జింకలకు ఆహారం అందించి ఇబ్బందుల్లో పడ్డ జర్నలిస్ట్; ఎలా అనుకుంటున్నారా?

సాధారణంగా అభయారణ్యం లేదా అటవీ శాఖ పరిధిలో ఉన్న వన్య ప్రాణులకు ఆహారం ఇవ్వడం చట్ట విరుద్ధం. అయితే ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లైతే వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఇలాంటి నియమాలు ఎన్ని అమలు చేసినాగాని ప్రజలు తమ పద్దతులను మార్చుకోవడం లేదు. అటవీ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు అక్కడున్న జంతువులకు ఆహరం ఇవ్వడం మరియు వాటితో ఫోటోలు తీసుకోవడం వంటి చేస్తుంటారు.

ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు శిక్షార్హులు. ఇలాంటి సంఘటనలు ఇదివరకే చాలా వెలుగులోకి వచ్చాయి. ఇదే తరహాలో మళ్ళీ ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

జింకలకు ఆహారం అందించి ఇబ్బందుల్లో పడ్డ జర్నలిస్ట్; ఎలా అనుకుంటున్నారా?

నివేదికల ప్రకారం ఈ సంఘటన బండిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగింది. ఈ సంఘటనకు పాల్పడిన యువకులపై అటవీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అటవీ అధికారులు వన్యప్రాణుల అభయారణ్యం లేదా జాతీయ ఉద్యానవనం లేదా అటవీప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు జంతువులకు ఆహారం ఇవ్వకూడదని సూచనా బోర్డులను ఏర్పాటు చేసి ఉంటారు.

జింకలకు ఆహారం అందించి ఇబ్బందుల్లో పడ్డ జర్నలిస్ట్; ఎలా అనుకుంటున్నారా?

అటవీ జంతువులకు ఆహారం అందించే సమయంలో కొన్నిసార్లు విపత్తులకు దారితీస్తుంది. సందర్శకులు అందించే ఆహారం వల్ల మానవులు మరియు జంతువుల మధ్య సంఘర్షణ వంటి సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిని నివారించడానికి జంతువులకు ఆహారం ఇవ్వకూడదని అటవీ అధికారులు సలహా ఇస్తున్నారు.

జింకలకు ఆహారం అందించి ఇబ్బందుల్లో పడ్డ జర్నలిస్ట్; ఎలా అనుకుంటున్నారా?

ఈ నిబంధనను ఉల్లంఘించి మహీంద్రా ఎక్స్‌యువి 500 కారులో వచ్చిన యువకులు జింకలకు ఆహారం పెట్టారు. సమాచారం అందుకున్న తరువాత, బందిపూర్ టైగర్ కన్జర్వేషన్ అధికారులు యువకులపై చర్యలు తీసుకున్నారు. జింకలకు ఆహారం ఇచ్చిన వ్యక్తి జర్నలిస్ట్ అని తెలిసింది.

జింకలకు ఆహారం అందించి ఇబ్బందుల్లో పడ్డ జర్నలిస్ట్; ఎలా అనుకుంటున్నారా?

ఈ సంఘటనకు కారకుడైన వ్యక్తి ఢిల్లీ నగరానికి చెందిన జర్నలిస్ట్. యితడు ఒక నేషనల్ న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్నాడు. అతను ఆగస్టు 3 వ తేదీ ఉదయం 11 గంటలకు బందీపూర్ మార్గంలో ఊటీకి వెళ్లాడు. వారు అదే మార్గంలో వెళ్తున్నప్పుడు జింకలను ఆహరం అందిస్తూ, ఫోటోలు కూడా తీసుకున్నారు, ఈ ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యాయి.

జింకలకు ఆహారం అందించి ఇబ్బందుల్లో పడ్డ జర్నలిస్ట్; ఎలా అనుకుంటున్నారా?

ఈ ఫోటోల ఆధారంగా జర్నలిస్టుపై అటవీ శాఖ చర్యలు తీసుకుంది. వారు జింకలకు ఆహారం తినిపించే ఫోటోలు తీయలేదు, కానీ వారి ముందు వస్తున్న మరో కారులోని వ్యక్తులు ఫోటోలు తీశారు. తరువాత వారు ఈ ఫోటోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పంచుకున్నాడు.

జింకలకు ఆహారం అందించి ఇబ్బందుల్లో పడ్డ జర్నలిస్ట్; ఎలా అనుకుంటున్నారా?

ఈ ఫోటోలు కాస్త వైరల్ అవడంతో అటవీ శాఖ జర్నలిస్ట్‌పై చర్యలు తీసుకుంది. వారికి అటవీ అధికారులు హెచ్చరిక కూడా జారీ చేశారు. మానవులు అందించే ఆహారాన్ని తినే వన్యప్రాణులు అడవిలో ఆహారం కోసం చూసే బదులు రోడ్డు పక్కన నిలబడటం ప్రారంభిస్తాయి.

జింకలకు ఆహారం అందించి ఇబ్బందుల్లో పడ్డ జర్నలిస్ట్; ఎలా అనుకుంటున్నారా?

దీనివల్ల దట్టమైన అడవిలోని జంతువులు రోడ్డుపైకి వస్తాయి. ఈ సమయంలో, హై స్పీడ్ వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అటవీ శాఖ పర్యాటకులకు ఇటువంటి విషాదాలను తొలగించడానికి జంతువులకు ఆహారం ఇవ్వవద్దని సూచించింది.

జింకలకు ఆహారం అందించి ఇబ్బందుల్లో పడ్డ జర్నలిస్ట్; ఎలా అనుకుంటున్నారా?

కొంతమంది అటవీ శాఖ సూచనలకు పెడచెవిన పెట్టి వన్యప్రాణులకు ఆహారం ఇస్తారు. ఇలాంటి చర్యలు పదేపదే జరగకుండా ఉండటానికి అటవీ శాఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఈ వైరల్ ఫోటోల ఆధారంగా జర్నలిస్టులపై చర్యలు తీసుకుంది. మీరు అటవీ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం మంచిది.

Most Read Articles

English summary
Forest department takes action against journalist for feeding wild animal details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X