ఖరీదైన ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ధోనీ.. ఆ కారు ప్రత్యేకతలు తెలుసా?
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహీంద్రసింగ్ ధోనీకి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇటీవల ధోనీ గ్యారేజీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ధోనీ రాంచీలోని తన ఇంటికి కియా EV6 ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తూ కనిపించాడు. గతంలోనూ ఇదే కారులో రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్‌లతో కలసి కనిపించాడు.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్.. భారత్‌లో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు EV6. ఈ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తోంది. 2022లో ఈ కారును భారత్‌లో విడుదల చేసింది. ఈ కారు 77.4kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 708 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

కియా EV6 ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. 350 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కేవలం 4.5 నిమిషాల ఛార్జింగ్‌తో 100 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. EV6 కారు కేవలం 3.5 సెకన్లలో 100kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ధరలు రూ.59.95 లక్షల నుంచి (ఎక్స్‌షోరూం) ప్రారంభమవుతాయి.
కియా EV6 ఎలక్ట్రిక్ కారు బేస్ వేరియంట్ ఫ్రంట్ మౌంటెండ్ సింగిల్ మోటార్ టూ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్ఠంగా 229bhp శక్తి, 350Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరింత మెరుగైన పనితీరు కోరుకొనే వారికోసం ప్రీమియం ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్.. రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. ఇది 325bhp శక్తి, 605Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రాంఛీలోని ధోనీ నివాసం వద్దనున్న గ్యారేజీలో అనేక క్లాసిక్, లగ్జరీ కార్లు, బైక్‌లు ఉన్నాయి. ఇటీవలే భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ధోనీ ఇంటిని సందర్శించారు. ఆ సమయంలో ధోనీ బైక్, కారు గ్యారేజీ వీడియోను షేర్ చేశారు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
గ్యారేజీలో సూపర్ రేర్ కారు 1969 ఫోర్డ్ ముస్టాంగ్, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్‌ఆమ్ కార్లు ఉన్నాయి. పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్‌ఆమ్ 455 v8 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. యమహా స్పోర్ట్స్ బైక్, యమహా YZF R6, యమహా, యడ్జి, జావా, బీఎస్‌ఏ వంటి ప్రముఖ బ్రాండ్ల వాహనాలు గ్యారేజీలో ఉన్నాయి.

దీంతోపాటు మహీంద్ర సింగ్ ధోనీ గ్యారేజీలో యమహా RD350, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, కవాసకి నింజా ZX 14R, కవాసకీ నింజా H2, హార్లే డివిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటీ 1098, X132 హెల్‌క్యాట్ వంటి ఆధునిక బైక్‌లు సహా మరెన్నో మోడల్‌లు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ 2004 నుంచి 2019 వరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 T20 ఆడాడు. తన అంతర్జాతీయ కెరీల్లో ధోనీ మొత్తం 16 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు చేశాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం IPLలో మాత్రమే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








