ఇండియన్స్ మరిచిపోయిన టాటా కార్లు మరియు ఎస్‌యూవీలు

టాటా మోటార్స్ భారతదేశపు వాహన తయారీ సంస్థగా పేరుగాంచినప్పటికీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో రాణించలేకపోయింది. సంవత్సరాల చరిత్ర గల టాటా ఇప్పటి వరకు ఎన్నో రకాల మోడళ్లను పరిచయం చేసింది.

By N Kumar

టాటా మోటార్స్ భారతదేశపు వాహన తయారీ సంస్థగా పేరుగాంచినప్పటికీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో రాణించలేకపోయింది. సంవత్సరాల చరిత్ర గల టాటా ఇప్పటి వరకు ఎన్నో రకాల మోడళ్లను పరిచయం చేసింది. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, మరికొన్ని అవలేదు.

ఎన్నో ఆశలతో మార్కెట్లోకి టాటా విడుదల చేసిన కార్లు అడ్రస్ లేకుండా మార్కెట్ నుండి వెళ్లిపోయాయి. అలాంటి కార్లను ఇండియన్స్ ఎప్పుడో మరిచిపోయారు. ఇండియా మరిచిపోయిన పది టాటా కార్లు మరియు ఎస్‌యూవీలను ఇవాళ్టి కథనంలో జ్ఞాపకం చేసుకుందాం రండి...

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

సియెర్రా

కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఓ రెండు ఉదాహరణలు ఇవ్వమంటే... ఎకోస్పోర్ట్, వితారా బ్రిజా అని టక్కున్న చెప్పేస్తారు. అయితే, ఇండియన్ మార్కెట్లోకి మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేసింది ఎవరో తెలుసా...? ఖచ్చితంగా టాటా మోటార్స్. టాటా సియెర్రా కాంపాక్ట్ ఎస్‌యూవీని 2-లీటర్ డీజల్ మరియు టుర్బో డీజల్ ఇంజన్‌తో 4X4 డ్రైవ్‌ సిస్టమ్‌తో లాంచ్ చేసింది. ఇప్పుడు ఇలాంటి వాటిని చూద్దామన్న కనబడవు.

Recommended Video

[Telugu] Suzuki Intruder 150 Launched In India
ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

ఎస్టేట్

ఎస్టేట్ పేరుతో పిలువబడే ఈ వెహికల్ స్టేషన్ వ్యాగన్ స్టైల్‌కు చెందినది. 1980ల కాలం నాటి మెర్సిడెస్ బెంజ్ స్టేషన్ వ్యాగన్ ఆధారంగా సియెర్రా ఎస్‌యూవీలో ఎక్ట్సీరియర్ మరియు కాస్నొటిక్ మెరుగులుదిద్ది ఎస్టేట్ పేరుతో పరిచయమయ్యింది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

మెర్సిడెస్ బెంజ్ మరియు టాటా ఇండియాలో ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్నపుడు దీనిని అభివృద్ది చేసింది. మెర్సిడెస్ నుండి వేరయ్యేంత వరకు టాటా ఎస్టేట్ ప్రొడక్షన్‌లో ఉండేది. ఇండియాలో ఇప్పటికీ స్టేషన్ వ్యాగన్ తరహా వాహనాలు ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోయాయి. దీంతో ఎస్టేట్ వెహికల్ అనతి కాలంలోనే మార్కెట్ నుండి దూరమయ్యింది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

మొబైల్

ఇండియన్ మార్కెట్లోకి తొలిసారిగా ఫ్యామిలీ కారు కొనుగోలుదారుల కోసం పికప్ ట్రక్కును టాటా మోటార్స్ పరిచయం చేసింది. రెండు వరుసల సీటింగ్ మరియు లగేజ్ క్యాబిన్ అందించి మొబైల్ అనే పికప్ ట్రక్కును విడుదల చేసింది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

అప్పట్లో సరకు రవాణా కోసం 407 వెహికల్‌ను అద్దెకు తీసుకుంటే, ఫ్యామిలీ ట్రిప్స్‌ వెళ్లడానికి టాటా మొబైల్ వాహనాన్ని అద్దెకు తీసుకునే వారు. సియెర్రా మరియు ఎస్టేట్ వెహికల్స్‌లో అందించిన 68బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 2-లీటర్ డీజల్ ఇంజన్‌‌తో టాటా మొబైల్ లభించేది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

సఫారీ పెట్రోల్

పెట్రోల్ పవర్ సఫారీ... పెట్రోల్ సఫారీ అని ఆశ్చర్యపోతున్నారా...? నిజమే, 2000 కాలంలో సఫారీ ఎస్‌యూవీ 2.0-లీటర్ కెపాసిటి గల 135బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల పెట్రోల్ ఇంజన్‌తో లభించేది. అయితే, దీనితోపాటు 2-లీటర్ డీజల్ ఇంజన్ కూడా సఫారీలో లభించడంతో ఎక్కువ మంది డీజల్ వెర్షన్‌నే ఎంచుకునేవారు.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

నిజమే మరి, 17 సంవత్సరాల తరువాత ఇప్పుడు కూడా పెట్రోల్ ఎస్‌యూవీలను కొనుగోలు చేయడానికి ఇండియన్స్ సందేహిస్తున్నారు. మరి అప్పట్లో అంటే సక్సెస్ అవ్వడం కష్టమే. దీంతో కొన్నాళ్లకే మార్కెట్ నుండి వైదొలగింది.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

అవమానించిన ఫోర్డ్ మీద ఇలా ప్రతీకారం తీర్చుకున్న రతన్ టాటా

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

సఫారీ 3.0 డైకార్

టాటా మోటార్స్ 407 పికప్ ట్రక్కులో ఉండే పెద్ద డీజల్ ఇంజన్‌ను సఫారీలో అందించిన విషయం మీకు గుర్తుందా...? దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. 2002లో స్కార్పియో మార్కెట్లోకి రావడంతో, టాటా మోటార్స్ డ్రాయింగ్ బోర్డులో పెద్ద పరిమాణంలో ఉన్న ఎస్‌యూవీని డిజైన్ చేసి, 407 ట్రక్కు నుండి సేకరించిన ఇంజన్‌ను కామన్ రెయిల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అందించింది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

అలా రూపొందించిన ఇంజన్‌తో వచ్చిన మోడల్‌నే సఫారీ 3.0 డైకార్ అంటారు. అయితే, ఏడాది తిరగకుండానే 3.0 డైకార్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసే 2.2-లీటర్ డీజల్ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది. దీంతో సఫారీ 3.0 డైకార్ విడుదల మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

ఇండిగో మెరీనా

చాలా మంది టాటా ఎలాంటి ప్రయోగాలు ప్రయత్నాలు చేయలదేని తప్పుబడుతుంటారు. అది అక్షరాలా తప్పు. ఎందుకంటే ఇండియన్స్‌ను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందులో ఒకటి, ఇండిగో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేసిన "ఇండిగో మెరీనా" విశాలమైన స్టేషన్ వ్యాగన్.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

స్టేషన్ వ్యాగన్ తరహా మోడళ్లతో హిట్టు కొట్టాలని ప్రయత్నించిన టాటాకు ఇండిగో మెరీనా మళ్లీ షాకిచ్చింది. అప్పట్లో రతన్ టాటా తమ ఇంట్లో ఉండే శునకాల కోసం ఓ ఇండిగో మెరీనా కారును ఎంచుకున్నాడు. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో విశాలమైన క్యాబిన్‌తో ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోయింది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

ఇండిగో ఎక్స్ఎల్

ఇండికా ఫ్లాట్‌ఫామ్ ఎన్నో కొత్త మోడళ్ల ఆవిష్కరణకు కేంద్ర బిందువైంది. అప్పట్లో టాటా ఇండిగా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేసిన ఇండిగో ఎక్స్ఎల్ అత్యంత విశాలమైన క్యాబిన్ మరియు ఇంటీరియర్ స్పేస్ గల సెడాన్ కారుగా నిలిచింది. హోండా అకార్డ్‌తో పోల్చినా కూడా ఇండిగో ఎక్స్ఎల్ పెద్దదిగా ఉంటుంది. మనకైతే చూడటానికి ఇండిగో సెడాన్ ‌ను సాగదీసినట్లుగా ఉంటుంది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

టాటా మాంజా

టాటా మోటార్స్ 2010 లో హోండా సిటి మరియు మారుతి ఎస్ఎక్స్4 మిడ్ సైజ్ లగ్జరీ సెడాన్ కార్లకు పోటీగా అత్యంత సౌకర్యవంతమైన మాంజా సెడాన్ కారును అత్యంత సరసమైన ధరతో విడుదల చేసింది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

టాటా మాంజా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమయ్యేది. సేఫ్టీ పరంగా అప్పట్లో టాటా మాంజా బెస్ట్ ఛాయిస్. అంతే కాకుండా 90బిహెచ్‌పి - 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఫియట్ మల్టీ జెట్ డీజల్ ఇంజన్ తరహా యూనిట్ అందించేది. పర్సనల్ కార్ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోయింది.

ఇండియన్స్ మరిచిపోయిన పది టాటా కార్లు

టాటా స్పేసియో

చాలా మంది టాటా స్పేసియో వాహనాలను చూసుంటారు. అయితే, దీనిని టాటా సుమో అనుకుని పొరబడేరు. టాటా సుమో వేరు, టాటా స్పేసియో 3.0 వేరు. చూడటానికి రెండు ఒకేలా ఉన్నా రెండింటిలో ఇంజన్‌లు వేర్వేరు. టాటా స్పేసియో 3.0 సుమారుగా 2000 కాలం నుండే మార్కెట్లో ఉంది.

టాటా 407 నుండి సేకరించిన 3.0 లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించి. రూరల్ ఏరియాలలో ట్యాక్సీలుగా వాడుకునేందుకు దీనిని అభివృద్ది చేసింది. అయితే, పోలీసులకు ఈ వాహనం బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. అయితే, కొన్నాళ్లకు తమ లైనప్‌ నుండి తొలగించింది.

Most Read Articles

English summary
Read In Telugu: 10 forgotten Tata cars and SUVs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X