Car Accident టీమిండియా మాజీ క్రికెటర్‌కు యాక్సిడెంట్‌.. నుజ్జునుజ్జయిన కారు..

భారత క్రికెట్‌ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొన్ని నెలల క్రితం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోకముందే తాజాగా మరో క్రికెటర్ ప్రమాదానికి గురయ్యాడు. భారత మాజీ ఆల్ రౌండర్ ప్రవీణ్ కుమార్ కారును నడుపుతూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం ప్రవీణ్ కుమార్‌ తన కొడుకుతో కలిసి తన ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ ఎస్‌యూవీని నడుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వీరి వాహనాన్ని వెనుకనుంచి పాండవ్ నగర్ ప్రాంతంలోని కమిషనర్ నివాసం సమీపంలో వేగంగా వస్తున్న క్యాంటర్‌(లారీ) ఢీకొట్టింది.

Former-Cricketer-Praveen-Car-Accident

అదృష్టవశాత్తూ, ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారి కారుకు తీవ్రంగా నష్టం జరిగింది. స్థానిక సివిల్ లైన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్‌దే తప్పుగా పోలీసులు నిర్ధారణకు వచ్చిన అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ప్రమాదంపై ప్రవీణ్‌ కుమార్‌ స్పందించారు.

'భగవంతుని దయ వల్ల తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం. అందుకే నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. లేదంటే చాలా ఘోర ప్రమాదం జరిగేది. రాత్రి 9:30 గంటల సమయంలో ఒక భారీ ట్రక్కు నా కారును వెనుక నుండి ఢీకొట్టింది. బంపర్‌ మాత్రమే దెబ్బతింటుంది అనుకున్నాను. కానీ కారును పరిశీలించిన తర్వాతా చాలా డ్యామేజ్‌ జరిగింది' అని తెలిపారు.

Former-Cricketer-Praveen-Car-Accident

ప్రమాదంలో ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ తీవ్రంగా దెబ్బతింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద లగ్జరీ SUVలలో ఒకటి. డిఫెండర్ 2.0 లీటర్ మరియు 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. గతేడాది డిఫెండర్ 110 మరియు 90 వెర్షన్ల కోసం 5.0 లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్ ఎంపికను కూడా విడుదల చేసింది. అన్ని ఇంజిన్ ఎంపికలు స్టాండర్డ్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.

గత ఏడాది డిసెంబర్‌లో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ డిసెంబర్ 30, 2022 తెల్లవారుజామున ఢిల్లీ డెహ్రాడూన్ మోటార్‌ వేపై జరిగిన ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో తప్పించుకున్నాడు. తన తల్లిని చూసేందుకు డెహ్రాడూన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Former-Cricketer-Praveen-Car-Accident

రిషబ్ పంత్ మెర్సిడెస్ - ఏఎమ్‌జీ జీఎల్‌ఈ ఎస్‌యూవీని నడుపుతుండగా, అత్యంత వేగంగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. సెకన్ల వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అద్దాన్ని పగులగొట్టి పంత్‌ సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. ప్రవీణ్ కుమార్ భారత క్రికెట్ జట్టు తరపున దాదాపు 68 వన్డే మ్యాచ్‌లు ఆడి 78 వికెట్లు సాధించాడు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

Former-Cricketer-Praveen-Car-Accident

More from DriveSpark

Article Published On: Thursday, July 6, 2023, 14:57 [IST]
English summary
Former indian cricketer praveen kumar crash with a truck in his land rover defender
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+