నిజమే.. మన దేశంలో తయారైన కార్లు.. విదేశీ ఆర్మీ/పోలీసులకు అధికారిక వాహనాలు

ఆసియాతో పాటు వివిధ దేశాల్లో భారత్ లో తయారైనా కార్లు ఇతర దేశాల్లో అధికారిక వాహనాలగా కొనసాగుతున్నాయి. కొన్ని దేశాల్లో భారతీయ వాహనాలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. పొరుగు దేశాలు భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన వాహనాలను ముఖ్యంగా SUVలను అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి.

దేశీయ SUV (Sport Utility Vehicles) ఉత్పత్తులను ఆసియా, ఆఫ్రికన్, యూరోపియన్ దేశాలు తమ సైనిక, పోలీసు సిబ్బంది అధికారిక వాహనాలుగా ఉపయోగిస్తున్నాయి. చాలా దేశాల్లో అధిక శాతం మన దేశం నుంచి ఎగుమతి చేసిన వాహనాలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విదేశీ మిలిటరీ, పారామిలిటరీ బలగాలు ఉపయోగిస్తున్న భారతదేశంలోని తయారైనా కొన్ని SUV మోడళ్ల వివరాలు మీకోసం..

మహీంద్రా

బంగ్లాలో హెక్స్ MPV..

బంగ్లాదేశ్ ఆర్మీ అధికారిక వాహనంగా టాటా మోటార్స్ కి చెందిన హెక్సా MPVని వినియోగిస్తుంది. ఈ కాంట్రాక్టును పొందేందుకు హెక్సా కఠినమైన పరీక్షలను ఎదుర్కొంది. అనంతరం దీనిని ఆర్మీ అధికారిక వాహనాలుగా వాడుతున్నాయి. ముదురు ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఈ వాహనానాలను టాటా మోటార్స్ రూపొందించింది. మొత్తం ఆ దేశం 200 MPVలకు పైగా వాహనాలను ప్రస్తుతం ఉపయోగిస్తుంది.

మహీంద్రా ఎన్ ఫోర్సర్

ఫిలిప్పీన్స్‌లో..

మహీంద్రాకు చెందిన యుటిలిటీ వెహికిల్స్ ని చాలా దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. మహీంద్రా ఎన్‌ఫోర్సర్‌ని ఫిలిప్పీన్స్‌లో పోలీసు కారుగా ఆ దేశం ఉపయోగిస్తుంది. ముందు బొలెరో లాగా కనిపించే మహీంద్రా ఎన్‌ఫోర్సర్ భారతదేశంలో ప్రత్యేకంగా తయారు చేయబడింది. తరువాత దీనిని ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేశారు.

మహీంద్రా

2015లో, ఫిలిప్పీన్ పోలీసు దళం మొత్తం 1,470 ఎన్‌ఫోర్సర్ యూనిట్లను ఆ దేశం కొనుగోలు చేసింది. దీనికోసం P1.3 బిలియన్లను ఖర్చు చేసింది. అలానే మహీంద్రా స్కార్పియోను తమ ఫ్లీట్‌లో ఉపయోగిస్తున్నారు. అక్కడ ఉన్న భద్రతా దళం 2016లో P394 మిలియన్లకు పైగా వెచ్చించి మొత్తం 398యూనిట్ల ఫోర్-వీల్ డ్రైవ్-ఎక్విప్డ్ SUVలను కొనుగోలు చేసింది.

మహీంద్రా

దక్షిణాఫ్రికా..

మహీంద్రాలో అత్యంత ప్రజాధరణ పొందిన మరో యుటిలిటీ వెహికిల్ XUV500. దక్షిణాఫ్రికా పోలీసులు దీనిని అధికారికంగా ఉపయోగిస్తున్నారు. ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో తయారు చేయబడిన ఈ టాప్-స్పెక్ W8 వేరియంట్‌ను ఆ దేశం ఉపయోగిస్తుంది. పలు భద్రతా పరమైన ఫీచర్లను ఆ సంస్థ ఇందులో ప్రత్యేకంగా అమర్చింది.

మహీంద్రా భూటాన్

భూటాన్..

భూటాన్‌లో పారామిలిటరీ బొలెరో పిక్-అప్ ట్రక్ ఎన్‌ఫోర్సర్ భూటాన్ కు భద్రతా సేవలను అందిస్తోంది. ఆ దేశ సైన్యంలో ఈ ట్రక్ ఉపయోగించబడుతుంది. 4-సిలిండర్, 2.5-లీటర్ టర్బోడీజిల్ ఇంజన్ కలిగిన ఈ ట్రక్.. గరిష్టంగా 100 హార్స్‌పవర్ 240 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 4-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ ఎంపిక ఇందులో ఉంది.

టాటా అల్జీరియా

అల్జీరియా..

ఉత్తర ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న దేశాలలో ఒకటైన అల్జీరియా టాటా SUVలను భారీగా దిగుమతి చేసుకుంది. వాస్తవానికి, టాటా సఫారి స్టార్మ్ అల్జీరియాకు ప్రధాన పోలీసు వాహనంగా పనిచేస్తుంది. మహీంద్రా స్కార్పియో మాదిరిగానే ఇది అద్భుతమైన పనితీరు కనబర్చనుంది. ఇంటీరియర్ సౌలభ్యం, ఆఫ్-రోడింగ్ సామర్ధ్యం ఖర్చుతో కూడిన అద్భుతమైన బ్యాలెన్స్‌ని అందిస్తుండటంతో అక్కడి పోలీస్ ఫోర్స్ సఫారీని ఎంచుకుంది.

మహీంద్రా

మాల్దీవులు..

భారతదేశంలో భారీ అభిమానులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన మరో SUV మహీంద్రా స్కార్పియో. ఇతర దేశాల్లో కూడా ఈ మోడల్ బాగా ప్రాచుర్యం పొందింది. హిందూ మహాసముద్రంలో ఉన్న మాల్దీవుల అందమైన దీవులకు రాజధాని మాలే పోలీసు అధికారులు ఈ SUVని ఉపయోగిస్తున్నారు. మాలే పోలీసులు ఉపయోగించే మోడల్ మెరుగైన పనితీరు కోసం 4WD సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో గేట్ వే

ఇటలీ..

ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన ఆటోమొబైల్స్‌లో కొన్ని ఇటలీలో ఉత్పత్తి చేయబడ్డాయి. ఆ దేశంలో అత్యవసరాల్లో పనిచేసే సంస్థ Ssoccorso Alpino ఇటాలియన్ సెక్యూరిటీ స్క్వాడ్, మహీంద్రా స్కార్పియో గేట్ వేను ఉపయోగిస్తుంది. ఇది అత్యంత ప్రజాధరణ కల్గిన పికప్ ట్రక్కుగా గూర్తింపు పొందింది. స్కార్పియో గేట్ వే, ఇటాలియన్ పోలీసులకు బ్యాక్ అప్ (జంటగా) ఉన్న క్యాబ్ వాహనంగా పేరొందింది.

మహీంద్రా

శ్రీలంకలో..

మరో పొరుగు దేశమైన శ్రీలంక కూడా తన పోలీసు ఫ్లీట్‌లలో నమ్మదగిన మహీంద్రా స్కార్పియోను ఉపయోగిస్తుంది. స్కార్పియో బేస్ వేరియంట్‌ను ఆ దేశం ఉపయోగిస్తుంది. పోలీస్ ఫోర్స్ LX-ట్రిమ్‌లో 485 యూనిట్ల స్కార్పియోలను కొనుగోలు చేసింది. ఇంకా చాలా దేశాలు మన దేశంలో మాన్ ఫాక్టర్ అయిన కార్లను అధిక మొత్తంలో ఉపయోగిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, March 20, 2023, 15:41 [IST]
English summary
Foreign military and police forces that use indian suvs in their fleets here the full details in tel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+