పెళ్లితో ఒక్కసారిగా మారిపోయిన జీవితం.. సుజుకీ సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగి.. చివరికి అంతిమ వీడ్కోలు..

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో విషాధ ఛాయలు అల్లుకున్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్త సుజుకీ కంపెనీ మాజీ చైర్మన్ ఒసాము సుజుకీ (94)(osamu suzuki) కన్నుమూశారు. లింఫోమా అనే బ్లాడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ రోజున తుదిశ్వాస విడిచినట్లు సుజుకీ మోటార్ కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. జపాన్ కంపెనీకి చెందిన సుజుకీ మోటార్స్‌ను ఇతర దేశాలకు కూడా విస్తరించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. భారత్‌లో కూడా ఆటో పరిశ్రమ అభివృద్ది చెందడానికి తన తోడ్పాటు అందించారు. దశబ్దాల కాలం పాటు ఆయన సుజుకీ ఛైర్మన్‌గా ఉన్నారు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వాహన తయారీ కంపెనీగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన కృషిని మరువలేరు.

ఒసాము సుజుకీ అసలు పేరు ఒసాము మత్సుడా. ఈయన జపాన్‌లోని గెరోలో 1930 జనవరి 30న జన్మించారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బ్యాంక్‌లో లోన్ ఆఫీసర్‌గా మొదట తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సుజుకీ స్థాపకులు మిట్సో సుజుకీ మనవరాలు అయిన షోహో సుజుకీని 1958లో వివాహం చేసుకున్నారు. మిట్సో సుజుకీకి వారసులు లేకపోవడంతో తన భార్య ఇంటి పేరును తన చివరన చేర్చుకున్నారు.

Osamu Suzuki Died

ఆ తర్వాత కంపెనీ పగ్గాలు ఆయన చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కంపెనీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మోటార్‌ సైకిళ్లు, కార్లను ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించడానికి కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఆయన భారత పర్యటన దేశీయ ఆటోమొబైల్ రంగంలో వృద్దికి ఊతం పోసింది. 1960లలో ఇండియాలో ఎక్కువగా అంబాసిడర్, ఫియట్ కార్లు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయి. ఆ సమయంలో ఆయన ఆలోచనతో భారత్‌లో పెద్ద కంపెనీ ఏర్పాటుకు ఆజ్యం పోషింది.

భారతీయ ప్రజల్లో చిన్న కార్లు మంచి ఆదరణ, హ్యాచ్‌బ్యాక్‌ లాంటి మోడళ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని గుర్తించిన ఒసాము సుజుకీ భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుని మారుతీ ఉద్యోగ్‌ అనే పేరుతో అప్పటి ప్రభుత్వంతో కలిసి జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మారుతీ సుజుకీ కంపెనీగా అవతరించింది. అయితే 2002లో ప్రభుత్వం కంపెనీని ప్రైవేటీకరణ చేసింది. దీంతో అది పూర్తి స్థాయిలో సుజుకీ చేతుల్లోకి వెళ్ళిపోయింది.

Osamu Suzuki Former Suzuki Chairman

ప్రస్తుతం ఇది అతిపెద్ద వాహన తయారీ సంస్థగా అవతరించింది. చిన్న కార్లకు డిమాండ్ ఉండటంతో మొదటగా మారుతీ 800 కారును ఇండియాలో విడుదల చేశారు. ఈ కారు అప్పట్లో పెద్ద సంచలనం. ఇప్పటికి కూడా ఇది చాలా మంది దగ్గర కనిపిస్తుంది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు డిమాండ్ ప్రస్తుతం కాలం వరకు కూడా తగ్గకపోవడం గమనార్హం. భారత ఆటోమొబైల్ చరిత్రలో మారుతీ 800 కారు ఎవర్‌గ్రీన్ మోడల్.

ఇండియాలో ఇప్పుడు మారుతీ సుజుకీ కంపెనీ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా ఉంది. దేశంలో అమ్ముడుపోతున్న కార్లలో ఈ కంపెనీ కార్ల వాటా దాదాపు 40 శాతం వరకు ఉంటాయి. అంటే 100 కార్లు సేల్ అవుతుంటే వాటిలో 40 వరకు మారుతీ సుజుకీ కంపెనీకి చెందినవే. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మారుతీ సుజుకీ కార్లు సేల్ అవుతున్నాయి.

ఇక ఒసాము సుజుకీ విషయానికి వస్తే, ఆయన 28 సంవత్సరాలుగా సుజుకీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2000లో సంవత్సరంలో మాత్రమే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2008లో మళ్లీ చైర్మన్ పదవిని చేపట్టారు. తిరిగి 2015లో తన కుమారుడికి చైర్మన్ పదవిని ఇచ్చారు. ఆయన పెద్ద వ్యాపారవేత్త అయినప్పటికి ఎక్కువ నిరాడంబరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు.

More from DriveSpark

Article Published On: Saturday, December 28, 2024, 6:02 [IST]
English summary
Former suzuki motor chairman osamu suzuki dies at 94
Read more on: #offbeat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+