బుల్లెట్, క్లాసిక్ మాత్రమే కాదు.. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీలో ఇంకా ఎన్నో బైకులు ఉన్నాయ్

1901 కాలంలో ప్రాణం పోసుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశపు అతి పురాతణ మోటార్‌సైకిల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 100 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణంలో రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని లెజెండరీ మరియు ఐకానికి మోడళ్లను

By N Kumar

1901 కాలంలో ప్రాణం పోసుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశపు అతి పురాతణ మోటార్‌సైకిల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 100 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణంలో రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని లెజెండరీ మరియు ఐకానికి మోడళ్లను ఉత్పత్తి చేసింది.

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా 1955లో తయారీ ప్లాంటును నెలకొల్పిన తరువాత పలు ఆసక్తికరమైన మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసింది. ఏదేమైనప్పటికీ, రాయల్ ఎన్పీల్డ్ ఉత్పత్తి చేసిన ఎన్నో రకాల మోడళ్లను కాలం మరిచిపోయింది. అందులో ఇండియా మరిచిపోయిన ఏడు అతి ముఖ్యమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేటి ప్రత్యేక కథనంలో తీసుకొచ్చింది.

బుల్లెట్, క్లాసిక్, థండర్‌బర్డ్ మరియు ఇంటర్‌సెప్టార్ మాత్రమే కాదు... ఎన్ఫీల్డ్ ఫ్యామిలీలో ఇంకా ఎన్నో బైకులు ఉన్నాయి. వాటి మీద ఓ లుక్కేసుకుందాం రండి...

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

07. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యూరీ 175

రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యూరీ పేరు 1959లో బ్రిటీష్ మార్కెట్లో తొలిసారిగా పరిచయం అయ్యింది. ఇండియన్ మార్కెట్లోకి ఫ్యూరీ బైకును 163సీసీ సింగల్ సిలిండర్ ఇంజన్‌తో లాంచ్ చేసింది. ఇండియన్ వెర్షన్ ఫ్యూరీ బైకు జుండాప్ కెఎస్175 పేరుతో జర్మనీ నుండి లైసెన్స్ పొందిన మోడల్.

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

1984లో ఈ జర్మన్ కంపెనీ కార్యకలాపాలు నిలిపివేయడంతో వీటి విడి పరికరాలను దిగుమతి చేసుకుని ఫ్యూరీ 175 బైకులను రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తి చేసేది. అప్పట్లో దీనికి విపరీతమైన ఫ్యాన్స్ ఉండేవారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్స్ ఇంకా ఎన్నో ప్రత్యేకతలు దీని సొంతం.

Image Source: Team-BHP

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

06. రాయల్ ఎన్ఫీల్డ్ లైటింగ్

రాయల్ ఎన్ఫీల్డ్ లైటింగ్ ప్రస్తుతం విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ యొక్క ఓల్డ్ వెర్షన్. థండర్‌బర్డ్ శైలిని పోలి ఉండే క్రూయిజర్ డిజైన్ లైటింగ్ మోటార్‌సైకిల్ సొంతం.

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

అప్పట్లో లాంగ్ డ్రైవ్‌లకు బెస్ట్ క్రూయిజర్ అంటే ఇదే. ఏదేమైనప్పటికీ, ఈ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్‌కు సక్సెస్ సాధించిపెట్టలేకపోయింది. దీంతో 2003లో మార్కెట్ నుండి దీనిని తొలగించారు. సాంకేతికంగా ఇందులో 26బిహెచ్‌పి పవర్ మరియు 38ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 4-స్పీడ్ గేర్‌బాక్స్ గల 535సీసీ ఇంజన్ ఉండేది.

Image Source: Droom

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

05. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్‌ప్లోరర్ 50

జర్మీనికి చెందిన జుండాపా బ్రాండ్ నుండి రాయల్ ఎన్ఫీల్డ్ దిగుమతి చేసుకొన్న మోరో మోడల్ ఎక్స్‌ప్లోరర్ 50. 1980 కాలంలో కేవలం కొన్నాళ్లు మాత్రమే దేశీయ విపణిలో లభించింది. జర్మనీలో వీటిని 16 ఏళ్ల వయస్సున్న వారికి విక్రయించే వారు.

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

జర్మనీ నిభందనల ప్రకారం, మోకిక్ అనే కెటగిరీలో విడుదలయ్యే బైకులను 16 ఏళ్ల వయస్సున్న వారు లైసెన్స్ లేకపోయిన నడపవచ్చు. 50సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న బైకు మోకిక్ కెటగిరీ ప్రమాణాలను పాటించడంతో అక్కడ మంచి సక్సెస్ సాధించింది. అయితే, ఆ సక్సెస్ ఇండియన్ మార్కెట్లో కొనసాగలేకపోయింది.

Image Source: Blogspot & Team-BHP

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

04. రాయల్ ఎన్ఫీల్డ్ సిల్వర్ ప్లస్

రాయల్ ఎన్ఫీల్డ్ సిల్వర్ ప్లస్ స్టెప్-త్రూ మోటార్ సైకిల్ అంటారు. స్టెప్ త్రూ అంటే, ఒకప్పటి టీవీఎస్ 50 మరియు ప్రస్తుతం ఉన్న టీవీఎస్ ఎక్స్ఎల్ వంటి టూ వీలర్లను స్టెప్-త్రూ టూ వీలర్లు అంటారు.

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ దీనిని 1980లో లాంచ్ చేసింది. ఇందులో హ్యాండ్ ఆపరేటెడ్ కేబుల్ లింక్ గేర్ షిప్టర్ కలదు. సిల్వర్ ప్లస్ టూ వీలర్‌లో సాంకేతికంగా గాలితో చల్లబడే 65సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 2-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించేది.

Image Source: ebay

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

03. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాంటాబులస్

దేశీయ విపణిలో మంచి వృద్దిని నమోదు చేసుకుంటున్న ఇండియన్ స్కూటర్ సెగ్మెంట్లో తన వాటాను పెంచుకునేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాంటాబులస్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. అవును, మీరు చదివింది నిజమే, రాయల్ ఎన్ఫీల్డ్ స్కూటర్లను కూడా తయారు చేసింది. అయితే, మార్కెట్లో ఆశించిన మేర పాపులారిటీ లభించలేదు.

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాంటాబులస్ స్కూటర్‌లో 7.5బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 175సీసీ కెపాసిటి గల 2-స్ట్రోక్ ఇంజన్ ఉండేది. ఆ కాలంలోనే ఇందులో సెల్ఫ్-స్టార్టర్ ఫీచర్ పరిచయం అయ్యింది.

Image Source: Classicmotorworks

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

02. రాయల్ ఎన్ఫీల్డ్ టారస్ డీజల్

డీజల్ టూ వీలర్లను తయారు చేసిన ఘనత ఎప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్‌దే అనే ముక్తకంఠంతో చెప్పవచ్చు. భారీ సంఖ్యలో తయారైన భారతదేశపు ఏకైక డీజల్ మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ టారస్ డీజల్.

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ టారస్‌లో లాంబార్డినీ ఇన్‌‌డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ గల 325సీసీ సింగల్ సిలిండర్ డీజల్ ఇంజన్ ఉండేది. 6.5బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే దీని గరిష్ట వేగం గంటకు 65కిలోమీటర్లు మరియు దీని బరువు 196కిలోలు. అప్పట్లో రాయల్ ఎన్ఫీల్డ్ టారస్ డీజల్ బైకు "డీజల్ బుల్లెట్" పేరుతో బాగా సుపరిచితం.

Image Source: Databikes

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

01. రాయల్ ఎన్ఫీల్డ్ మోఫా

తేలికపాటి సస్పెన్షన్ వ్యవస్థ ఉన్నటువంటి 25సీసీ ఇంజన్ గల మోఫా టూ వీలర్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లోని మోపెడ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. మోఫా మోపెడ్‌ను ఇటలీలో డిజైన్ చేసి అభివృద్ది చేశారు.

ఇండియా మరిచిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ కెపాసిటితో ఉత్పత్తి చేసిన బైకు మోఫా. తమిళ నటుడు ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ చిత్రంలో హీరో ఉపయోగించిన బైకు ఇదే.

Image Source: Wiki Commons

Most Read Articles

English summary
Read In Telugu: FORGOTTEN Royal Enfields of India: Fury 175 to Fantabulous scooter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X