Fuel పెట్రోల్ తక్కువ ఉన్నప్పుడు బైక్ లేదా కారు నడిపితే ఇంజన్ దెబ్బతినే అవకాశం ఎక్కువ..

పెట్రోల్ ట్యాంకులో ప్యూయల్ పూర్తి అయ్యే వరకు అలానే వెళ్తున్నారా.. ఇలా చేస్తే మీ బైక్ లేదా కారు కొత్త చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సకాలంలో ప్యూయల్ ఫిల్ చేయక పోతే జరిగే నష్టం, దాని వలన ఇంజన్ కి ఎదురయ్యే సమస్యలను ఈ కథనంలో మేము మీకు వివరించబోతున్నాం.

ఇంధనం పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వాహనాన్ని నడిపితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా నడపడం వాహనానికి హానికరమని వాహన రంగ నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీగా ఉంచి బైక్ లేదా కారు నడపవద్దని వారు హెచ్చరిస్తున్నారు. ఇది చిన్న అంశమే అయినప్పటికీ పెద్ద పరిణామాలకు దారితీస్తుందని అన్నారు.

fuel shortage

దీనివల్ల వాహనాలు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొంటాయనే ప్రశ్న మీ మదిలో తలెత్తే అవకాశం ఉండవచ్చు. వాహనంలో ఇంధనం పూర్తిగా అయిపోయేలా ఉన్నప్పుడు ఎక్కువ దూరం నడపకూడదని నిపుణులు చెబుతున్న అంశాలకు అనేక కారణాలు ఉన్నాయి. ఇంజన్ తో ముడిపడి ఉన్న ఈ కీలక అంశానికి సంబంధించిన సమాధానాలు మీకోసం..

ఇంజన్ లోకి వ్యర్థాలు: చాలా కాలంగా శుభ్రం చేయని వాటర్ ట్యాంక్ ను ఓపెన్ చేస్తే అందులో దుమ్ము, ధూళి ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా, ఫ్యూయల్ ట్యాంక్ లో కూడా చిన్న కణాలు, ధూళి ఉంటాయి. అటువంటి వాతావరణంలో ఫ్యూయల్ ట్యాంకును ఖాళీ చేసేంత వరకు వాహనాన్ని నడిపితే కింద ఉన్న దుమ్ము, ధూళి నేరుగా ఇంజన్ లోకి ప్రవేశిస్తాయి.

ఇది ఇంజన్ కదలికపై ప్రభావం చూపుతుంది. ట్యాంకు లోపల ధూళి అధిక పరిమాణంలో ఉంటే, అది ఇంజన్ ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అంతేకాక, దీనిని సరిచేయడానికి అధిక ఖర్చు అవుతుంది. కాబట్టి ఫోర్ వీలర్ అయినా, టూ వీలర్ అయినా వాహనానంలో సరిపడా ఇంధనంతో నింపడం మంచిది.

fuel shortage problems

ఫ్యూయల్ పంప్: ఇంజన్ పాడవడమే కాదు, మొత్తం ఇంధనం అయిపోయే విధంగా వాహనాన్ని నడిపితే ఫ్యూయల్ పంప్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంకులోని ఇంధనం ఫ్యూయల్ పంప్ ద్వారా ఇంజిన్ లోకి ప్రవేశిస్తుంది. ఇంజన్ కి ట్యాంక్ కి మధ్య లూబ్రికెంట్ గా పనిచేస్తుంది.

ఇలాంటి సందర్భాల్లో తగినంత ఫ్యూయల్ లేకపోతే, పంపుకు అవసరమైనంత లూబ్రికేషన్ లభించదు. వాహనం ఈ స్థితిలో నడపడం కొనసాగిస్తే, ఫ్యూయల్ పంప్ అధిక వేడికి గురవుతుంది. అలా ఎక్కువ వేడిని ఎదుర్కొంటే, అది త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది లేకపోతే బైక్ లేదా కారు నడవడ అసంభవం. కాబట్టి అందుకే ఫ్యూయెల్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యేంతగా డ్రైవ్ చేయొద్దని చెబుతున్నారు.

fuel station

వాహనం ఆకస్మాత్తుగా ఆగిపోయే అవకాశం: ఫ్యూయల్ ట్యాంకులో కొద్దిగా పెట్రోల్ కొద్దిగా ఉన్నప్పుడు నింపకుండా ఉంటే, మీ వాహనం రోడ్డు మధ్యలో ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెట్రోల్ బంకులు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటే వాహనాన్ని రీస్టార్ట్ చేయడం కష్టమవుతుంది.

ముఖ్యంగా, రోడ్డు మధ్యలో నడుస్తున్నప్పుడు వాహనాన్ని నడిరోడ్డుపై ఆపాల్సి ఉంటుంది. ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పెట్రోల్ అందక ఇంజన్ ఫెయిల్ అయితే వాహనాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా దీనిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందువల్ల ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వాహనానికి తగినంత ఇంధనం నింపడం ఉత్తమం.

డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: ఈ రోజుల్లో ఆధునిక కార్లలో పెట్రోల్ పరిమాణాన్ని పర్యవేక్షించడానికి టూల్స్ అందించబడ్డాయి. వారు ఎల్లప్పుడూ సరైన సమాచారాన్ని అందిస్తారని దీని అర్థం కాదు. కొన్నిసార్లు చెప్పిన దానికంటే ముందుగానే పెట్రోల్ లేకుండా వాహనం ఆగిపోవచ్చు. అందువల్ల, కొంత తక్కువ పెట్రోల్ ట్యాంక్ ఉందని మీరు గ్రహించిన వెంటనే పెట్రోల్ ట్యాంకును తిరిగి నింపడానికి ప్రయత్నించాలని మా సలహా.

More from DriveSpark

Article Published On: Wednesday, May 10, 2023, 11:33 [IST]
English summary
Fuel shortage leads to engine damage details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+