యువతి మెప్పుకోసం బైక్‌పై విన్యాసాలు.. ఆరు నెలల తర్వాత 4 యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు..!

బైక్‌పై విన్యాసాలు చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే కొంతమంది హద్దుమీరి హైవేలపై స్టంట్స్ చేస్తుండటం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి విషాదాలకు దారితీస్తున్నాయి. బైక్ సంట్స్‌లో ప్రావీణ్యం ఉన్న కానీ కొన్ని సందర్భాల్లో అవి బెడిసి కొట్టే ప్రమాదం ఉంటుంది. సోషన్ మీడియాలో ఇలాంటి వీడియోలు తీస్తూ వైరల్ కావాలని కోరుకుంటున్నారు.

బైక్ రైడింగ్ అంటే యువతకు చాలా ఇష్టం. దీనిని చాలామంది తమ డైలీ రొటీన్‌లో భాగంగా చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భార్లో రైడర్లు చేసే సంట్స్ అదుపుతప్పుతున్నాయి. సోషల్ మీడియాపై మక్కువ పెంచుకుని పాపులర్ అయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై విన్యాసాలు చేయడం అలవాటుగా మారింది. కొందరు ఇలాంటి పిచ్చి సాహసాలకు పాల్పడి ప్రాణాలను కోల్పోతున్నారు.

Benguluru-Mysuru-Expressway

తాజాగా బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లైఓవర్‌పై యువతితో కలిసి స్కూటర్‌పై విన్యాసాలు చేసిన యువకుడిని, అతని సహచరులను రామనగర పోలీసులు అరెస్టు చేశారు. హైవేపై వీలింగ్(ముందు వీల్‌ని పైకి లేపడం) చేసిన వీడియోను ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు మైసూరు ఎక్స్ ప్రెస్ వే యువతితో కలిసి ఎక్స్ ప్రెస్ వేపై విన్యాసాలు చేస్తున్న వ్యక్తిని, అతని సహచరులను రామనగర జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీపీ అలోక్ కుమార్ ట్వీట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ వీడియోలు 5 - 6 నెలల క్రితంకు చెందినవిగా వివరించారు.

Four-People-Arresed-for-Whelling

ఇప్పటికే బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వేపై ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. వీటి సంఖ్యను తగ్గించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. రామనగర జిల్లా పరిధిలో పోలీసులు సోమవారం నుంచి స్పీడ్ రాడార్లను ఏర్పాటు చేసి 100 కిలోమీటర్ల వేగ పరిమితి దాటిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

నిర్ణీత వేగ పరిమితి దాటిన వారికి రూ.1000 పైగానే జరిమానా విధిస్తున్నారు. మార్చి 12న ఈ బెంగళూరు-మైసూరు వేపై రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. వీటిని నివారించేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికి ప్రమాదల సంఖ్య తగ్గడం లేదు.

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వేపై ద్విచక్ర వాహనాలు, ఆటోలతో సహా త్రిచక్ర వాహనాల రాకపోకలను నిషేధించే అంశాన్ని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని ఆ రాష్ట్ర మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. వాహనదారుల్లో స్పీడ్ లిమిట్ పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

డ్రైవ్స్‌పార్క్: పబ్లిక్ రోడ్డుపై ఏదైనా వాహనాన్ని ఉపయోగించి విన్యాసాలు చేయడం చట్టరీత్యా నేరం. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఏదేమైనా, మీరు స్టంట్ చేయాలనుకుంటే, నిపుణుడి మార్గదర్శకత్వంలో అన్ని భద్రతా నిబంధనలను పాటించండి. ప్రైవేట్ ప్రదేశాల్లో లేదా రేస్ ట్రాక్‌ల వద్ద మాత్రమే విన్యాసాలు చేయండి. తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే రైడింగ్ చేయాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, July 8, 2023, 10:45 [IST]
English summary
Four people arrested for bike wheeling on bengaluru mysuru expressway
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+