దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశంలో రోడ్డు ప్రమాదాలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా బాధితుల సంఖ్య పెరగడంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంట్లలో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందేలా నూతన విధానాన్ని త్వరలో తీసుకురానుంది.
భారత్‌లో రోడ్డు ప్రమాద(Road Accidents Victims) బాధితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంతకీ ఆ విధానం ఏంటంటే..

ఇకపై రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మోటారు వాహనాల సవరణ చట్టం(MV Act) 2019 లో ఈ విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురై చికిత్సకు ఖర్చు చేయలేని వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
కాగా ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఇప్పటికే మోటారు వాహనాల సవరణ చట్టం 2029 లో భాగంగా ఉందని కేంద్ర రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. దీనిని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు(Cashless Treatment For Road Accident Victims) అమలు చేస్తుండగా.. మరి కొన్ని రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటులో లేవన్నారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై దేశవ్యాప్తంగా కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ అమలు చేయనుందని అనురాగ్ జైన్ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో త్వరలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే సమీప ఆస్పత్రిలో బాధితులకు ఉచిత వైద్య సాయం అందించడమే ఈ విధాన ఉద్దేశమని కార్యదర్శి అనురాన్ జైన్ పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన గంటలోపే అంటే గోల్డెన్ అవర్‌తో సహా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారందరికీ ఈ విధానాన్ని వర్తింపజేస్తామని అనురాగ్ జైన్ అన్నారు. రానున్న మూడు లేదా నాలుగు నెలల్లో ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. కాగా ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు భారత్‌లోనే జరుగుతున్నాయని.. ప్రాణాలు కోల్పోతున్న ఘటనలూ ఇక్కడే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహన కల్పించేందుకు ఇందుకు సంబంధించిన అంశాలను స్కూల్స్, కాలేజ్ సిలబస్‌లలో చేర్చేందుకు కేంద్ర విద్యా శాఖ కూడా అంగీకరించిందని అనురాగ్ జైన్ తెలిపారు. ఈ విధానం త్వరితగతిన అందుబాటులోకి వస్తే.. ఎంతో మంది రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందించి సురక్షితంగా ఇంటికి చేర్చవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








