యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్‌లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..

క్రికెట్ అభిమానులకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ క్రికెటర్ ఇటీవలే ఓ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMW X7) కారును కొనుగోలు చేశారు. భారత మార్కెట్లో ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ. 1.18 కోట్లు. ఫైటోనిక్ బ్లూ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపించే కొత్త BMW X7 యొక్క టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్‌ను ఆయన కొనుగోలు చేశారు. యువీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో బిఎమ్‌డబ్ల్యూ కార్లన్నా కూడా అంతే ఇష్టం.

యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్‌లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..

యువరాజ్ సింగ్ వద్ద ఇప్పటికే పలు బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ వాహనాలు ఉన్నాయి. తాజాగా, ఇప్పుడు ఆయన గ్యారాజ్ లో కొత్త ఎక్స్7 ఎస్‌యూవీ వచ్చి చేరింది. చండీగఢ్ లోని బిఎమ్‌డబ్ల్యూ డీలర్‌షిప్ యువరాజ్ సింగ్ కు కొత్త ఎక్స్7 కారుని డెలివరీ చేస్తున్న చిత్రాలను ఇంటర్నెట్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలలో యువరాజ్ తన బ్లూ కలర్ బిఎమ్‌డబ్ల్యూ కారుని డెలివరీ తీసుకోవడాన్ని చూడొచ్చు. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 లగ్జరీ ఎస్‌యూవీ అత్యంత విలాసవంతమైన ఫీచర్లతో లభిస్తుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ లలో అందుబాటులో ఉంటుంది.

యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్‌లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..

బిఎమ్‌డబ్ల్యూ ఇదివరకూ ఎక్స్7 ఎస్‌యూవీని పూర్తిగా విదేశాలలో తయారు చేసి, ఇక్కడి మార్కెట్లోకి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) గా దిగుమతి చేసుకొని విక్రయించేంది. అయితే, ఈ జర్మన్ కంపెనీ ఇప్పుడు ఇదే మోడల్ ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూపంలో విడిభాగాలుగా భారతదేశంలోకి దిగుమతి చేసుకొని, ఇక్కడే స్థానికంగా అసెంబుల్ చేస్తుంది. భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఈ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మరియు ఇది ఇతర ఫ్లాగ్‌షిప్ మోడల్‌ల మాదిరిగానే ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో వస్తుంది.

యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్‌లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎస్‌యూవీలో లేజర్ హెడ్‌ల్యాంప్‌లు, యాంబియంట్ లైటింగ్ మరియు పానోరమిక్ త్రీ-పీస్ సన్‌రూఫ్ వంటి టాప్-నాచ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5 జోన్ క్లైమేట్ కంట్రోల్, అటానమస్ పార్కింగ్ మరియు మూడు వరుసలకు రిక్లైనింగ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్‌లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..

ఈ కారు లోపలి భాగంలో లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ మధ్యలో చక్కగా అమర్చిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది బిఎమ్‌డబ్ల్యూ యొక్క సరికొత్త iDrive సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రిస్టల్-ఎఫెక్ట్ గేర్ లివర్ మరియు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ లు కూడా అందుబాటులో ఉన్నాయి.

యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్‌లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..

ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎక్స్‌డ్రైవ్ 40ఐ వేరియంట్ లోని 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ 335 బిహెచ్ పి పవర్ ను మరియు 450 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, ఇందులోని ఎక్స్‌డ్రైవ్30డి వేరియంట్ 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ట్విన్-టర్బో డీజల్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 260 బిహెచ్‌పి పవర్ ను మరియు 620 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్ లు స్టాండర్డ్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటాయి.

యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్‌లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..

యువరాజ్ కార్ కలెక్షన్ లోని ఇతర BMW కార్లు

యువరాజ్ సింగ్ గ్యారాజ్ లోని ఇతర బిఎమ్‌డబ్ల్యూ కార్లను పరిశీలిస్తే, వాటిలో E46 M3 మోడల్‌ చాలా ప్రత్యేకమైనది. ఇది అతని ప్రారంభ IPL రోజులలో బాగా ప్రాచుర్యం పొందింది, ఇది ఫీనిక్స్ ఎల్లో మెటాలిక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఇదొక కన్వర్టిబుల్ టైప్ కారు. అంతేకాదు, BMW ఈ కారుని భారతదేశంలో నేరుగా ఎప్పుడూ విక్రయించలేదు. యువరాజ్ సింగ్ ఈ కారును ప్రత్యేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు.

యువరాజ్ సింగ్ కార్ గ్యారాజ్‌లో చేరిన మరో లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ కార్.. ఈసారి ఏ మోడల్ అంటే..

ఇక యువరాజ్ ఫేవరేట్ కార్ కలర్ బ్లూ అని తెలుస్తోంది. ఎందుకంటే, ఈయన కార్ కలెక్షన్ లో బ్లూ కలర్‌లో ఉండే E60 M5 మోడల్ కూడా ఉంది. దీని తర్వాత అతను పాత F86 BMW X6M ని కూడా కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అతను పాత BMW F10 M5 కొన్నాడు, ఈ కారు కూడా బ్లూ కలర్ లోనే ఉంటుంది. యువరాజ్ ప్రత్యేకించి బిఎమ్‌డబ్ల్యూ కార్ల అభిమాని, అందుకే తన కార్ కలెక్షన్‌లో ఎల్లప్పుడూ ఎక్కువగా బిఎమ్‌డబ్ల్యూ కార్లు కనిపిస్తుంటాయి.

Most Read Articles

English summary
Former indian cricketer yuvraj singh adds new bmw x7 to his garage details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X