Just In
- 10 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 13 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 14 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 14 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నేపాల్ నుండి ఇండియాకి పెట్రోల్ స్మగ్లింగ్; అక్కడ రూ.22 తక్కువ అందుకే..
గడచిన రెండు వారాలుగా అన్ని సోషల్ మీడియాలు మరియు న్యూస్ ఛానెళ్లలో ప్రధానంగా చర్చింటుకుంటున్న అంశం అధిక ఇంధన ధరల గురించి. జనవరి 2021 నుండి మనదేశంలో పెట్రోల్ ధరలు ఏకంగా 22 సార్లు పెరిగాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 లను దాటిపోయింది.

ఈ నేపథ్యంలో, పొరుగు దేశాల నుండి భారతదేశానికి అక్రమ ఇంధన రవాణా కూడా అధికమైంది. భారతదేశంతో పోల్చుకుంటే పొరుగు దేశమైన నేపాల్‌లో పెట్రోల్ ధర రూ.22 తక్కువగా ఉండటంతో, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అక్రమంగా నేపాల్ నుండి పెట్రోల్‌ను భారత్‌కు తీసుకువచ్చి తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు సమాచారం.

హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, బీహార్ యొక్క అరియారియా మరియు కిషన్‌జంగ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇరుకైన ట్రాక్‌లను ఉపయోగించి సరిహద్దును దాటుతున్నారు. ఈ ట్రాక్‌లు ప్రధాన రహదారి లేదా సరిహద్దు చెక్‌పోస్టులకు దూరంగా ఉన్నందున అధికారులు వీరిని గుర్తించే అవకాశం తక్కువ.

అయినప్పటికీ, స్థానిక పోలీసులు మరియు ఎస్‌ఎస్‌బి అధికారులు ఇప్పటికే చాలా మందిని పట్టుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీహార్‌లోని అరియారియా జిల్లాలో ఒక లీటరు పెట్రోల్ ధర రూ.93.50 గా ఉంటే, నేపాల్‌లో మాత్రం లీటరు పెట్రోల్ ధర రూ.70.62 గా ఉంది.

సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఇలా నేపాల్ నుండి పెట్రోల్ అక్రమ రవాణా ప్రారంభించడంతో, దేశీయ మార్కెట్లో కూడా పెట్రోల్ అమ్మకాలు ప్రభావితమయ్యాయి. భారత్‌కు అక్రమంగా రవాణా చేసిన పెట్రోల్‌ను, మన దేశంలో విక్రయించే ధర కన్నా తక్కువ ధరకే చిన్న రిటైలర్లకు విక్రయిస్తున్నారు.

భారతదేశంలో నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా, ఈ ఫ్యూయెల్ స్మగ్లింగ్ ఇప్పుడు ఓ కొత్త అక్రమ వ్యాపార నమూనగా మారింది. భారతదేశంలో పెట్రోల్ ధరలు దిగిరాకుంటే, ఈ పరిస్థితి మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉంది.

వాస్తవానికి పెట్రోల్ ధరలు ప్రతి రాష్ట్రంలో భిన్నంగా ఉంటాయి. పెట్రోల్ ధరలు స్థానిక పన్నులైన వ్యాట్ మరియు సరుకు రవాణా ఛార్జీలపై ఆధారపడి ఉంటాయి. భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో పెట్రోల్‌పై అత్యధిక వ్యాట్ లేదా విలువ ఆధారిత పన్ను ఉంటుంది. అందుకే అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.100 కి పైగా ఉంటుంది.

నేపాల్ నుండి భారత్‌కు ఫ్యూయెల్ స్మగ్లింగ్ అధికం అవుతున్న నేపథ్యంలో, ఈ సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్లు ఎస్‌ఎస్‌బి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) ఎస్‌కె సారంగి తెలిపారు. ఎస్‌ఎస్‌బితో పాటు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని, అన్ని పోలీసు స్టేషన్లకు అవసరమైన సూచనలు కూడా ఇస్తామని కిషన్‌గంజ్ ఎస్‌పి కుమార్ ఆశిష్ అన్నారు.

అసలు నేపాల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసా?
వాస్తవానికి నేపాల్‌లో విక్రయించే పెట్రోల్, డీజిల్ ఇంధనాలను భారతదేశం నుండే సరఫరా చేస్తారు. అయినప్పటికీ, నేపాల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం భారతదేశం మరియు నేపాల్ మధ్య కుదిరిన పాత ఒప్పందం.

నేపాల్ దేశం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఇంధనాన్ని కొనుగోలు చేసిన ధరకు మాత్రమే నేపాల్‌కు విక్రయించాల్సి ఉంటుంది. ఈ ధరకు కేవలం రిఫైనరీ ఛార్జీలను మాత్రమే జోడించాల్సి ఉంటుంది. ఇదే నేపాల్‌లో పెట్రోల్ చౌకగా ఉండటానికి ప్రధాన కారణం.