లోకోపైలట్ లేకుండా 70 కి.మీ ప్రయాణించిన గూడ్స్ రైల్.. ఎలా ఆపేశారంటే?
లోకోపైలట్ లేకుండా గూడ్స్ రైలు సుమారు 70 కి.మీ ప్రయాణించింది. ఈ ఘటనతో రైల్వే అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లోకోపైలట్ అసిస్టెంట్, లోకోపైలట్ లేకుండా రైలు ప్రయాణించిన విజువల్స్ ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
జమ్ము కాశ్మీర్ కతువా రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలుని లోకోపైలట్ నిలిపివేశారు. ఇదే క్రమంలో రైలు క్యాబిన్ దిగే ముందు లోకోపైలట్ హ్యాండ్ బ్రేక్ వేయడం మరచిపోయాడు. దీంతో రైలు పట్టాలపై పరుగులు పెట్టడం ఆరంభించింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారాయి. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రైలుని నిలువరించేందుకు రంగంలోకి దిగి రైలుని ఆపివేశారు.

రైలు నిలిపివేసిన సమయంలో లోకోపైలట్ మరియు అసిస్టంట్ లోకోపైలట్ ఇద్దరు రైలు ఇంజిన్ నుంచి దిగిపోయారు. అదే సమయంలో లోకోపైలట్ హ్యాండ్ బ్రేక్ వేయడం మరచిపోయాడు. వారు దిగిన కాసేపటికే రైలు పరుగెత్తడం ఆరభించింది. దీనిపై అధికారులు వెంటనే సమాచారం అందుకుని రైలుని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
రైలు ప్రయాణిస్తున్న మార్గంలో ఎటువంటి రైలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకానొక సమయంలో ఈ గూడ్స్ రైలు గంటకు 100 కి.మీ వేగంతో ఐదు స్టేషన్లను దాటివేసింది. అప్పటికే 50 కి.మీ పైగా రైలు లోకోపైలట్ లేకుండా ప్రయాణించింది. దీంతో రైలుని ఆపేందుకు పంజాబ్‌లోని ముఖేరియన్ రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌లపై చెక్క దిమ్మెలను పెట్టారు. రైలు వేగాన్ని నిలువరించేందుకు రైల్వే అధికారులు చేపట్టిన చర్యలు ఫలించాయి.

రైలు నిలుపదలతో అధికారులతో పాటు దేశ ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 53 బోగీలు కలిగి ఉన్న ఈ రైలుని వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని వారు తెలిపారు.
సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. రైలు ప్రయాణించే ట్రాక్ కిందకు ఉండటంతో వేగం పుంజుకుందని తెలిపారు. మొదటగా రైలుని నిలువరించేందుకు సిమెంట్ లోడుతో కూడిన బస్తాలు ఇతర సామాగ్రిని అడ్డుగా నిలపాలని భావించినా.. దాని వల్ల ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావించారు. ప్రత్యామ్నాయంగా చెక్క దిమ్మెల వైపు మొగ్గు చూపారు.

చెక్క దిమ్మెలను అడ్డుగా పెట్టడం వల్ల కేవలం ఇంజిన్‌తో పాటు ముందు ఉన్న కొన్ని బోగీలు ప్రమాదానికి గురవతాయని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. దీంతో చెక్క దిమ్మెలతో ట్రైన్‌ని ఆపేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ డివిజన్ మేనేజర్ తెలిపారు. కేవలం లోకోపైలట్ తప్పిదమైతే అందుకు తగిన చర్యలుంటాయని వారు పునరుద్ఘాటించారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








