వీడియో: వళ్లు గగుర్పొడిచే 'ఫార్ములా ఆఫ్-రోడ్'
ఫార్ములా వన్ చూశాం, ఫార్ములా ఈ గురించి విన్నాం కానీ ఈ ఫార్ములా ఆఫ్-రోడ్ ఏంటి? కొత్తగా ఉందే అనుకుంటున్నారా..! అవును ఇదో కొత్త రకం మోటార్‌స్పోర్ట్. అడ్వెంచర్ అంటే ఇష్టపడే ఆఫ్-రోడింగ్ అభిమానుల కోసమే ఈ ఫార్ములా ఆఫ్-రోడ్ స్పోర్ట్.
ఫార్ములా ఆఫ్-రోడ్ మోటార్‌స్పోర్ట్‌లో మోడిఫై చేయబడిన పెద్ద చక్రాలు కలిగిన కార్లతో నిటారుగా ఉండే కొండలను ఎక్కాల్సి ఉంటుంది. ఇందులో విజయవంతంగా కొండను ఎక్కేవారు విజేతలుగా నిలుస్తారు. ఇందులో పాల్గొనే వారు తమ స్వంత మోడిఫైడ్ వాహనాలను ఉపయోగిస్తారు.
ఈ వాహనాలతో కొండను ఎక్కే ప్రయత్నం చేసే వారికే కాకుండా చూసే వారికి కూడా ఇది మంచి థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది. ఈ ప్రయత్నం వికటిస్తే, కొండపై నుంచి క్రిందకు పల్టీలు కొట్టుకుంటూ క్రిందకు పడిపోతుంటారు. ఈనాటి మన వీడియో ఫీచర్‌లో ఆ ఫార్ములా ఆఫ్-రోడ్ విశేషాలను చూద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/y1ubHrljbEE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








