Free Services at Petrol Bunk పెట్రోల్ బంకుల్లో ఈ సర్వీసులు ఫ్రీ.. కానీ టాయిలెట్స్ కోసం డబ్బులు..!
నిత్యం మనం పెట్రోల్ బంకులలో ఇంధనం నింపుకోవడానికి వెళ్తూ ఉంటాము. చాలాసార్లు అక్కడ మనకు బంకులో ఉండే వివిధ సౌకర్యాలు కంటపడతాయి. వాటిని కస్టమర్లను ఆకర్షించడం కోసం బంకు యాజమాన్యం ఏర్పాటు చేస్తుందని కొందరు భావిస్తారు. అయితే బంకుల్లో కల్పించే చాలా సౌకర్యాలు మనకు తెలియక పోవచ్చు. అందులోనూ వాటన్నింటినీ ఉచితంగా పొందవచ్చు. ఆ వివరాలు మీకోసం..
పెట్రోల్ బంకుల్లో చాలా సర్వీసులను బంకు నిర్వాహకులు ఫ్రీగా కల్పించాలి. అందులో అనివార్యమైన ప్రతీ సర్వీస్ కోసం యాజమాన్యానికి ఆయిల్ సంస్థల నుంచి నిర్ధిష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా లేదా కస్టమర్ అసౌకర్యానికి గురైన వెంటనే కంప్లైంట్ చేయవచ్చు. అందుకు తగినట్లు పలు కచ్చితమైన నియమాలు ఉన్నాయి.

బంకుల్లో కొన్ని సేవలనూ ఉచితంగా పొందొచ్చని కేంద్రం చెబుతోంది. వీటిలో కొన్నింటిని కచ్చితంగా అమలు చేయకుంటే పర్మిషన్ కల్పించదు. దీంతో వీటిని ప్రతీ బంకులో ఏర్పాటు చేస్తారు. దేశంలో ఎక్కడైనా సరే.. ఈ ఉచిత సేవల అనుమతి మంజూరు అయితేనే తర్వాత బంకు నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఒకవేళ ఈ సేవలు కల్పించక పోయినా.. నిర్వహణ కోసం డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేసే అధికారం ప్రతీ వినియోగదారుడికి ఉంది.
తాగునీరు: అయితే, మనలో చాలామందికి పెట్రోల్ బంకుల్లో లభించే ఉచిత సౌకర్యాలపై వీటిపై అవగాహన లేదు. బంకుల్లో అందించే ఉచిత సేవల విషయానికి వస్తే.. ప్రతీ బంకులో తప్పనిసరిగా వినియోగదారుల కోసం తాగునీటి సదుపాయం ఉండాలి. బంక్ యజమాని లేదా డీలర్ వాటర్ ఆర్వో యంత్రంతో పాటు ట్యాప్ కనెక్షన్ సదుపాయనాన్ని కల్పించాలి.
టాయిలెట్స్: బంకుల్లో వినియోగదారులకు కోసం మరుగుదొడ్లను కచ్చితంగా ఏర్పాటు చేయాలి. ప్రతీ బంకుల్లో ఉండే టాయిలెట్స్ ని ప్రయాణికులు వినియోగించుకుని కాసేపు సేదా తీరుతారు. అయితే ఈ సౌకర్యం మాత్రం ఉచితం కాదు. మీరు విన్నది నిజమే టాయిలెట్ సర్వీసు కోసం మనం డబ్బులు కడుతున్నాం. పెట్రోల్ బంకుల్లో టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రతీ లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ లో నాలుగు నుంచి ఎనిమిది పైసలు వసూలు చేసుకోవడానికి యాజమాన్యాలకు అనుమతి ఉండటం గమనార్హం.
గాలి: బంకుల్లో వాహనాలకు గాలి నింపడమూ ఉచిత సర్వీస్ ను కల్పించాలి. బంకులోకి వచ్చే అన్నీ వాహనాలకు ఎలాంటి తారతమ్యం లేకుండా టైర్లలో గాలి ఫ్రీగానే నింపాలి. చాలా బంకుల్లో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్న తర్వాత దానికి ఎంతో కొంత సొమ్మును మనం చెల్లించడం అలవాటు. కొన్ని బంకుల్లో వీటని నామమాత్రంగానే నిర్వహిస్తారు. దీనిని మీరు ప్రశ్నించవచ్చు.
ఫస్ట్ ఎయిడ్ కిట్: పెట్రోల్ బంకుల్లో ప్రథమ చికిత్స కిట్ ని కచ్చింతగా అందుబాటులో ఉంచాలి. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసేలా ఏర్పాట్లు చేయాలి. దీనితో పాటు అత్యవసర సమయాల్లో వినియోగదారులు ఫోన్ చేసుకునేందుకు బంక్ యాజమాన్యం అవకాశం కల్పించాలి. ఈ సర్వీస్ కోసం బంకులోని ఫోన్ ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.
పైన పేర్కొన్న ఉచిత సేవలను అందించేందుకు బంకు యజమానులు లేదా డీలర్స్ అలసత్వం వహిస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. మన కంప్లైంట్ ఆధారంగా ఫిర్యాదు అధికారులు పెట్రోల్ బంక్ పై చర్యలు తీసుకుంటారు. వీటితో పాటు మరీ ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ నాణ్యతను తెలుసుకునేందుకు అవసరమైన ఫిల్టర్ పేపర్లు, కొలమానం తదితర ఇతర ఏర్పాట్లను కల్పించాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








