సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన వాహన యజమానులు, వాటి సర్వీస్ విషయంలో కూడా సదరు కంపెనీల నుండి మెరుగైన సేవలను ఆశిస్తుంటారు. కానీ, కొన్ని కార్ డీలర్‌షిప్‌లు మాత్రం కస్టమర్లకు సరైన సర్వీసింగ్ సదుపాయాలు కల్పించకుండా, వారికి చిరాకు తెప్పిస్తుంటాయి. ఇలా సర్వీస్ సెంటర్లపై చిర్రెత్తిన కార్ ఓనర్లు వినూత్న రీతిలో తమ నిరసనలను వ్యక్తం చేస్తుంటారు.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

తాజాగా అలాంటి ఓ సంఘటనే ఇటీవ జరిగింది. తనను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ Ford డీలర్‌షిప్‌పై Ford Endeavour కారు యజమాని వినూత్నంగా తన నిరసనను వ్యక్తం చేశారు. తన కారును గాడిదకు కట్టి, షోరూమ్ వరకూ లాక్కెల్లాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత శక్తివంతమైన ఫుల్-సైజ్ ఎస్‌యూవీలలో Ford Endeavour కూడా ఒకటి. నిజానికి ఈ ఎస్‌యూవీ దాని ధరకు తగినట్లుగానే గంభీరమైన వైఖరితో, మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, ఈ కారు విషయంలో అసంతృప్తి చెందిన ఓ యజమాని తన చెడ్డ ఎస్‌యూవీ ని వెలుగులోకి తీసుకురావడానికి ఈ విధమైన పని చేశాడు.

ఈ వీడియోలో తెలిపిన సమాచారం ప్రకారం, అర్జున్ మీనా అనే వ్యక్తి తన 2020 మోడల్ Ford Endeavour ఎస్‌యూవీ విషయంలో తలెత్తిన సమస్యలకు పరిష్కారం చూపడంలో సదరు డీలర్‌షిప్ విఫలం కావడంతో, Ford కంపెనీకి వ్యతిరేకంగా ఆయన తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇందుకోసం తన కారుని గాడిదతో డీలర్‌షిప్ వరకూ లాక్కెళ్లాడు.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

తాను మొదటిసారిగా 2016 సంవత్సరంలో Ford Endeavour ఎస్‌యూవీని కొనుగోలు చేశానని, ఆ తర్వాత తాను ఈ కారుతో అనేక సమస్యలను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా తాను తిరిగి 2020 సంవత్సరంలో కొత్త Ford Endeavour ఎస్‌యూవీని కొనుగోలు చేసాడు, ఈసారి ఆ కారులో అతను గేర్‌బాక్స్‌కి సంబంధించిన సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

అర్జున్ మీనా కారు తన ఇంట్లో కంటే డీలర్‌షిప్ లోనే ఎక్కువ సమయం గడిపిందని అన్నారు. తన మొండి Ford Endeavour ఎస్‌యూవీ ఎలాంటి హెచ్చరికలు చేయకుండా మార్గ మధ్యలో తరచూ ఆగిపోతోందని చెప్పాడు. ఈ పరిస్థితిని గమనించిన తర్వాత, కారు యజమాని దానికి సమస్యను గుర్తించి, కారు గేర్‌బాక్స్‌లో సమస్య ఉందని పేర్కొన్నాడు.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

గేర్‌బాక్స్‌లో సమస్య కారణంగా ట్రాన్స్‌మిషన్ గేర్లు మారడం లేదని, ఫలితంగా కారు రోడ్డు మధ్యలోనే ఆగిపోతోందని సదరు యజమాని చెప్పారు. ఈ విషయంలో ఫోర్డ్ డీలర్‌షిప్ తన సమస్యకు పరిష్కారం చూపకపోతే, రాబోయే ఏడు రోజులు పాటు ఇదే స్టంట్ చేస్తానని, ఆపై డీలర్‌షిప్ ముందు తన వాహనాన్ని తగలబెట్టేస్తానని ఆ వీడియోలో హెచ్చరించాడు.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

ఈ Ford Endeavour ఎస్‌యూవీ విషయంలో సమస్యను పరిష్కరించేందుకు తన డీలర్‌షిప్ తనకు సహాయం చేయలేదని కారు యజమాని చెప్పారు. డీలర్‌షిప్‌లో కారును చాలాసార్లు పార్క్ చేసిన తర్వాత కూడా వారు సహాయం చేయలేదని మరియు సమస్యను పూర్తిగా పరిష్కరించకుండా పైపై మరమ్మత్తులు చేసి ఇచ్చారని యజమాని పేర్కొన్నాడు.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

ఇలా తన కారును డీలర్‌షిప్‌కు తీసుకురావటం, వారు ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం మాత్రమే చేశారని, ఫలితంగా కారు కొన్ని రోజులు పని చేసి తిరిగి అదే సమస్యకు గురయ్యేదని చెప్పారు. ఈ కారు సర్వీస్ విషయంలో డీలర్‌షిప్ వ్యవహరిస్తున్న తీరుపట్ల తాను పూర్తిగా అసంతృప్తితో ఉన్నానని, అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

కాగా, ఈ కారు యజమాని తన కారును గాడిదతో తన ఇంటి నుండి డీలర్‌షిప్ వరకు లాగించారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవైపు నెటిజన్లు ఇతడు చేసిన పనిని ప్రశంసిస్తుంటే, జంతు ప్రేమికులు మాత్రం గాడిదతో అంత పెద్ద కారును లాగించడం ఏంటని విమర్శిస్తున్నారు.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

నిజానికి, భారతదేశంలో వాహన సర్వీస్ విషయంలో అసంతృప్తి చెందిన యజమానులు కంపెనీ దృష్టిని ఆకర్షించడానికి మరియు న్యాయం పొందడానికి ఇటువంటి విన్యాసాలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఓ MG కారు యజమాని, Skoda కారు యజమాని, Jaguar కారు యజమాని, Toyota Land Cruiser కారు యజమాని మరియు అనేక ఇతర కారు యజమానులు కూడా ఇదే తరహా ట్రెండ్‌ను ఫాలో అయ్యారు.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

Ford Figo ఆటోమేటిక్ వేరియంట్స్ విడుదల:

ఇదిలా ఉంచి, భారత మార్కెట్లో Ford బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ గత నెలలో తమ కొత్త Figo ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో టైటానియం మరియు టైటానియం ప్లస్ వేరియంట్లను కంపెనీ పరిచయం చేసింది.

సర్వీస్ విషయంలో చిర్రెత్తిన ఓనర్.. కారును గాడిదకు కట్టి డీలర్‌షిప్‌కు..

Ford Figo ఆటోమేటిక్ యొక్క టైటానియం వేరియంట్ ధర రూ.7.75 లక్షలు కాగా, టైటానియం ప్లస్ వేరియంట్ ధర రూ. 8.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ రెండు వేరియంట్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. Ford Figo ఆటోమేటిక్‌ రూబీ రెడ్, మూండస్ట్ సిల్వర్, స్మోక్ గ్రే, వైట్ గోల్డ్ మరియు డైమండ్ వైట్ కలర్స్ అనే ఐదు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

Most Read Articles

English summary
Frustrated over ford service endeavour owner made donkey pull his car to dealership
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X