మస్టాంగ్ 50 ఏళ్ల వేడుక సందర్భంగా ఫోర్డ్ షినోలా స్పెషల్ ఎడిషన్ వాచ్
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేక సందర్భాలు, వేడుకలను పురస్కరించుకొని, తమ పాపులర్ కార్ల నుంచి స్ఫూర్తి సరికొత్త, విలాసవంతమైన చేతి ఘడియారాలను తయారు చేయటాన్ని మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. తాజాగా అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న మజిక్యులర్ కార్ బ్రాండ్ 'మస్టాంగ్' (Mustang) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ స్పెషల్ ఎడిషన్ వ్రిస్ట్ వాచ్ (చేతి ఘడియారం)ను విడుదల చేసింది.
ఫోర్డ్ షినోలా (Ford Shinola) పేరుతో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ వాచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఫోర్డ్ మస్టాంగ్ బ్రాండ్ 50 వసంతాలను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ ఈ వాచ్‌ను ప్రవేశపెట్టింది. డెట్రాయిట్‍కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల తయారీ సంస్థ షినోలా ఈ స్పెషల్ ఎడిషన్ వ్రిస్ట్ వాచ్‌ను తయారు చేసింది.
ఫోర్డ్ షినోలా చేతి ఘడియారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫ్రంట్ వ్యూ
షినోలా వాస్తవానికి ఘడియారాల తయారీ కంపెనీ కాదు, ఇదొక విలాసవంతమైన ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ. షినోలా సైకిళ్లు కూడా మంచి ప్రాచుర్యాన్ని కలిగి ఉన్నాయి.

సైడ్ వ్యూ
ఈ చేతి ఘడియారంలో ఉపయోగించిన సఫైర్ క్రిస్టల్ ఫ్రంట్ గ్లాస్ గీతలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీని స్ట్రాప్‌ను నల్లటి ప్రీమియం లెథర్‌తో తయారు చేశారు.

రియర్ వ్యూ
ఈ వాచ్ ముందు భాగంలో అలాగే వెనుక భాగంలో ఫోర్డ్ మస్టాంగ్ 50 ఏళ్ల లోగో దర్శనమిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ వాచ్.

లెథర్ స్ట్రాప్
ఫోర్డ్ షినోలా లిమిటెడ్ ఎడిషన్ వాచ్. కేవలం 1000 యూనిట్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేయనుంది. ఒక్కొక్క చేతి ఘడియారం ధర కేవలం 700 డాలర్లు మాత్రమే (మన దేశ కరెన్సీలో సుమారు 42 వేల రూపాయలకు పైమాటే.
వీడియో
ఫోర్డ్ షినోలా స్పెషల్ ఎడిషన్ వాచ్‌కు సంబంధించిన వీడియోను తిలకించండి.


Click it and Unblock the Notifications








