Viral Video ధోనీ బైక్ గ్యారేజీ చూశారా.. షోరూం కంటే ఎక్కువ బైక్‌లున్నాయ్..!
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహీంద్ర సింగ్ ధోనికి ఏం ఇష్టం అంటే ఆయన కోసం తెలిసిన అభిమానులు ఎవరైనా బైక్స్ అని వెంటనే సమాధానం చెబుతారు. అయితే ధోనీ బైక్ గ్యారేజీకి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూసిన ఎవరైనా.. గ్యారేజీనా లేదా బైక్ షోరూం అని కచ్చితంగా సందేహపడతారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి జులై 17 (సోమవారం) రాంచీలోని ధోనీ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న ధోనీ బైక్, కార్ గ్యారేజీ చూసి వెంకటేష్ ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బైక్‌లపై ధోనీకి ఉన్న ఆసక్తి చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఇది గ్యారేజీలా కాకుండా బైక్ షోరూంలా ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

నేను చూసిన వ్యక్తుల్లో అత్యంత క్రేజీ పర్సన్ ధోనీ అని వెంకటేష్ ప్రసాద్ చెప్పారు. చాలా మందికి నమ్మదగిన వ్యక్తి ధోనీ అని తెలిపారు. బైక్‌లు, కార్ల ధోనీకి ఎంత ఇష్టమో.. రాంచీలోని ధోనీ ఇంట్లోని కలెక్షన్ చూస్తే అర్థమవుతుందన్నారు. ధోనీ సతీమణితో మాట్లాడిన మాటలు కూడా ఈ వీడియోలో మనం గమనించవచ్చు.
రాంచీకి తొలిసారి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుందన్న ధోనీ సతీమణి సాక్షి ప్రశ్నకు.. వెంకటేష్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంచీకి రావడం ఇది నాలుగోసారని.. చాలా అద్భుతంగా అనిపిస్తోందని చెప్పారు. ధోనీ బైక్ కలెక్షన్ చూస్తే చాలా క్రేజీగా అనిపిస్తోందని, ఎంతో పిచ్చి ఉంటే గానీ ఇన్ని బైక్‌లు కలిగి ఉండలేదన్నారు.
మిస్టర్ కూల్ MS ధోనీ సుమారు 50 బైక్‌లను కలిగి ఉన్నారు. ఇందులో హార్లే డివిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్, కవాసకి Ninja H2, డుకాటీ 1098, యమహా RD 350 మరియు సుజుకి హయబుసా సహా మరెన్నో అద్భుతమైన బైక్‌లు ధోనీ గ్యారేజీలో ఉన్నాయి. అయితే ఓ పాత ఇంటర్వ్యూలో తన వద్ద 50 కంటే ఎక్కువ బైక్‌లు ఉన్నాయని ధోని కూడా చెప్పాడు.
2004లో బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి MS Dhoni అరంగేట్రం చేశాడు. వికెట్ కీపర్‌గా, భారత జట్టు కెప్టెన్‌గా ఎవరూ బద్దలుకొట్టలేని రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా భారత్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఎలాంటి పరిస్థితినైనా అత్యంత చాకచక్యంగా డీల్ చేసే ధోనీని అభిమానులంతా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ 2004 నుంచి 2019 వరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 T20 ఆడాడు. తన అంతర్జాతీయ కెరీల్లో ధోనీ మొత్తం 16 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు చేశాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం IPLలో మాత్రమే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ భారతదేశం తరఫున 33 టెస్టులు మరియు 161 వన్డేల్లో ఆడాడు. టెస్టుల్లో 96 వికెట్లు, వన్డేల్లో 196 వికెట్లు తీశాడు. వెంకటేష్ ప్రసాద్ బెంగళూరుకు చెందినవాడు. 1994 నుంచి 2001 వరకు భారత్ తరఫున ఆడాడు.


Click it and Unblock the Notifications








