మినీ ట్రక్కుని ఢీ కొన్న ఫోర్డ్ మస్టాంగ్ స్పోర్ట్స్ కార్

ఫోర్డ్ మస్టాంగ్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ కార్లలో ఒకటి. ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉంది. ఇది భారతదేశంలో ఉన్న రెండు డోర్స్ కలిగిన ఏకైక మోడల్ కారు.

మినీ ట్రక్కుని ఢీ కొన్న ఫోర్డ్ మస్టాంగ్ స్పోర్ట్స్ కార్

భారతీయ రోడ్లపై ఎక్కువ సంఖ్యలో ఫోర్డ్ మస్టాంగ్ కనిపించదు. కానీ ఫోర్డ్ మస్టాంగ్ అత్యంత ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ కార్. ఫోర్డ్ మస్టాంగ్ కారుకి ఇటీవల ప్రమాదం జరిగింది. కారు ఓనర్ క్షేమంగా తప్పించుకున్నాడు. ఇంతకీ ఈ ఫోర్డ్ కారుకి ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

మినీ ట్రక్కుని ఢీ కొన్న ఫోర్డ్ మస్టాంగ్ స్పోర్ట్స్ కార్

కేరళలో ఫోర్డ్ మస్టాంగ్ కారుకి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదం జరిగిన వీడియో చూస్తే ఇండియన్ రోడ్లలో ఎలా డ్రైవ్ చేయకూడదో తెలుస్తుంది.

మినీ ట్రక్కుని ఢీ కొన్న ఫోర్డ్ మస్టాంగ్ స్పోర్ట్స్ కార్

కేరళలో చాల రోడ్లలో డివైడర్లు ఉండవు. అన్ని రహదారులు ఒకే లాగ ఉంటాయి. వచ్చే వాహనాలు మరియు వెళ్లే వాహనాలు అన్ని కూడా ఒకే రోడ్డుపై ఎదురెదురుగా ప్రూయాణించే దృశ్యాలను భారతదేశంలో ఇదివరకే చాలా చూసాము. ఈ విధంగా ఉన్న ఈ రోడ్లలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న సిసి కెమెరా ఆధారంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది.

మినీ ట్రక్కుని ఢీ కొన్న ఫోర్డ్ మస్టాంగ్ స్పోర్ట్స్ కార్

రహదారిపై వస్తున్న ట్రక్ ని చూసి ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు డ్రైవర్ కారుని ఆపుతాడు. ఆ స్విఫ్ట్ కారు వెనుక ఉన్న మరో కారు డ్రైవర్ కూడా అవుతాడు, కానీ తరువాత వస్తున్న ఫోర్డ్ మస్టాంగ్ డ్రైవర్ మాత్రం కారుని ఆపలేకపోయాడు.

ఫోర్డ్ మస్టాంగ్ కారుని ఆపలేకపోవడం వల్ల ఎదురుగా సైడ్ వెళ్ళడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఎదురుగా వస్తున్న ట్రక్ ఢీ కొంటుంది. సాధారణంగా ఎక్కువ వేగంతో వెళేత్రప్పుడు వాటిని వెంటనే ఆపడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఆపడానికి వీలు కానందువల్ల ఈ ప్రమాదం జరిగింది.

మినీ ట్రక్కుని ఢీ కొన్న ఫోర్డ్ మస్టాంగ్ స్పోర్ట్స్ కార్

భారతీయ రోడ్లపై అక్కడక్కడా ఆవులు, ఇతర జంతువులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని చిన్న రోడ్లపై వేగంగా వెళ్లడం అంత మంచిది కాదు. వేగంగా వెళ్లడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే అవుతుంది. అందువల్ల వీలైనంతగా వాహనాన్ని నెమ్మదిగా నడపడం మంచిది.

Image Courtesy: Team BHP

Most Read Articles

English summary
Ford Mustang’s head-on crash with a mini truck shows the perils of speeding [Video]. Read in Telugu.
Story first published: Tuesday, March 10, 2020, 15:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X