నాలుగేళ్ల వయసులోనే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై బుడ్డోడి రౌండ్లు.. లైకులు, కామెంట్లతో సోషల్‌ మీడియా షేక్‌..

నాలుగేళ్ల పిల్లలంటే ఎక్కువగా ఇంట్లో ఉన్న బొమ్మలతో ఆడుకోవడమో లేదంటే.. వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన చిన్న సైకిళ్లు తొక్కడమో లాంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ చిన్నోడు మాత్రం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై డుగ్గు డుగ్గుమంటూ రౌండ్లు వేస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. ఫేస్‌బుక్‌, X, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా మాధ్యమమేదైనా సరే.. ఇంట్రెస్టింగ్‌, వినూత్నమైన వీడియోలు ఏది అప్‌లోడ్‌ చేసినా ఇట్టే వైరల్‌ అయిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక.. వాటితో తెగ కుస్తీ పడుతున్న చిన్నారులు, ఇప్పుడు అందులో వైరల్‌ అయ్యేందుకు సైతం తెగ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

Four-Year-Old-Kid-Riding-Royal-Enfield-Classic-350

ఈ నేపథ్యంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లలు తమ టాలెంట్‌తో ముద్దులొలికే మాటలతో, చేష్టలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఈ నాలుగేళ్ల పిల్లాడు.. పెద్దలకే హ్యాండిల్‌(Four Year Old Boy Riding Royal Enfield bike) చేయడం కష్టంగా ఉండే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై అతి సునాయాసంగా రౌండ్లు వేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళకు చెందిన నాలుగేళ్ల చిన్నోడు.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ రైడ్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాడు. ఈ పిల్లాడి టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సైకిల్‌ నేర్చుకోవాలంటేనే కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలించుకుంటూ చిన్నారులు రక్తం కార్చుకుంటారు. కానీ ఈ వయసులో బైక్‌ రైడింగ్‌ వీడియోతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిపోయాడంటే ఆశ్చర్యమే కదా..

Four-Year-Old-Kid-Riding-Royal-Enfield-Classic-350

Tranz_moto_hub అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియో చేశారు. వీడియోలో తండ్రి తన నాలుగేళ్ల కొడుక్కి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 బైక్ నేర్పిస్తున్నట్లుగా ఉంది. మొదటగా చిన్నారిని బైక్‌పై కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఇంజిన్‌ స్టార్ట్‌ చేశారు. అనంతరం బైక్‌ స్టార్టయ్యాక బుడ్డోడి తండ్రి తన చేతిని వదిలేయగానే.. ఇక ఆగేముంది అన్నట్లుగా డుగ్గుడుగ్గుమంటూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మునుపటి తరం క్లాసిక్‌ 350 పై ఆ గ్రౌండ్‌లో రౌండ్లు వేశాడు.

నాలుగేళ్ల వయసులో పిల్లలకు బైక్‌పై కాళ్లు అందవు.. అయినప్పటికీ ఈ చిన్నోడు యాక్సిలరేటర్‌, క్లచ్‌, పెడల్‌ అందకపోయినా ఏ మాత్రం భయం లేకుండా చాలా ఉల్లాసంగా, ఎంజాయ్‌ చేస్తూ బైక్ నడిపాడు. ఆ చిన్నారి రైడ్‌కు తండ్రి మురిసిపోయాడనడంలో ఏ మాత్రం సందేహం లేదనే చెప్పొచ్చు.

Four-Year-Old-Kid-Riding-Royal-Enfield-Classic-350

ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు షేర్‌ల మీద షేర్లు చేస్తున్నారు. బుడ్డోడి టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. చిన్న వయసులోనే ఇలా బైక్‌ రైడ్‌ చేస్తున్నాడంటే పెద్దయ్యాక గొప్ప పొజిషన్‌లో ఉంటాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. తన రైడింగ్‌ టాలెంట్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాడంటూ మరొకరు అభిప్రాయపడ్డారు.

చిన్న వయసులో ఇలాంటి సాహసోపేతమైన పనికి తల్లిదండ్రుల సపోర్ట్‌ ఉండటం ఎంతో అభినందనీయమని మరికొందరు పేర్కొన్నారు. బైక్‌ నడపడం నుంచి విమానం నడిపే పైలట్‌ వరకూ ఎదగాలంటూ ఇలా భిన్న రకాలుగా ఆ బుడ్డోడి టాలెంట్‌కి ఫిదా అవుతూ కామెంట్లు, లైకుల వర్షం కురిపించారు.

Four-Year-Old-Kid-Riding-Royal-Enfield-Classic-350

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, October 13, 2023, 16:30 [IST]
English summary
Four year old kid riding royal enfield classic 350 bike video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+