గురువుకు లక్షల విలువ చేసే కారు గిఫ్ట్‌.. ఈ గురుశిష్యుల బంధానికి వావ్ అనాల్సిందే

చాలా మందికి తమ జీవితంలో ఓ మార్గదర్శి ఖచ్చితంగా ఉంటారు. ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని వారు నింపిన స్ఫూర్తి, ఇన్‌స్పిరేషన్‌, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంటారు. అలాంటి వ్యక్తుల జాబితాలో ముఖ్యమైన వ్యక్తి.. మనకు చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్పిన గురువు. ఆ గొప్ప గురువుకు వీడ్కోలు కార్యక్రమంలో మరిచిపోలేని గిఫ్ట్‌ అందించారు ఈ విద్యార్థులు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఓ ఉపాధ్యాయుడికి ఖరీదైన(Student Gifts Maruti Suzuki Baleno To Teacher) కారును బహుమతిగా ఇచ్చిన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఇది ఇరుగుపొరుగు వారినే కాకుండా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గురు భక్తి అంటే ఇలా ఉండాలి అంటూ మెచ్చుకోని వారు లేరు. ఆ గురుశిష్యుల మధ్య ఉన్న బంధానికి అందరూ ఫిదా అవుతున్నారు.

Students-Gifted-Maruti- -Baleno-To-Teacher

జేమ్స్ అనే ఉపాధ్యాయుడు. పల్నాడు, అనంతపూర్‌, నెల్లూరు సహా పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో విధులు నిర్వహించారు. అయితే జేమ్స్‌ ఈ రోజు (ఏప్రిల్ 30) పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28 న ఉపాధ్యాయుడు జేమ్స్‌కు అభినందనలు, వీడ్కోలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు.

పల్నాడు సమీపంలోని చిలకలూరిపేటలో ఈ వేడుక నిర్వహించారు. వేడుక జరుగుతుండగా, ఉపాధ్యాయుడు జేమ్స్.. మాజీ విద్యార్థులు కొందరు మారుతీ సుజుకీ బాలెనో కారును అక్కడికి తీసుకొచ్చారు. ఇది 'మీకు మా కానుక' అని పూర్వ విద్యార్థులు చెప్పడంతో ఉపాధ్యాయుడు జేమ్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా అక్కడున్న వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.

కాగా జేమ్స్ దగ్గర చదివిన చాలా మంది విద్యార్థులు ఇప్పుడు చాలా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. దీంతో గురు భక్తితో అందరూ కలిసి ఈ కారును బహుమతిగా ఇచ్చారు. విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా అన్నీ నేర్పిన గురువులను మరచిపోలేరనడానికి ఈ సంఘటనే ఉదాహరణగా నిలిచిందంటూ అక్కడున్న వారు ప్రశంసిస్తున్నారు.

ఇక జేమ్స్‌కు బహుమతిగా ఇచ్చిన మారుతి సుజుకి బాలెనో కారు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర.. రూ.6.66 లక్షలుగా ఉంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ.9.88 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు కాగా.. జేమ్స్‌కు మాజీ విద్యార్థులు టాప్-ఆఫ్-ది-లైన్ మారుతి సుజుకి బాలెనో కారును బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో దీని On-Road Price సుమారు రూ. 12 లక్షలుగా ఉంది.

భారత మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో.. హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా మరియు టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు గట్టి పోటీనిస్తోంది. ఈ కారులో పెట్రోల్ మరియు CNG ఇంజన్ ఆప్షన్లను సంస్థ అందిస్తోంది. ట్రాన్స్‌మిషన్ పరంగా, మారుతి సుజుకి బాలెనో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటుంది.

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం కారు కాబట్టి, సంస్థకు చెందిన నెక్సా షోరూమ్‌ల ద్వారా ఇది విక్రయానికి అందుబాటులో ఉంది. జీవితంలో తమ పురోగతికి కారణమైన ఉపాధ్యాయుడికి సుమారు రూ. 12 లక్షల విలువైన కారును బహుమతిగా ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. అయితే గతంలో కూడా కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఇలా ఉత్తమ ఉపాధ్యాయుడికి బైక్‌ లాంటి వాటిని గిఫ్ట్‌గా ఇచ్చిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 30, 2024, 9:43 [IST]
English summary
Former students gifted maruti suzuki baleno to teacher in his farewell event viral news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+