దుబాయ్‌లో అంబులెన్స్‌గా మారిన ఫోర్డ్ మస్టాంగ్!

ఆయిల్ రిచ్ కంట్రీ దుబాయ్‌లో అన్నీ వింతలే. తమది అత్యంత ధనిక దేశమని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటారో లేక టెక్నాలజీని, విలాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలోనని ఇతరులకు తెలియజేయాలనుకుంటారో ఏమో కానీ.. అక్కడి అధికారులు అనేక రకాల లగ్జరీ, సూపర్‌‌కార్లను పోలీసుల కోసం వినియోగిస్తుంటే, తాజాగా వైద్య సేవల కోసం కూడా సూపర్‌‌కార్లను వాడటం మొదలు పెట్టారు.

ప్రపంచంలో కెల్లా అత్యంత పాపులర్ అయిన మజిక్యులర్ కార్ ఫోర్డ్ మస్టాంగ్, దుబాయ్‌లో అంబులెన్స్ అవతారం ఎత్తింది. దుబాయ్ గవర్నమెంట్ ఆస్పత్రిలో ఈ ఫోర్డ్ మస్టాంగ్ అంబులెన్స్‌లను ఉపయోగించనున్నారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను దుబాయ్ అధికారులు ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. ఇందులో రెండు ఫోర్డ్ మస్టాంగ్‌లను ఫుల్ వర్కింగ్ అంబులెన్స్‌లుగా డిజైన్ చేశారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఆ స్థలానికి త్వరిత గతిన చేరుకునేందుకు, గాయపడిన వారిని క్షణాల్లో ఆస్పత్రికి తరలించేందుకు గాను ఈ పవర్‌ఫుల్ ఫోర్డ్ మస్టాంగ్ అంబులెన్స్‌లను ఉపయోగించనున్నట్లు సమాచారం.

Ford Mustang Ambulance

ఫోర్డ్ మస్టాంగ్ విషయానికి వస్తే, ఇది సాధారణ స్పోర్ట్స్ కార్ల కన్నా విభిన్నంగా ఉంటుంది. భారీగా కనిపించే ఈ కారు అంతే భారీ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ధృడమైన నిర్మాణం దీని సొంతం. అందుకే ఈ కారును కండలు తిరిగిన కారు (మజిక్యులర్ కార్)అని ముద్దుగా పిలుస్తుంటారు.ఫోర్డ్ మస్టాంగ్ 2-డోర్ కూపే (2 మరియు 2+2 సీటింగ్), హ్యాచ్‌బ్యాక్, ఫాస్ట్‌బ్యాక్ మరియు కన్వర్టిబల్ బాడీ స్టయిల్స్‌లో లభిస్తుంది. స్టాండర్డ్ ఫోర్డ సెడాన్ సెడాన్ వేరియంట్ మస్టాంగ్ అస్సలు తయారే కాలేదు.

మస్టాంగ్ కూపే మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో (3.7 లీటర్ వి6, 5.0 లీటర్ మస్టాంగ్ జిటి, 5.8 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8) లభిస్తుంది. మస్టాంగ్‌ను తొలిసారిగా ఏప్రిల్ 17, 1964లో న్యూయార్క్‌లో విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ డజన్ల కొద్దీ స్పెషల్ ఎడిషన్లు, మోడిఫైడ్ మస్టాంగ్‌లు చాలానే పుట్టుకొచ్చాయి.

More from DriveSpark

Article Published On: Friday, June 27, 2014, 11:21 [IST]
English summary
As we aware Dubai Police have all the glory with their fantastic supercar fleet, Now Dubai Ambulance Service has now joined in as well. Only they’ve gone for more practical choices – a pair of Ford Mustangs to work as First Responders.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+