భారత వాహన పరిశ్రమను ఇప్పటికీ శాసిస్తున్నది వీరే!!

By Anil

దేశ ఆర్థిక వ్యవస్థలో ఆటోమొబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. దేశీయ సంస్థలతో పాటు విదేశీ వాహన తయారీ కంపెనీలకు కూడా భారత్ కేంద్రంగా మారింది.

టాటా, మహీంద్రా, బజాజ్ వంటి దేశీయ దిగ్గజాలు భారత వాహన పరిశ్రమను శాసిస్తున్నారడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇలాంటి కంపెనీల వెనుక తొమ్మిది మంది భారత దిగ్గజాలు చక్రం తిప్పుతున్నారు. వారి గురించి పూర్తి వివరాలు...

09.ఆనంద్ మహీంద్రా

09.ఆనంద్ మహీంద్రా

ఆనంద్ మహీంద్రా ఆటోమొబైల్ రంగంలో ముఖ్యమైన వ్యక్తి. ఇతను సంస్థలో చేరినప్పటి నుండి ఎన్నో సంస్కరణలు చేశాడు. రకరకాల వాహన ఉత్పత్తు ఆవిష్కరణలో ఆనంద్ మహీంద్రా సేవలు అత్భుతం. మీరు ఒక సారి గమనించినట్లయితే ప్రతి శ్రేణిలో కూడా మహీంద్రా వాహనాలు ఉన్నాయి. ఇతను మొత్తం ఆస్తి 1.1 బిలియన్ అమెరికన్ డాలర్లు.

08.ఆభయ్ ఫిరోదియా

08.ఆభయ్ ఫిరోదియా

ఫోర్బ్స్ పత్రిక వారి కథనం ప్రకారం ఇతని సంపద దాదాపుగా 1.3 బిలియన్ అమెరికన్ డాలర్లు. ప్రస్తుతం ఇతని ఫోర్స్ మోటార్స్ ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరియు ఇతనికి బజాజ్ గ్రూపులో ఎక్కువ శాతం వాటాలు ఉన్నాయి.

07. లచ్చమన్‌ దాస్ మిట్టల్

07. లచ్చమన్‌ దాస్ మిట్టల్

ఇతను ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ స్థాపకుడు. దాదాపుగా 84 సంవత్సారల క్రింతం దీనిని స్థాపించాడు. ఇతన సంపద కేవలం ఒక సంవత్సరమ కాలంలోనే 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల నుండి 23 మిలియన్ డాలర్ల వరకు పెరిగింది. 2014 ఫోర్బ్స్ జాబితా ప్రకారం అత్యంత ధనవంతుల జాబితాలో ఇతను 65 స్థానంలో ఉండగా తాజా సమాచారం ప్రకారం 52 స్థానంలో ఉన్నాడు.

06.బాబా కల్యాని

06.బాబా కల్యాని

దేశీయ ఆటోమొబైల్ విడిబాగాల తయారీ సంస్థ బారత్ ఫోర్జ్ సంస్థకు అధిపతి బాబా కల్యాని. ఇతని ప్రస్తుత సంపద 2.3 బిలియన్ డాలర్లు. ఈ సంస్థ చాలా రకాల కంపెనీలకు వాహన విడి భాగాలను అందిస్తోంది. అత్యంత సంపన్నులైన 100 మందిలో ఇతనికి 41 స్థానం దక్కింది.

05.అమల్‌గమేషన్ కుటుంబం

05.అమల్‌గమేషన్ కుటుంబం

అమల్‌గమేషన్ గ్రూప్ అనగా ఎవరికి వెంటనే గుర్తుకు రాదు. మనందరికి బాగా సుపరిచితమైన సంస్థ టాఫే సంస్థకు ఈ కుటుంబం ఆదిపత్యంలో ఉంది. దేశ వ్యాప్తంగా గల ట్రాక్టర్స్ మరియు వ్యవసాయ పరికరాలు ఉత్పత్తిలో టాఫే సంస్థ రెండవ స్థానంలో ఉంది. దీనికి పూర్తిగా అదిపతిగా మల్లిరకా శ్రీనివాసన్ గారు వ్యవహరిస్తున్నారు. దాదాపుగా వీరి సంపద విలువ 2.5 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.

04.వివేక్ చాంద్ సెహగల్

04.వివేక్ చాంద్ సెహగల్

భారత దేశంలో గల అతి పెద్ద ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీకి అధిపతిగా వ్యవహిరిస్తున్నారు. ఇతని సంపద దాదాపుగా 2.5 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. సెహగల్ ప్రస్తుతం అత్యంత సంపన్నుల జాబితాలో 36 స్థానంలో ఉన్నారు. గత ఏడాది కూడా ఇతని సంపద 2.5 మిలియన్ డాలర్లుగా ఉంది.

03.బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్

03.బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్

మనకు హీర్ మోటోకార్ప్ ద్వారా బాగా పరిచయం గల వ్యక్తి బ్రిబ్‌మోహన్ లాల్ ముంజాల్. ప్రతి పల్లెల్లో కూడా వీరి ద్విచక్ర వాహనాలు తిరుగుతున్నాయి. ఇతను నవంబర్ 1, 2015 న 92 సంవత్సరాల వయస్సుతో మరణించాడు. గత ఏడాది అత్యంత సంపన్నుల జాబితాలో 27 వ స్థానంలో ఉండాగా ప్రస్తుతం 23 స్థానంలో ఉన్నాడు. ఇతని సంపద 3.7 నుండి 3 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

02. విక్రమ్ లాల్

02. విక్రమ్ లాల్

ఐషర్ మోటార్స్ వ్యవస్థాపకుడు మరియు సిఇవొ విక్రమ్ లాల్. విక్రమ్ లాల్ తమ ఉత్పత్తుల నుండి రాయల్ ఎన్ఫీల్డ్ ‌నున ప్రవేశ పెట్టిన తరువాత అనతి కాలంలోనే ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. విక్రమ్ లాల్ సంపద 2.95 బిలియన్ డాలర్ల నుండి 4.3 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ప్రస్తుతం అత్యంత సంపన్నుల జాబితాలో ఇతనిని 20 స్థానం వరించింది.

01.బజాజ్ కుబుంబం

01.బజాజ్ కుబుంబం

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ టూవీలర్లను ఉత్పత్తి చేస్తున్న రెండవ అతి పెద్ద తయారీదారులుగా చరిత్రను సృష్టించిన సంస్థ బజాజ్. బజాజ్ కుటుంబం యొక్క మొత్తం సంపద దాదాపుగా 3 బిలియని అమెరికన్ డాలర్లుగా ఉంది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాలో బజాజ్ కుటుంబం 19 వ స్థానంలో ఉంది.

మరిన్ని ఆశక్తికరమైన విషయాలకు.
  1. ఆటోమొబైల్స్ రంగానికి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి ఆశక్తికరమైన విషయాలు
  2. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్: గిన్నిస్ రికార్డ్
  3. దేశాన్ని చుట్టేయబోతున్న బుల్లి కారు.

Article Published On: Wednesday, December 2, 2015, 12:46 [IST]
English summary
Forbes Magazine List Top Most Wealthiest Prsons Indian Auto Industry
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+