గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రోజురోజుకి అభివృద్ధివైపు పరుగులుపెడుతోంది. ఇటీవల అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ తయారీ సంస్థ అయిన టెస్లా కి ఆహ్వానం పలికింది. అయితే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములా వన్ రేసింగ్ కూడా నిర్వహించడానికి ఒప్పందాలు చేసుకుని తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ మహానగరం ఇప్పుడు 'ఫార్ములా వన్ ఈ' రేసింగ్ పోటీలకు వేదిక కానుంది. దీనికి సంబంధించి ఫార్ములా వన్ రేసింగ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో భాగంగానే త్వరలో సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సెస్ సాగర్ చుట్టూ సుమారు 2.37 కిలోమీటర్ల రేసింగ్ కోర్టు అందుబటులోకి రానుంది. ఈ రేసింగ్ ట్రాక్ ఏర్పాటైతే హైదరాబాద్ కీర్తి ప్రపంచ దేశాల్లో మారుమోగుతోంది.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

సాధారణంగా ఫార్ములా వన్ రేసింగ్ అనేది ప్రపంచంలో కూని దెసలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇందులో న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్ మరియు సియోల్ వంటి మహా నగరాలూ ఉన్నాయి. ఇందులో మన హైదరాబాద్ కూడా చోటు సంపాదించుకుంది.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

ఇందులో భాగంగానే "ఫార్ములా ఈ" సంస్థకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికీ, గ్రీన్ కో అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగింది. అత్యంత పర్యావరణ హితమైన కార్లతో నిర్వహించే ఈ "ఫార్ములా ఈ" రేసింగ్ ను "ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్" అనే సంస్థ ప్రతి ఏడాది ఒక్కో నగరంలో నిర్వహిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహించడానికి ముందుకు వచ్చారు.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

దీనికి సాధారణంగా నిర్వహించే ఫార్ములా వన్ కార్ రేసింగ్ లాగా 'ఫార్ములా ఈ' కార్ రేస్ కోసం ప్రత్యేకంగా "రేస్ ట్రాక్" ఏర్పాటు చేయనవసరంలేదు. ఇందుకోసం నగరంలో ఉండే సాధారణ రోడ్లపైనే ఎలక్ట్రికల్ కార్ రేస్ నిర్వహిస్తారు. కాగా ఇందుకోసం అనేక రాష్ట్రాలు పోటి పడుతున్నప్పటికీ ఈ రేసింగ్ టీమ్ హైదరాబాద్ వైపు మొగ్గు చూపింది. కావున దేశంలోని ఇతర నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాలూ కూడా హైదరాబాద్ ఆతిథ్యానికి రానున్నాయి.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంలో ఇప్పటికే రేసులు నిర్వహించే కమిటి హైదరాబాద్ నగరాన్ని సంధర్శించింది. నగరంలోని ట్యాంకుబండ్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్, జూబిలీహిల్స్ మరియు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ మొదలైన ప్రాంతాలను సందర్శించారు. అయితే దీనికి తగిన స్థలంగా ట్యాంకుబండ్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి తమ సహాయ సహకారాలను అందించనుంది, అంతే కాకుండా రేస్ నిర్వాహకుల సూచనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి అవసరం కూడా ఉంది. డీఐకోసం ముందుగా నిర్ణయించిన ప్రాంతాల్లో రోడ్లను విస్తరించడం జరుగుతుంది. అదే సమయంలో రేసుని చూడటానికి వచ్చే ప్రేక్షకుల కోసం స్టాండ్స్ కూడా ఏర్పాటు చేస్తారు.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

రేస్ సంస్థతో జరిగిన ఒప్పదం సమయంలో తెలంగాణ ఐటి మినిష్టర్ KTR మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహన వినియోగం రోజురోజుకి పెంచాలని మరియు గ్రీన్ ఎనర్జీ దిశగా ప్రయత్నాలు ముమ్మరం కావాల్సిన అవసరముందని ఈ సందర్భంగా తెలిపారు. అంతే కాకుండా హైదరాబాద్‌ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పుష్కలమైన అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

ప్రస్తుతం ఏర్పరచుకున్న ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా కల్పిస్తుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే ఈవీ సెంటర్లను సైతం హైదరాబాద్‌లోని సీతారాంపూర్, దివిటీపల్లిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు సబ్సిడీలను మరియు రాయితీలను కల్పిస్తున్నాయి. అదే సమయంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయిన సమయంలో వాహన వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

గోల్డెన్ ఛాన్స్: హైదరాబాద్‌లో 'Formula E' కార్ రేసింగ్‌.. కుదిరిన ఒప్పందం

తెలంగాణ ప్రభత్వం కూడా అందివచ్చిన అవకాశాలను ఎంతో నేర్పుతో ఉపయోగించుకుని అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుంది. దీనికి KTR చాలా ముందుచూపుతూ ఉన్నారు. ఇప్పుడు ఏర్పడిన ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ నగరంలో రేస్ ట్రాక్ ఏర్పడితే ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తాయి.

Most Read Articles

English summary
Formula e race hyderabad street circuit fia agreement details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X