అప్పుడే పుట్టిన పాపకు నరకం చూపించిన ఇలాంటి డ్రైవర్ మీ చేతికి చిక్కితే ఏం చేస్తారు?

అప్పుడే పుట్టిన పసికందును అత్యవసరంగా హాస్పిటల్‌కు తీసుకెళుతున్న అంబులెన్స్‌కు ఓ ఎస్‌యూవీ డ్రైవర్ ఉద్దేశ్యపూర్వకంగా దారివ్వకుండా చేసిన షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది.

By Anil

మీరు రోడ్డు మీద కారులో వెళుతున్నపుడు మీ వెనకాలే అంబులెన్స్ వస్తుందునుకోండి. ఈ సందర్భంలో మీరేం చేస్తారు? దీనికి ప్రతి ఒక్కరి సమాధానం, వెంటనే అంబులెన్స్‌కు దారివ్వడం.

అంబులెన్స్‌కు అడ్డుపడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్

కానీ అప్పుడే పుట్టిన పసికందును అత్యవసరంగా హాస్పిటల్‌కు తీసుకెళుతున్న అంబులెన్స్‌కు ఓ ఎస్‌యూవీ డ్రైవర్ ఉద్దేశ్యపూర్వకంగా దారివ్వకుండా చేసిన షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది.

అంబులెన్స్‌కు అడ్డుపడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్ తన వెనకాలే వస్తున్న అంబులెన్స్‌కు దారివ్వకుండా అడ్డుపడుతూ వచ్చాడు. అత్యవసర కేసుతో హాస్పిటల్‌కు వెళుతున్న అంబులెన్స్‌ చాలా ఆలస్యంగా హాస్పిటల‌్‌ను చేరుకుంది. ఇదంతా అంబులెన్స్ ముందు అమర్చిన కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
అంబులెన్స్‌కు అడ్డుపడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్

అంబులెన్స్‌ను అడ్డుకున్నఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్ నిర్మల్ జోస్‌ను కేరళ పోలీసులు కొచ్చిలో అదుపులోకి తీసుకున్నారు. చాలా సమయం సేపు అంబులెన్స్‌ను దారివ్వకుండా చేసి, హాస్పిటల్‌కు చాలా ఆలస్యంగా చేరడానికి కారణమైన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

అంబులెన్స్‌కు అడ్డుపడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్

వీడియో మొత్తాన్ని చూస్తే, అంబులెన్స్ చాలా వేగం మీదే ఉంది, దారి కోసం అంబులెన్స్ డ్రైవర్ విపరీతంగా హారన్ మ్రోగించినా ఎకోస్పోర్ట్ డ్రైవర్ అస్సలు దారివ్వకుండా అంబులెన్స్ ముందే వెళ్లాడు. అంతే కాకుండా ప్రభుత్వం బ్యాన్ చేసిన హజార్డ్ లైట్లను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు.

అంబులెన్స్‌కు అడ్డుపడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్

అయితే, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్ మాట్లాడుతూ, అంబులెన్స్‌కు మార్గం సుగమం చేయడానికి నేను అంబులెన్స్ ముందు అధిక వేగంతో హారన్ కొడుతూ రోడ్డు మీద ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ వెళ్లానని చెప్పుకొచ్చాడు. ఈ సమాధానంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Trending On DriveSpark Telugu:

విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?

గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు

అంబులెన్స్‌కు అడ్డుపడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్

కానీ, అంబులెన్స్ డ్రైవర్ మధు మాట్లాడుతూ, "జోస్ అంబులెన్స్‌కు అస్సలు దారివ్వలేదు. దీంతో హాస్పిటల్‌కు 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న అప్పుడే పుట్టిన పసిపాపను పెరంబవూరులోని హాస్పిటల్ నుండి కలమసెర్రీ మెడికల్ కాలేజీకి తరలిస్తున్నట్లు తెలిపాడు.

అంబులెన్స్‌కు అడ్డుపడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్

ర్యాష్‌ మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసినందుకు గాను నిర్మల్ జోష్ మీద కేరళ పోలీసులు చర్యలు తీసుకున్నారు, ఆ తరువాత జోస్‌ను అరెస్ట్ చేశారు. జోస్ నడిపిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు.

అంబులెన్స్‌కు అడ్డుపడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్

కేరళలోని అలువా పరిధిలోని జాయింట్ ఆర్‌టిఓ సిఎస్ అయ్యప్పన్ మాట్లాడుతూ, భాద్యతారాహిత్యంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేసినట్లు తెలిపాడు. అంతే కాకుండా ఆర్‌టిఓ నిర్వహించే అవగాహన తరగతులకు ఖచ్చితంగా హాజరవ్వాలని డ్రైవర్‌‌కు పోలీసులు సూచించారు.

అంబులెన్స్‌కు అడ్డుపడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డ్రైవర్

జోస్‌ అరెస్టయిన తరువాత పోలీసులకు ఏం చెప్పాడో తెలుసా...? అంబులెన్స్‌కు పైలట్‌గా డ్రైవింగ్ చేసినట్లు చెప్పాడు. కానీ మనం వీడియో చూస్తే అందులో ఎక్కడా తను అంబులెన్స్‌కు సహకరించిన దాఖలాలు కనబడటం లేదు. రోడ్డు మీద అంబులెన్స్ వెళుతున్నపుడు చాలా మంది డ్రైవర్లు దారిస్తారు.

చట్టం ప్రకారం, ప్రతి డ్రైవర్ కూడా అత్యవసర వాహనాలనై ఫైర్ ఇంజన్ మరియు అంబులెన్స్‌లకు ఖచ్చితంగా దారివ్వాలి. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ వెహికల్ వచ్చినపుడు మన వాహనాన్ని ప్రక్కకు ఆపుకుని దారివ్వడాన్ని మన బాధ్యతగా తీసుకోవాలి. ట్రాఫిక్‌లో ఉన్నపుడు కూడా అత్యవసర వాహనాలకు దారిప్పించేందుకు ప్రయత్నించండి.

Most Read Articles

English summary
Read In Telugu: Ford EcoSport Driver Blocks Ambulance — Here’s What Happened Next
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X