వివాదాలకు దారి తీసిన సెక్సీ యాడ్; క్షమాపణలు చెప్పిన ఫోర్డ్
అమెరికాకు చెందిన కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో అందిస్తున్న ఫిగో హ్యాచ్‌బ్యాక్ ప్రమోషన్ రూపొందించిన ఓ ప్రకటన ఇప్పుడు సదరు కంపెనీను చిక్కుల్లో పడేసింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీ జెడబ్ల్యూటి (ఫోర్డ్ కోసం ప్రకటనలు తయారు చేసే కంపెనీ) ఫిగో కారు కోసం కొన్ని ప్రకటనలు తయారు చేసింది. ఇవి కొందరు ప్రముఖ సెలబ్రిటీలను (ఇటాలియన్ మాజీ ప్రధానమంత్రితో కలిపి) కించపరచే విధంగా ఉన్నాయంటూ సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిగో కోసం జెడబ్ల్యూటి కామిక్‌ల రూపంలో మొత్తం 3 ప్రింట్ యాడ్లను రూపొందించింది. ఇందులో ఓ ప్రకటనలో ఇటాలియన్ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండగా, నోరు, చేతులు కట్టిపడేసిన ముగ్గురు సెక్సీ అమ్మాయిలను బూట్ స్పేస్‌లో పడేసి ఉన్నట్లుగా ఉంది. మరొక ప్రకటనలో అమెరికన్ సెలబ్రిటీ ప్యారిస్ హిల్టన్ ముందు సీట్లో కూర్చొని ఉండగా, మరొక సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ మరియ ఆమె ఇద్దరు చెల్లెళ్లను నోరు, చేతులు కట్టిపడేసి బూట్ స్పేస్‌లో ఉంచారు.
ఇక మూడవ ప్రకటనలో రేసింగ్ దిగ్గజం మైఖేల్ షుముఖర్ డ్రైవర్ సీట్లో కూర్చొని ఉండగా, ఇదే రేసింగ్ రంగానికి చెందిన ఎఫ్1 డ్రైవర్స్ సెబాస్టియన్ వెట్టెల్, ఫెర్నాండో అలోన్సో, లెవిస్ హామిల్టన్‌లను కూడా నోటికి ప్లాస్టర్స్ వేసి, కాళ్లు చేతులు కట్టిపడేసి ఉంటారు. ఈ ప్రకటనల ద్వారా ఫోర్డ్ ప్రపంచానికి తెలిజెప్పాలనుకున్నది ఏంటంటే, ఫోర్డ్ ఫిగోలో విశాలమైన బూట్ స్పేస్ ఉందని, తమ బాధలన్నింటినీ ఈ బూట్ స్పేస్‌లో వదిలేసి, హాయిగా ఎంచక్కా ముందుకు సాగిపోండని చెప్పాలనుకుంది.
అయితే, ఈ ప్రయత్నం కాస్త తిప్పికొట్టింది. వాస్తవానికి ఈ ప్రింట్ ప్రకటనలు ఏ పత్రికలలోను ముద్రించిన దాఖలాలు లేవు. కానీ, ఇంటర్నెట్‌లో మాత్రం ఇవి గ్యాంగ్నమ్ వీడియో లాగా పాపులర్ అయిపోయాయి. దీంతో, తికమకలో పడిన ఫోర్డ్ మోటార్స్ చేసిది లేక ఈ ప్రకటనలపై సదరు సెలబ్రిటీలకు క్షమాపనలు తెలుపుకుంది. దీనిపై విచారణ జరిపిస్తామని, ఇలాంటి ఫొటోలు ప్రొఫెషనలిజానికి మచ్చ తెచ్చేవని, భవిష్యత్తులో ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఫోర్డ్ మోటార్స్ వ్యాఖ్యానించింది. మరి ఈ ప్రకనటలపై మీరు కూడా ఓ కన్నేస్కోండి..!

ఫోర్డ్ ఫిగో వివాదాస్పద ప్రకటన
ఫోర్డ్ ఫిగో కారులో ఇటలీ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ, బూట్ స్పేస్‌లో ముగ్గురు అందమైన యువతులు.

ఫోర్డ్ ఫిగో వివాదాస్పద ప్రకటన
ఫోర్డ్ ఫిగో కారులో అమెరికన్ సెలబ్రిటీ ప్యారిస్ హిల్టన్, బూట్ స్పేస్‌లో కిమ్ కర్దాషియాన్ మరియ ఆమె ఇద్దరు చెల్లెళ్లు.

ఫోర్డ్ ఫిగో వివాదాస్పద ప్రకటన
ఫోర్డ్ ఫిగో కారులో రేసింగ్ దిగ్గజం మైఖేల్ షుముఖర్, బూట్ స్పేస్‌లో ఎఫ్1 డ్రైవర్స్ సెబాస్టియన్ వెట్టెల్, ఫెర్నాండో అలోన్సో, లెవిస్ హామిల్టన్‌లు.

ఫోర్డ్ ఫిగో వివాదాస్పద ప్రకటన

ఫోర్డ్ ఫిగో వివాదాస్పద ప్రకటన



Click it and Unblock the Notifications








