మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

కేవలం సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్ లు, పారిశ్రామిక వేత్తలు మరియు క్రికెటర్లు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులకు కూడా వాహనాలపైన ఎక్కువ మక్కువ ఉంటుంది, అనే విషయం అందరికి తెలుసు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా విన్నాం మరియు చదువుకున్నాం. అయితే ఇప్పుడు మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

ఆఫ్ రోడర్ వాహనాలు కలిగి ఉన్న దాదాపు చాలామంది సాహసయాత్రలు చేయడానికి పూనుకుంటారు. ఆఫ్ రోడింగ్ చేయడానికి అణువైన వాహనాలలో మహీంద్రా థార్ ఒకటి. మహీంద్రా థార్ SUV కలిగి ఉన్న చాలామందిలో 'ఒమర్ అబ్దుల్లా' ఒకరు. ఒమర్ అబ్దుల్లా ఈ పేరు దాదాపు చాలామందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే కార్లంటే ఎక్కువ ఇష్టపడే రాజకీయ నాయకుల్లో ఇతడు ఒకరు.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసారు. యితడు ఇటీవల కాలంలోనే కొత్త మహీంద్రా థార్ SUV ని తన గ్యారేజిలో చేర్చాడు. ఇప్పటికే యితడు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మరియు టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి ప్రపంచంలోని అత్యుత్తమ SUV లను కలిగి ఉన్నారు.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

సాధారణంగా మహీంద్రా థార్ అనేది ఆఫ్ రోడ్ SUV గా ఇప్పటికే చాలా ప్రసిద్ధి చెందింది. ఈ SUV కలిగి ఉన్న ఒమర్ అబ్దుల్లా దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫోటోలలో మహీంద్రా థార్ మంచు దుప్పట్లో ఉండటం మీరు గమనించవచ్చు. ఈ SUV మంచు ప్రాంతంలో కూడా చాలా ఖచ్చితంగా పనిచేసే విధంగా ఉందని ఆయన అన్నారు.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

నివేదికల ప్రకారం, ఒమర్ అబ్దుల్లా తన థార్‌ SUV ని జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌కు తీసుకెళ్లాడు. ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. ఒమర్ అబ్దుల్లా పంచుకున్న ఈ చిత్రాలు మహీంద్రా థార్ గుల్‌మార్గ్‌లోని దట్టమైన మంచుతో కప్పబడిన రహదారులను సులభంగా ప్రయాణించగలదని స్పష్టంగా చూపిస్తున్నాయి.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే కొనుగోలు చేసిన ఈ SUV బ్లాక్ షేడ్‌లో కనిపిస్తుంది. ఇది హార్డ్-టాప్ వేరియంట్. కానీ ఇది పెట్రోల్-బేస్డ్ వేరియంట్ లేదా డీజిల్-బేస్డ్ వేరియంట్ అనేది ఖచ్చితంగా తెలియదు. ఒమర్ అబ్దుల్లా తన మహీంద్రా థార్ గ్రిల్ ముందు బుల్-బార్‌ను ఏర్పాటు చేసాడు. అయితే ఇది మోటార్ వాహన చట్టం ప్రకారం చట్ట విరుద్ధం.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

ఈ ఫోటోలలో మీరు గమనించినట్లయితే, ఈ మహీంద్రా థార్ స్టాక్ టైర్లు మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉండటం చూడవచ్చు. ఈ ఫోటోలు చూసిన మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

సాధారణంగా మంచు వంటి ప్రాంతాల్లో వాహనాలు డ్రైవ్ చేయాలంటే మంచి డ్రైవింగ్ నైపుణ్యం కలిగి ఉండటమే కాకుండా, సహనం మరియు సరైన వీల్స్ కూడా కలిగి ఉండాలి. కావున తప్పకుండా కారు సరైన 4-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉండాలి. అంతే కాకుండా మంచుతో కప్పబడిన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు చిక్కుకోకుండా ఉండేందుకు, టైర్లకు మంచు గొలుసులను చుట్టి నడపడం కూడా చాలా మంచిది.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

ఇక మహీంద్రా థార్ SUV విషయానికి వస్తే, ఇది అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఇది షిఫ్ట్-ఆన్-ఫ్లై ట్రాన్స్‌ఫర్ కేస్‌తో 4x4 డ్రైవ్ ట్రైన్ మరియు మూడు మోడ్‌లను కలిగి ఉంది. అవి 2H, 4H మరియు 4L. ఈ SUV కి మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, ఫ్రంట్ యాక్సిల్ కోసం ఎలక్ట్రిక్ డ్రైవ్‌లైన్ డిస్‌కనెక్ట్ మరియు బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఉన్నాయి.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

మహీంద్రా థార్‌ రెండు ఇంజిన్ ఆప్సన్లను కలియు ఉంటుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మంచు కురిసే వేళలో.. Mahindra Thar తో ఒమర్ అబ్దుల్లా.. మీరు ఓ లుక్కేసుకోండి

2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఎంపిక అందుబాటులో ఉంది. కొత్త మహీంద్రా థార్ గ్లోబల్ NCAP ద్వారా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. కావున మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది.

Most Read Articles

English summary
Former jammu kashmir cm omar abdullah with mahindra thar suv in gulmarg on snowy roads details
Story first published: Saturday, January 8, 2022, 9:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X