మందు బాబులకు బంపర్ ఆఫర్.. ఇక నుంచి ఫ్రీ క్యాబ్ సర్వీస్..

ప్రత్యేక సెలవు దినాల్లో తప్ప ప్రతి రోజూ వైన్ షాపుల వద్ద క్యూలో మందుబాబులు నిల్చోవడం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి పీకలదాకా తాగి వైన్ షాపుల దగ్గరే పడిపోతుంటారు . ఇంకా డంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు. అలా మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే కొన్ని బార్లు క్యాబ్ సర్వీసులని అందిస్తున్నాయి. ఈ క్యాబ్ సర్వీసుల ద్వారా మందుబాబులను స్వయంగా ఇంటికి తీసుకెళ్లి దింపుతారు. అయితే ఇందుకు వారు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మద్యం ప్రియులకు కష్టంగా ఉంటుందని భావించిందేమో.. ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు మందుబాబులను ఉచితంగా ఇంటికి తీసుకెళ్లేలా ఒక సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

Free-Cab-Service

ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ చెకింగ్ చేస్తున్నా కూడా చాలా మంది తాగడం తగ్గించడం లేదు. ఇక పండుగల రోజుల్లో అయితే చెప్పనవరం లేదు. మైకంలో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు బార్ల యాజమాన్యం క్యాబ్ సర్వీసులను ఏర్పాటుచేసింది. కానీ క్యాబ్‌ సర్వీసుకు డబ్బు చెల్లించాల్సి వచ్చేది.

కానీ ఇకపై అలా కాకుండా క్యాబ్‌లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇటలీ ప్రభుత్వం ఓ పరిష్కారాన్ని తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రవేశపెట్టనుంది. మందుబాబులకు క్యాబ్ సేవలను పూర్తిగా ఉచితంగా మందుబాబులకు అందుబాటులోకి తెచ్చింది. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

Free-Cab-Service

నైట్ క్లబ్‌ల వద్ద అతిగా మద్యం సేవించే వారి కోసం ఇటలీ ప్రభుత్వం ఉచిత టాక్సీ సర్వీసులను ప్రవేశపెట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద సెప్టెంబర్ నెల వరకు దేశ వ్యాప్తంగా పుగ్లియా, టుస్కానీ, వెనెటో వంటి నగరాల్లో ఆరు నైట్ క్లబ్‌లలో ఈ పథకాన్ని ప్రయోగించనున్నారు.

ఇందులో నైట్ క్లబ్ వద్ద మద్యం సేవించిన అనంతరం మందుబాబులు వెళ్లేటప్పుడు వారికి టెస్టులు చేస్తారు. వారు పరిమితికి మించి ఎక్కువగా మద్యం సేవిస్తే వారిని ఇంటికి తీసుకెళ్లడానికి టాక్సీని ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఇంటివరకు మందుబాబులను దించేలా క్యాబ్ సర్వీసులు పనిచేస్తాయి.

ఈ పథకాన్ని ఇటలీ రవాణా మంత్రి, ఉప ప్రధాన మంత్రి, హార్డ్-రైట్ లీగ్ పార్టీ నాయకుడు మాటియో సాల్విని ప్రకటించారు. దీనిపై ఆయన ట్విట్టర్లో 'అతిగా మద్యం సేవించిన వారికి రాత్రిళ్లు టాక్సీలు ఉచితం' అని రాశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఇది ఒక ఆచరణాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను ఆపడానికి జరిమానాలు, చట్టాలు సరిపోవని, ప్రతి ఒక్కరి ప్రాణాలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్య ఇటలీలో తీవ్రంగా పెరిగినట్లు యూరోపియన్ ట్రాన్స్ పోర్ట్ సేఫ్టీ కౌన్సిల్ (ETSC) 2020 నివేదించింది. సర్వేలు కూడా ఇతర దేశాలతో పోలిస్తే ఇటలీలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా ఉందని తేల్చడంతో అక్కడ ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు ఇది మంచి ఆలోచన అని మందుబాబులు, క్లబ్ యజమానులు పేర్కొన్నారు.

తమ బాధలు మరిచిపోవడానికి ఇక్కడికి వచ్చి మద్యం తాగి డ్యాన్సులు చేయడమే కాకుండా బయటికి వెళ్లి తాగుతారని అంటున్నారు. ప్రభుత్వం ఈ విధంగా తమ గురించి ఆలోచించినందుకు ఆనందంగా ఉందని మందుబాబులు హర్షం వ్యక్తం చేశారు. మద్యం ఎక్కువగా సేవించిన వారికి టాక్సీ సర్వీసులు సురక్షితంగా ఇంటికి చేర్చడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 9, 2023, 12:39 [IST]
English summary
Free cab service for drunk people to avoid accidents and deaths
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+