బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

భారతీయ వాహన వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే ఎస్‌యూవీలలో Toyota Fortuner (టయోటా ఫార్చ్యూనర్) ఒకటి. Toyota Fortuner దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందటానికి ప్రధాన కారణం దాని ఆఫ్ రోడ్ కెపాసిటీ. Toyota Fortuner ఇండియన్ మార్కెట్లో ప్రముఖ ఎస్‌యూవీలయిన Ford Endeavour, Mahindra Alturas, మరియు MG Gloster వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న Toyota Fortuner ఇటీవల బీచ్‌లో ప్రమాదానికి గురయ్యింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, దీనికి కారణం ఏంటి అనే మరిన్ని విషయాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

నివేదికలప్రకారం Toyota Fortuner బీచ్‌లో డ్రైవింగ్ చేస్తూ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయ్యింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. కావున ఈ వీడియో చాలా వైరల్ గా మారింది.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

Toyota Fortuner ఎస్‌యూవీని బీచ్‌లో సముద్రపు అలల మధ్య వీడియో షూట్ చేయాలని డ్రైవర్ నిర్ణయించుకున్నాడు. మీరు దీనిని వీడియోలో కూడా చూడవచ్చు. Toyota Fortuner కారు డ్రైవర్ చాలా నైపుణ్యంతో కారుని డ్రైవ్ చేస్తున్నాడు. అయితే సముద్రంలో వస్తున్న అలలు కాస్త కారు యొక్క ఎడమవైపు తాకాయి, డ్రైవర్ దానిని కుడి వైపుకు తిప్పడానికి ప్రయత్నించాడు, కానీ అది సాధ్యం కాలేదు.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

Toyota Fortuner యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మరియు గురుత్వాకర్షణ కారణంగా, ఆ సమయంలో Toyota Fortuner నిలువరించలేకపోవడం వల్ల కారు ఒక వైపుకు వాలి కిందికి పడింది. అయితే మళ్ళీ కారు యధా స్థానానికి రావడానికి చాలా కష్టపడింది. ఈ సంఘటనలో పెద్దగా ప్రమాదం జరగలేదు.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

అయితే Toyota Fortuner యొక్క కదలికను ప్రభావితం చేసే టాస్-అప్‌తో దెబ్బతింది. ఫార్చ్యూనర్ కొంచెం విస్తృతమైనది కావున ఎక్కువ ప్రమాదానికి గురి కాలేదు, కానీ, తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న హ్యాచ్‌బ్యాక్ అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కాబట్టి మీరు కారులో బీచ్‌కు వెళ్లినప్పుడు, కారును మితిమీరిన వేగంగా డ్రైవ్ చేయకుండా ఉండటం మంచిది.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

బీజ్ లో అత్యత్సాహంతో ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తే, ఊహకందని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వేగంగా వెళ్లే సమయంలో బ్రేకులు వేయడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ సమయంలో అలలు ఎక్కువగా వస్తున్నట్లయితే వాహనాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే కిందపడిన Toyota Fortuner యొక్క ఎడమవైపు ఉన్న మిర్రర్ మరియు విండో గ్లాస్ పగిలిపోయి ఉండటాన్ని గమనించవచ్చు. సాధారణంగా ఇలాంటి భారీగా ఉన్న కార్లలో స్టంట్ చేయడానికి ముందు, ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ సప్లై మరియు స్టెబిలిటీ కంట్రోల్ ఇన్‌స్టాల్ చేయబడిందో లేదో తెలుసుకోవాలి.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

కారులో ఇటువంటి అధునాతన ఫీచర్స్ ఉండటం వల్ల వాహనాలు ఎటువంటి పరిస్థితిలో అయినా జారిపోకుండా మరియు సకాలంలో బ్రేకింగ్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా, డ్రైవర్ మరియు ఇతర ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించడం అత్యవసరం.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

Toyota తన కొత్త Fortuner SUV ని ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ మరియు అదనపు ఫీచర్లతో మాత్రమే కాకుండా అప్ గ్రేడ్ చేయబడిన ఇంజిన్‌తో విడుదల చేసింది. ఇది Fortuner SUV యొక్క కొత్త లెజెండర్ మోడల్. ఇది దాని మునుపటి మోడల్ లోని 2.7-లీటర్ పెట్రోల్ మరియు 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్ అప్సన్స్ కలిగి ఉంది.

ఈ ఇంజన్‌లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందించబడ్డాయి. Toyota ఎస్‌యూవీని రియర్ వీల్ డ్రైవ్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఎంచుకోవచ్చు. అప్‌డేట్ చేయబడిన Toyota Fortuner SUV ధర రూ. 30.34 లక్షల నుండి రూ. 38.30 లక్షల వరకు ఉంటుంది.

బీచ్‌లో బోల్తాపడ్డ Toyota Fortuner; వీడియో వైరల్

Toyota కంపెనీ యొక్క వెహికల్స్ దృడంగా ఉండటమే కాకుండా, మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి. ఇవన్నీ వాణాదారుల యొక్క భద్రతకు చాలా ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ జరిగిన సంఘటనలో Toyota Fortuner కాకుండా ఇతర కంపెనీలకు చెందిన చిన్న బడ్జెట్ కార్లు ఉంటె పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

Image Courtesy: offroad club pakistan

Most Read Articles

English summary
Fortuner suv rolls over during drifting on beach video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X