Just In
Don't Miss
- Movies
Bigg Boss Tamil 4 Winner: తమిళ బిగ్ బాస్‌లో అనుకున్నదే జరిగింది.. విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
- News
బిడెన్ బాధ్యతల స్వీకరణ సజావుగా సాగేనా?: 9/11 నాటి పరిస్థితులు: అమెరికా గరంగరం: మిలటరీ జోన్
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?
భారతదేశంలో పై స్థాయి అధికారులు క్రింది స్థాయి ఉద్యోగులపై అజమాయిశీ చల్లచించడం ఇప్పటికే చాలా సందర్భాలలో చూసి ఉంటాము. కొంతమంది రాజకీయ నాయకులు అధికారదర్పంతో చాలామందికి కించపరచడం మరియు అవమానించిన విషయాలు ఇప్పటికే కోకొల్లలు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.

తమిళనాడు (చెన్నై) మాజీ పార్లమెంటు సభ్యుడు (ఎంపి) సేలంలోని టోల్ గేట్ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీసుపై దాడి చేసిన సంఘటన కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో ప్రకారం డిఎంకె మాజీ ఎంపి కె అర్జునన్ టోల్ గేట్ వద్ద డ్యూటీ పోలీసు సిబ్బందిని నెట్టడం, తన్నడం మరియు మాటలతో అవమానించడం మనం ఇక్కడ వీడియోలో గమనించవచ్చు.
MOST READ:డీలర్షిప్ చేరుకున్న కొత్త ట్రయంఫ్ టైగర్ 900 బైక్

కరోనా నేపథ్యంలో విధుల్లో టోల్ గేట్ వద్ద వున్న పోలీసు సిబ్బంది ఆరోగ్య ప్రయాణానికి ఇ-పాస్ అడిగినప్పుడు మాజీ MP ఆ పోలీసుపై ఈ విధంగా ఉద్రిక్తుడయ్యాడు. విధుల్లో ఉన్న పోలీసుపై ఈ విధంగా ప్రవర్తించిన ఆ మాజీ MP పై ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు.

భారతదేశంలో రోజు రోజుకి కరోనా కేసులు అధికం అవుతున్న కారణంగా ఒక రాష్ట్రము నుంవచ్చి ఇంకో రాష్ట్రానికి వెళ్లాలంటే తప్పకుండా ఇ-పాస్ అవసరం. ముక్యంగా రాష్ట్రంలో ఇప్పటికి లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఈ విధమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
MOST READ:మరింత పొడుగు పెరగనున్న హెవీ వెహికల్స్, ఎందుకంటే ?
తమిళనాడులో ఇప్పటికే కరోనా అధికంగా విజృంభిస్తోంది. అందువల్ల కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జూన్ 19 నుండి తమిళనాడు ప్రభుత్వం చెన్నై, చెంగల్పేట్, కాంచీపురం మరియు తిరువల్లూరు అనే నాలుగు జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. తమిళనాడులో కొత్తగా 3,940 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 54 మరణాలు సంభవించాయని, మొత్తం కేసుల సంఖ్య ఇప్పటికి 82,275 గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల్లో 45,537 డిశ్చార్జెస్, 35,656 యాక్టివ్ కేసులు, 1,079 మరణాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాజధాని నగరం చెన్నైలో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా నివారణకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ విధించింది, ఈ లాక్ డౌన్ కి మధ్యలో కొన్ని సడలింపులు కల్పించడం వల్ల వావనదారులు మరియు ప్రజలు ఎక్కువ కావడంతో తిరిగి కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ కారణంగా అక్కడ మళ్ళీ కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.
MOST READ:కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?