ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 థియాట్రికల్ ట్రైలర్

By Ravi

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 సిరీస్ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకించి ఇది పౌల్ వాకర్ నటించిన ఆఖరి చిత్రం కావటంతో, సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అభిమానులకు వీనుల విందు కలిగించేందుకు ఆ చిత్ర నిర్మాతలు మరొక థియాట్రికల్ ట్రైలర్ వీడియోని విడుదల చేశారు.

అద్భుతమైన స్టంట్స్, వళ్లు గగుర్పొడిచే కార్ రేస్‌లతో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2015వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ 7వ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాన్ని 'ఫ్యూరియస్ 7' అని పిలువనున్నారు.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో వైపు ఇది పౌల్ వాకర్ నటించిన చివరి చిత్రం కావటం కూడా ఈ సినిమా సక్సెస్ కావటానికి మరో కారణం కావచ్చు. మరి ఆ ఫ్యూరియస్ 7 ట్రైలర్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/yISKeT6sDOg?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
గడచిన సంవత్సరం (2013) నవంబర్ నెలలో ఫిలీప్పిన్స్ తుపాను బాధితులకు సాయం చేయటం కోసం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన స్నేహితుడితో పాటుగా పోర్షే కరెరా జిటి స్పోర్ట్స్ కారులో వెళ్లిన పౌల్ వాకర్, ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని స్నేహితుడుతో పాటుగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసినదే.

Article Published On: Friday, February 6, 2015, 17:00 [IST]
English summary
One of the most anticipated movies of 2015 has to be the ‘Furious 7'. It is scheduled for a release on 3rd of April, 2015. The movie has a large and famous cast both of actors as well as supercars.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+