కార్‌ రేసింగ్‌ ప్రియులకు శుభవార్త.. చెన్నైలో ఫార్ములా 4 రేసింగ్‌.. టికెట్‌ ధర ఎంతో తెలుసా?

ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌లో (Indian Racing Festival) భాగంగా చైన్నైలో మొట్టమొదటి సారిగా ఫార్ములా 4 నైట్‌ రేసింగ్‌ పోటీలు జరగనున్నాయి. ఈ రేసింగ్‌ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు మూడు రోజుల పాటు సాగనుంది. ఈ ఈవెంట్‌లకు సంబంధించిన టికెట్స్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. పేటీఎం ఇన్‌సైడర్‌ (Paytm Insider) ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు.

తమిళనాడు యూత్‌ వెల్ఫేర్‌, స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ మినిస్టర్‌ ఉదయనిధి స్టాలిన్‌ రేసింగ్‌ సంబంధించిన టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తున్న చెన్నై సర్క్యూట్ నైట్ రేస్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో భాగంగా జరుగనుంది. ప్రపంచ మోటార్ స్పోర్ట్స్ మ్యాప్ లో చెన్నైని ఓ వేదికగా నిలిపేలా దీనిని నిర్వహించనున్నారు.

Formula 4 Car Racing in Chennai

దీనికి సంబంధించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ని ఆ రాష్ట్ర అడిషనల్‌ చీఫ్‌ సెక్రెటరీ అతుల్య మిశ్రా, ఇతర అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ పోటీలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహణ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఫ్యూచర్‌లో చైన్నైని ఫార్ములా వన్‌ హబ్‌గా మార్పు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ పోటీలు అందకు ఊతమిస్తాయని వారు పేర్కొన్నారు.

చెన్నై ఫార్ములా రేసింగ్ సర్క్యూట్ టికెట్ల ధర ఎంత?: చెన్నై ఫార్ములా రేసింగ్ సర్క్యూట్ కోసం మొదటి 2000 టిక్కెట్లు ప్రత్యేక ఎర్లీ బర్డ్ డిస్కౌంట్‌లో కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ .1000 కంటే తక్కువగా ఉండనుంది. ఇక రూ.1699 (వన్ డే పాస్) నుంచి ప్రారంభమయ్యే ఇతర టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ ఫార్ములా రేసింగ్‌ని స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 ద్వారా ఛానెల్‌లో వీక్షించవచ్చు.

Formula 4 Car Racing in Chennai

ఈ మ్యాచ్ టికెట్ ధర తొలిరోజు రూ.3,999గా ఉంది. ప్రీమియం స్టాండ్ సెగ్మెంట్లో రెండో రోజు దీని ధర రూ.6,999గా ఉంది. ఇప్పటి వరకు స్టాండ్ ఫీజుగా తొలిరోజు రూ.1,999, చివరి రోజు రూ.2,599గా నిర్ణయించారు. గోల్డెన్ లాంచ్ స్టాండ్‌లో మొదటి రోజు టికెట్ ధర రూ.7,999 కాగా, రెండో రోజు టికెట్ ధర రూ.13,999గా ఉంది.

ప్లాటినం లాంచ్ టికెట్ మొదటి రోజు రూ.12,999, రెండో రోజు రూ.19,999గా నిర్ణయించారు. ఈ టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. తదుపరి దశ మ్యాచ్ వివరాలన్నీ ఒక్కొక్కటిగా వెల్లడికానున్నాయి. ఇక ఆన్‌లైన్‌లో చెన్నై ఫార్ములా రేసింగ్‌ని ఫ్యాన్ కోడ్‌లో లైవ్‌ టెలికాస్ట్‌ చేయనున్నారు. రేసింగ్‌ ఔత్సాహికుల కోసం ఈ ఈవెంట్స్‌ వినోదాన్ని పంచనున్నాయి. ఇలాంటి రేసింగ్‌లో దేశంలో చాలా తక్కువగా నిర్వహిస్తారు.

ఇక ఈ ఫార్ములా 4 కార్ రేస్ గత ఏడాది డిసెంబర్ 9, 10 తేదీల్లో చెన్నైలో జరగాల్సి ఉంది. అప్పట్లో మిగ్‌జాం తుఫాను కారణంగా రేస్‌లు జరగలేదు. వరదల ధాటికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దీంతో మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మరోసారి టోర్నీ నిర్వహణకు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (సాయ్) అనుమతి ఇచ్చింది.

ముందుగా అనుకున్నట్లుగానే చెన్నై ఐలాండ్ లోని థియేటర్ ఏరియా చుట్టుపక్కల ఉన్న రోడ్లపై ఈ రేస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ లో పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ద్వీపం చుట్టూ ఉన్న 3.5 కిలోమీటర్ల రహదారిలో ఈ రేసును రాత్రి రేస్ లాగా నిర్వహిస్తారు.

చెన్నై ఐలాండ్ నుంచి ప్రారంభమయ్యే కారు రేస్ అన్నా రోడ్డు, శివానంద రోడ్, నేపియర్ బ్రిడ్జి మీదుగా ద్వీపానికి చేరుకుని తిరిగి ద్వీపానికి తిరిగి వెళ్లనున్నారు. ఈ పోటీ ఇతర కార్ రేస్ పోటీల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ పోటీ కాస్త ఆసక్తికరంగా ఉండనుంది.

ఫార్ములా 4 రేసు: భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియాలో కూడా ఇది ఫస్ట్ నైట్ కార్ రేస్ కావడంతో ఈ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టోర్నమెంట్ లో పలువురు విదేశీ ఆటగాళ్లు పాల్గొంటుండటంతో గతసారి మ్యాచ్ చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపడంతో టికెట్లన్నీ బాగా అమ్ముడుపోయాయి. అయితే ఈసారి కూడా టికెట్ కు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వచ్చాయి.

గత డిసెంబర్ లో చెన్నైలో ఈ పోటీలు నిర్వహించాలని భావించినప్పుడు, దానిపై అనేక నిరసనలు జరిగాయి. పబ్లిక్ రోడ్లపై కార్ రేసింగ్ అవసరం ఏమిటని పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు దాఖలు చేసే సమయంలో వివిధ షరతులతో పోటీ నిర్వహించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Tuesday, August 20, 2024, 19:21 [IST]
English summary
Formula 4 car race in chennai ticket prices and live broadcast details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+