రూ. 3 కోట్ల ఖరీదైన లంబోర్ఘినీ కారుకు నిప్పు పెట్టిన స్నేహితులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.!!
రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘినీ స్పోర్ట్స్(Set Fire To Lamborghini Supercar) సూపర్ కారును కోపంతో కొందరు వ్యక్తులు దగ్ధం చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగివ్వలేదనే కోపంతో కొందరు స్నేహితులు కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం. పూర్తి సమాచారం ఈ కథనంలో..
రూ. కోట్ల ఖరీదు చేసే కారును నడిరోడ్డుపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదనే కోపంతో కొందరు స్నేహితులు కలిసి.. లంబోర్గిని స్పోర్ట్స్ కారును తగలపెట్టారు. మామిడి పల్లి పహాడిషరీఫ్(Friends Set Fire To Lamborghini Supercar) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పహాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్సింగ్ ప్రాంతానికి చెందిన నీరజ్ అనే వ్యాపారి వద్ద రూ. 3 కోట్ల విలువ కలిగిన లంబోర్ఘిని అనే స్పోర్ట్స్(Lamborghini Sports Car) కారు ఉంది. ఈ కారును నీరజ్ గతంలో సెకండ్ హ్యాండ్‌లోనే కొనుగోలు చేశాడు. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ కారును విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ మేరకు నీరజ్.. తన లంబోర్ఘిని కారును అమ్మే బాధ్యతను తన స్నేహితుడు అయాన్ అనే వ్యక్తికి అప్పగించాడు. దీంతో అయాన్ తన స్నేహితుడైన హైదరాబాద్ పాతబస్తీ మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన అమన్‌ను సంప్రదించాడు. కొద్ది రోజుల తర్వాత అయాన్‌కు అమన్ కాల్ చేసి కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని తెలిపాడు.

అమన్ మిత్రుడు అహ్మద్ లంబోర్ఘినీ స్పోర్ట్స్ సూపర్ కారును చూసుకునేందుకు మామిడిపల్లి నుంచి శంషాబాద్ వెళ్ళే దారిలో ఉన్న తన ఫాం హౌజ్‌కు తీసుకురావాలని చెప్పడంతో.. ఈ నెల 13న అయాన్ నీరజ్ దగ్గర నుంచి కారు తీసుకుని ఫాం హౌజ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో అయాన్ మార్గమధ్యలో కారు ఆపాడు.
అక్కడ అహ్మద్ స్నేహితులు కొందరు రోడ్డు మధ్యలో నిలబడి లంబోర్ఘినీ సూపర్ కారుకు అడ్డంగా నిలబడి కారును ఆపారు. ఆ కారు ఓనర్ నీరజ్ తమకు డబ్బులు ఇవ్వాలంటూ దుర్భాషలాడారు. అనంతరం బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను స్పోర్ట్స్ కారుపై పోసి నిప్పంటించారు. కారు దగ్ధమవుతుండగా.. అక్కడి నుంచి పరారయ్యారు.
హఠాత్పరిణామానికి షాక్‌కు గురైన అమన్ డయల్ 100 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పహాడీషరీఫ్ పోలీసులు, ఫైర్ ఇంజన్ ఘటనా స్థలికి చేరుకున్నారు. కానీ ఈ లోపే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారు దగ్ధమవుతున్న సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ప్రతీకారం తీర్చుకునేందుకు లంబోర్గినీని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అహ్మద్‌కు కారు యజమాని నీరజ్‌తో డబ్బుల విషయంలో గతంలో గొడవలు జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
కాగా పైన పేర్కొన్న లంబోర్ఘిని గల్లార్డో స్పైడర్ మొదటి తరం మోడల్. దీనిని "ప్రీ LP" గల్లార్డో అని కూడా పిలుస్తారు. ఇందులో 5.0-లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ V10 ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 513 బీహెచ్‌పీ పవర్ మరియు 510 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇ-గేర్ మరియు సిక్స్-మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








