ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

భారతదేశానికి మరో అమెరికన్ కార్ కంపెనీ బై బై చెప్పింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో దశాబ్ధాల చరిత్ర కలిగిన అమెరికన్ కార్ బ్రాండ్ Ford (ఫోర్డ్) త్వరలోనే ఇండియా మార్కెట్ నుండి తొలగిపోతున్నట్లు ప్రకటించింది. తమకు సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టం రావటం మరియు కార్ల అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు Ford India తెలిపింది.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

గతంలో మరొక అమెరికన్ కార్ కంపెనీ General Motors (జనరల్ మోటార్స్) కూడా భారదేశాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసినదే. కాలుష్య ఉద్గార నిబంధనల విషయంలో జనరల్ మోటార్స్ పాల్పడిన అవినీతి మరియు అమ్మకాల తగ్గుగల కారణంగా ఈ కంపెనీ 2017 లో భారతదేశాన్ని విడిచిపెట్టింది. ఫోర్డ్ కూడా ఇప్పుడు జనరల్ మోటార్స్ మార్గాన్నే అనుసరించనుంది.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

అమెరికన్ కార్ బ్రాండ్ Ford India తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ఫోర్డ్ కార్ల యజమానులు అయోమయంలో పడ్డారు. తమ వాహనాల సర్వీస్, స్పేర్స్ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలో ఫోర్డ్ తమ ఉత్పత్తి మరియు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయటంతో సుమారు 4000 మందికి పైగా ఉద్యోగులు వీధిన పడనున్నారు.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

Ford Motor Company గుజరాత్ మరియు తమిళనాడు రాష్ట్రాలలోని తమ తయారీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఈ నిర్ణయం తీసుకోవటం అంటే భారత మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ EcoSport నుండి ఫుల్-సైజ్ ఎస్‌యూవీ Endeavour వరకూ అనేక ప్రముఖ మోడళ్ల జీవితకాలం ముగిసినట్లే అర్థం.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

Ford కార్ల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్ ను పూర్తి చేసిన తర్వాత మరియు స్టాక్ మొత్తం పూర్తిగా విక్రయించబడిన తర్వాత ఈ కంపెనీ భారతదేశంలో కొత్త కార్ల అమ్మకాలను మరియు తయారీని పూర్తిగా నిలిపివేయనుంది. అయితే, తమ కస్టమర్లకు కావల్సిన మద్దతు మాత్రం లభిస్తూనే ఉంటుందని ఫోర్డ్ హామీ ఇచ్చింది. అమ్మకాల తర్వాత సేవ (ఆఫ్టర్ మార్కెట్ సర్వీస్), స్పేర్ పార్ట్స్ మరియు వారంటీ కవరేజీని అందిస్తూనే ఉంటామని కంపెనీ తెలిపింది.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

భారతదేశం నుండి Ford కంపెనీ వెళ్లిపోవటం ఇదేం మొదటిసారి కాదు. భారతదేశంలో Ford Motor ప్రయాణం 1920 లో ప్రారంభమైంది. కెనడాకి చెందిన Ford Motor Company కి అనుబంధ సంస్థగా ఫోర్డ్ మనదేశంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 1950 కాలంలో భారతదేశం నుండి మొదటి సారిగా నిష్క్రమించింది.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

అయితే, 1995 లో Ford భారతదేశానికి తిరిగి వచ్చింది. కానీ, ఈసారి తన ప్రయాణాన్ని కెనడా నుండి కాకుండా అమెరికా నుండి ప్రారంభించింది. భారతదేశపు యుటిలిటీ వాహన తయారీ సంస్థ Mahindra and Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) సహకారంతో కంపెనీ భారతదేశంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

ఆ సమయంలో ఇరు కంపెనీలు కలిసి Mahindra Ford India Limited అనే జాయింట్ వెంచర్‌ను స్థాపించారు మరియు 1996 లో తమ మొట్టమొదటి ఉత్పత్తి Ford Escort (పోర్డ్ ఎస్కార్ట్) ను తయారు చేశారు. ఫోర్డ్ ఎస్కార్ట్ ప్రధానంగా ఓ యూరోపియన్ మోడల్, ఇది మొదట భారతీయ వినియోగదారుల కోసం తయారు చేయబడింది. ఆ తరువాత భారతదేశంలో ఫోర్డ్ యొక్క మొట్టమొదటి స్వతంత్ర మోడల్ గా Ikon (ఐకాన్) సబ్ కాంపాక్ట్ సెడాన్ కు కంపెనీ ప్రవేశపెట్టింది.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

ఆరంభంలోనే Ford మరియు Mahindra కంపెనీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇరు కంపెనీలు విడిపోయిన తర్వాత ఫోర్డ్, 1998లో Ford Motor India Limited గా మారింది. Ford Fiesta (ఫోర్డ్ ఫియస్టా) హ్యాచ్‌బ్యాక్ యొక్క నాల్గవ తరం మోడల్ ని ఆధారంగా చేసుకొని కంపెనీ తమ Ford Ikon సెడాన్ కారును తయారు చేసింది. అయితే, 2011 లో ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేసింది.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

భారతదేశంలో ఫోర్డ్ తమ దశాబ్ధాల ప్రయాణంలో అనేక ఇతర ఉత్పత్తులను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. వాటిలో Ford Figo (ఫోర్డ్ ఫిగో) హ్యాచ్‌బ్యాక్ ఓ ప్రధానమైన మోడల్. ఈ కారును తొలిసారిగా 2010 లో భారతదేశంలో విడుదల చేయబడింది. ఆ తర్వాత ఈ మోడల్ లో కంపెనీ ఫేస్‌లిఫ్ట్‌లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫిగో హ్యాచ్‌బ్యాక్ రెండవ తరానికి చెందినది, దీనిని ఐదేళ్ల క్రితం భారత్‌లో ప్రవేశపెట్టారు.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

ప్రస్తుతం భారత మార్కెట్లో ఫోర్డ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మొదటి స్థానంలో ఉన్నది Ford EcoSport (ఫోర్డ్ ఎకోస్పోర్ట్) సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారుని తొలిసారిగా 2013 లో భారత్ లో విడుదల చేశారు. అప్పట్లో ఈ కారు ఒక పెద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇటీవల కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను భారత రోడ్లపై పరీక్షించడాన్ని గుర్తించడం జరిగింది. అయితే, కంపెనీ తమ ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఇది భారతదేశంలో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

టొయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) వంటి పెద్ద ఎస్‌యూవీలకు పోటీగా ఈ అమెరికన్ కార్ కంపెనీ ప్రవేశపెట్టిన పవర్‌ఫుల్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour). ఇది విఐపిలకు చాలా ఫేవరెట్ కారు, అంతేకాదు ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ స్టన్నింగ్ లుక్స్ తో మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 2003లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. కాగా, ఇందులో రెండవ తరం మోడల్‌ను 2015లో ప్రవేశపెట్టారు.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

దేశీయ విపణిలో Ford Ikon సెడాన్‌ని నిలిపివేయాలని నిర్ణయించుకున్న తర్వాత, కంపెనీ దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు Ford Figo Aspire (ఫిగో ఆస్పైర్) ను కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ప్రవేశపెట్టింది. ఫిగో ఆస్పైర్ 2015 లో భారత్‌లో విడుదల చేయబడింది. అయితే, ఇది ఈ విభాగంలో Maruti Suzuki Dzire, Honda Amaze మరియు Hyundai Xcent వంటి మోడళ్లతో పోటీపడలేకపోయింది.

ఇండియా ఇక సెలవు.. మేం వెళ్తున్నాం: Ford; చరిత్రలోకి చేరిన మరో అమెరికన్ కంపెనీ!

భారతదేశంలో Ford చివరిగా లాంచ్ చేసిన మోడల్ Freestyle (ఫ్రీస్టైల్). Ford దీనిని లైఫ్ స్టైల్ అడ్వెంచర్ వెహికల్‌గా మార్కెట్ చేసింది, ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ మోడళ్లను కలగలిపి ఈ కారును రూపొందించింది. Ford India ప్రస్తుతం భారతదేశంలో Endeavour, EcoSport, Figo, Figo Aspire మరియు Freestyle మోడళ్లను విక్రయిస్తోంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford motor company journey in india from escort to freesytle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X