపోయింది. షోరూమ్‌లో పనిచేస్తున్న వ్యక్తి, దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పాటుగా రోడ్డుపై వెళ్తున్న వారు కూడా సహకరించడంతో దోపిడీదారులు తమ ప్రయత్నాన్ని విరమించుకుని పరారయ్యారు. బయటి ప్రజలకు, దుండగలకు మధ్య జరిగిన పెనుగులాట కాస్తంత సరదాగా అనిపిస్తుంది. మరి ఆ వీడియోని మనం కూడా చూద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/CNGzdmwU1ZI" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








