ఒక బైకుపై ఆరుమంది ప్రయాణం!.. షాకయిన విదేశీయుడు - వీడియో

సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తరువాత మనం నిత్యం ఏదో ఒక ఆశ్చర్యపరిచే సంఘటనను చూస్తూ ఉంటాము. అలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక బైక్ మీదే 6మంది వెళ్లడం చూడవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. ఒకే బైకు మీద ఏకంగా ఆరు మంది వెళ్తున్నారు. ఈ వీడియో ఒక విదేశీయున్ని ఆకర్శించింది. ఈ వీడియో నిక్‌కెట్రావెల్ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్ చేశారు. ఇందులో హీరో ప్యాషన్ మోటార్‌సైకిల్‌పై ఐదుమంది కూర్చున్నారు. వారందరూ కలిసి మరో వ్యక్తి పట్టుకున్నారు. ఈ వీడియో చూసి షాకయిన విదేశీయుడు ఇది కేవలం ఇండియాలో మాత్రమే సాధ్యం అంటూ పేర్కొన్నాడు.

Six People on Single Bike

బైకుపై ఆరు మంది ఉన్నప్పటికీ.. బైక్ సజావుగా ముందుకు వెళ్లడం చూడవచ్చు. రైడర్ కూడా చాకచక్యంగా బైక్ రైడ్ చేస్తున్నాడు. చూడటానికి ఇది ఒక స్టంట్ మాదిరిగా అనిపిస్తోంది. చూడటానికి బాగానే ఉన్నప్పటికీ ఇది అత్యంత ప్రమాదకరం. అనుకోని ప్రమాదం జరిగితే ఆరు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పక్కా. రైడర్ వెనుక నలుగురు కూర్చుని ఉండటం ఈ వీడియోలో చూడవచ్చు.

ఒక బైకుపై ఒకరు లేదా ఇద్దరు వెళ్లడం సులభం. ఇంకా మనం ముగ్గురు వెళ్లడం కూడా చూసి ఉంటాము. కానీ బైకుపై ఆరు మంది అంటే తప్పకుండా అందరూ షావుతారు. వీడియో చూస్తే ఇది నిజమే అని నమ్మక తప్పదు. అయితే ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధం మరియు ప్రమాద హేతువు. ఇలాంటి సంఘటనలపైన పోలీసులు చర్యలు తీసుకుంటారు. తప్పకుండా ఇలాంటివి వాహన వినియోగదారులు గుర్తుంచుకోవాలి.

Six People on Single Bike

బైకుపై ఆరు మంది కూర్చుని ప్రయాణించడం సురక్షితమేనా? అని ప్రశ్నించుకుంటే. ఇది ఖచ్చితంగా సురక్షితం కాదని చెప్పేయొచ్చు. నిజానికి ఇద్దరికంటే కూడా ఎక్కువ మంది బైకుపై వెళ్ళకూడదు. బైకుపై వెళ్లే వారు (రైడర్ & పిలియన్) హెల్మెట్ ధరించి ఉండాలి. లేకుంటే ప్రమాదం జరిగినప్పుడు తీవ్రంగా గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా రైడర్స్ గుర్తుంచుకోవాలి.

ఏదైనా టూ వీలర్ దాని లోడ్ సామర్త్యని కంటే ఎక్కువ బరువు మోయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా బ్యాలెన్స్ తప్పిపోతోంది. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ వీడియోలో కనిపించే రైడర్ హెల్మెట్ ధరించలేదు. మిగిలిన వారు కూడా హెల్మెట్స్ ధరించలేదు. వీరు సరైన భద్రతలను కూడా పాటించడం లేదు. ఇది వారికి చాలా ప్రమాదాన్ని తీసుకువస్తుంది. ఇవన్నీ ఇలాంటి వాటిని ప్రయత్నించానుకునే వారు ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలి.

ఈ సంఘటనలో బైకుపైన ప్రయాణించే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు మరియు వారి వల్ల ఇతరులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదు. ఇలాంటి కార్యకలాపాలు భారతదేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. తప్పకుండా దీనిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే వీరిని మరి కొందరు అనుసరించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, April 1, 2024, 16:00 [IST]
English summary
Foreigner shocked after seeing six people on single bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+