ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. కరోనా మహమ్మారితో వేలాదిమంది ప్రజలు పోరాడుతున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలో ప్రకటించిన లాక్ డౌన్ వల్ల అన్ని వాణిజ్యం సేవల లావాదేవీలు ఆగిపోయాయి.

ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే

లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడం వల్ల రోడ్డు పై వాహనాలు కూడా పూర్తిగా నిలిపివేయబడ్డాయి.ఈ కారణంగా ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది.

ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే

దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం ఏప్రిల్ మొదటి వారాల్లో భారత రాష్ట్రాల్లోని ఇంధన కేంద్రాలు మునుపటికంటే 50% తక్కువ ఇంధనాన్ని విక్రయించినట్లు తెలిపాయి. ఇండియన్ ఆయిల్, హిందూస్తాన్ పెట్రోలియం మరియు భారత్ పెట్రోలియం దెస వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కానీ లాక్ డౌన్ వల్ల అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.

MOST READ: లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే

పెట్రోల్, డీజిల్ అమ్మకాల విషయానికొస్తే, ఏప్రిల్ మొదటి 15 రోజుల్లో వాటి అమ్మకాలు ఏకంగా 61% తగ్గాయి. జెట్ ఇంధన అమ్మకాలు ఒకేసారి 64% పడిపోయాయి.

ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే

లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా పెద్ద మొత్తంలో ఎల్‌పిజి గ్యాస్‌ను విక్రయిస్తోంది. కరోనా రోజు రోజుకి మరింత విస్తరిస్తున్న కారణంగా భారతదేశంలో లాక్ డౌన్ వ్యవధిని కేంద్ర ప్రభుత్వం 2020 మే 3 వరకు పొడిగించింది.

MOST READ: త్వరలో లాంచ్ కానున్న బిఎస్ 6 సుజుకి వి-స్ట్రోమ్ 650 XT బైక్, ఇదే

ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే

కరోనా వైరస్ సోకని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో కొన్ని పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా పరిగణించరు. ఈ ప్రాంతాలలో కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది.

ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే

భారతదేశంలో ఇంధన వినియోగంపై అంతర్జాతీయ ఎనర్జీ సంస్థ (ఐఇఎ) ఒక నివేదికను సమర్పించింది. మార్చిలో ఇంధన డిమాండ్ 2.4% పెరిందని, 2020 లో ఇంధన వినియోగం దాదాపు 5.6% తగ్గుతుందని అంచనా వేసింది.

MOST READ: కరోనా లాక్‌డౌన్ వల్ల సైకిల్ పై స్వగ్రామం చేరిన కార్మికులు, ఎక్కడో తెలుసా..?

ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే

ఏది ఏమైనా కరోనా మహమ్మారి వల్ల దేశంలో ప్రజలు చాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా కేవలం ప్రజలను మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమలను కూడా ప్రభావితం చేసింది. ఎట్టకేలకు భారతదేశంలో ఏ రోజు నుంచి కొన్ని రాష్ట్రాలలోని జిల్లాలలో పాక్షిక లాక్ డౌన్ సడలింపు ఉంది. ఈ కారణంగా కొంత వరకు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Fuel demand in India reduces 50 percent in April due to Lockdown. Read in Telugu.
Story first published: Monday, April 20, 2020, 19:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X