బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన గూగుల్ మాజీ ఉద్యోగి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు, వైరల్ అవుతున్న వీడియో
గూగుల్ లాంటి పెద్ద సంస్థలో పనిచేసిన వ్యక్తి బైక్ ట్యాక్సీ నడిపారు. అదేంటి అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ట్యాక్సీ నడపడమేంటని అనుకుంటున్నారా.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఓలా, ఉబర్, ర్యాపిడోతో బైక్, ఆటో క్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాక.. నగర ప్రజలు ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. రోడ్లపై రద్దీ కారణంగా ప్రజా రవాణా కంటే ఆన్‌లైన్ ట్యాక్సీ సేవలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. తక్కువ ఖర్చుతో రద్దీ లేకుండా త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి బైక్ ట్యాక్సీని ది బెస్ట్‌గా భావిస్తున్నారు.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఈ బైక్ ట్యాక్సీ సర్వీసులను ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలే నిర్వహిస్తున్నాయి. బైక్ ట్యాక్సీ సేవలు మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. కాగా ఇటీవల, బైక్ టాక్సీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడు తన బైక్ ట్యాక్సీ రైడర్ గురించి ఆశ్చర్యకరమైన వీడియోను తన X(గతంలో ట్విట్టర్) పేజీలో పోస్ట్ చేశాడు.
ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి తాను బుక్ చేసుకున్న రిజిస్టర్డ్ బైక్ ట్యాక్సీలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ ట్యాక్సీ డ్రైవర్‌తో అతను మాట్లాడాడు. ఈ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్ తాను అంతకు ముందు చేసిన ఉద్యోగం గురించి వివరించాడు.

గతంలో తాను హైదరాబాద్‌లో గూగుల్‌లో పనిచేసేవాడినని బైక్ ట్యాక్సీ రైడర్ చెప్పినట్లు వ్యక్తి X లో పోస్ట్ చేశారు. అక్కడి నుంచి అతను 20 రోజుల క్రితం బెంగుళూరు వచ్చినట్లు, బెంగళూరు సిటీని చూసేందుకు ఇలా బైక్ ట్యాక్సీలో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడని వివరించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. గూగుల్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసిన ఓ ఉద్యోగి బైక్ ట్యాక్సీ ఎందుకు నడుపుతున్నాడని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీనిని పోస్ట్ చేసేటప్పుడు అతను తన బైక్ టాక్సీ డ్రైవర్ గురించి ఎలాంటి సమాచారాన్ని తెలుపలేదు. ఆ వ్యక్తి ఫొటో, పేరు, గుర్తింపు వివరాలేవీ తెలుపలేదు.

దేశంలోని IT కంపెనీల్లో పనిచేస్తున్న చాలా మంది తమ ఉద్యోగాలను వదిలి కొద్ది కాలం వేరే పనులతో కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా తమకు ఇష్టమైన వేరే పనులపై ఆసక్తి చూపిస్తున్నారు. కాగా దేశంలో బైక్ ట్యాక్సీ సర్వీసులు చట్టవిరుద్ధంగా ఉన్నాయి. ఈ బైక్ ట్యాక్సీ సేవల ద్వారా మహిళలకు భద్రత కొరవడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








