ఈ వీడియోని మళ్లీ మళ్లీ చూస్తారు.. గ్యారంటీ..!
ప్రముఖ హాలీవుడ్ నటుడు పౌల్ వాకర్ నటించిన ఆఖరి చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 సిరీస్ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌కి సంబంధించిన చిత్రీకరణ సన్నివేశం ఒకటి ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. కార్ స్టంట్లను సిజిలో ఎలా చూపిస్తారో ఈ వీడియోలో స్పష్టంగా తెలిసిపోతుంది.
లేనిదానిని ఉన్నట్లుగా చూపించడంలో హాలీవుడ్ చిత్రపరిశ్రమకు మరొకరు సాటిరారు. తాజాగా లీక్ అయిన వీడియోలో విన్ డీజిల్‌పై చిత్రీకరించిన సన్నివేశం ఉంటుంది. మరి ఆలస్యమెందుకు ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.
ఇదిలా ఉండగా.. ఫ్యూరియస్ 7 చిత్రానికి సంబంధించిన మరో కొత్త థియాట్రికల్ ట్రైలర్‌ను ఆ చిత్ర నిర్మాతలు ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2015వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ 7వ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాన్ని 'ఫ్యూరియస్ 7' అని పిలువనున్నారు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో వైపు ఇది పౌల్ వాకర్ నటించిన చివరి చిత్రం కావటం కూడా ఈ సినిమా సక్సెస్ కావటానికి మరో కారణం కావచ్చు. మరి ఆ ఫ్యూరియస్ 7 ట్రైలర్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!


Click it and Unblock the Notifications








