మరో లగ్జరీ కార్ కొనుగోలు చేసిన ఫ్యూజన్ జిమ్ యజమాని; ధర రూ. 1.63 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లు మరియు బైకులను కేవలం సినీపరిశ్రమల వారు మరియు స్పోర్ట్స్ రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా, చాలామంది వ్యాపారవేత్తలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ వరుసలో అంబానీ ఫ్యామిలీతో పాటు, ఫ్యూజన్ జిమ్ యజమాని అమిత్ సింగ్ వంటి వారు కూడా ఉన్నారు.

మరో లగ్జరీ కార్ కొనుగోలు చేసిన ఫ్యూజన్ జిమ్ యజమాని; ధర రూ. 1.63 కోట్లు

ప్రముఖ ఫ్యూజన్ జిమ్ యజమాని అమిత్ సింగ్ జూన్‌లో జపాన్ లగ్జరీ బ్రాండ్ అయిన Mercedes Benz యొక్క GLS 600 సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల యితడు కొత్త Porsche 718 Cayman GT4 ను కొనుగోలు చేసారు. కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు ధర రూ. 1.63 కోట్లు. Porsche GT4 అనేది 718 సిరీస్‌లో అగ్రస్థానంలో ఉన్న రెగ్యులర్ 718 కేమాన్ యొక్క హార్డ్‌కోర్ వెర్షన్. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మరో లగ్జరీ కార్ కొనుగోలు చేసిన ఫ్యూజన్ జిమ్ యజమాని; ధర రూ. 1.63 కోట్లు

Porsche 718 Cayman GT4 లో 4.0-లీటర్, ఫ్లాట్-సిక్స్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 414 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా పిడికె ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మిషన్ ద్వారా వెనుక చక్రాలకు శక్తిని పంపుతుంది. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు కేవలం 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. కారు గరిష్ట వేగం గంటకు 304 కిమీ.

మరో లగ్జరీ కార్ కొనుగోలు చేసిన ఫ్యూజన్ జిమ్ యజమాని; ధర రూ. 1.63 కోట్లు

ఈ కొత్త లగ్జరీ కారులో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్లు ఉంటాయి. అయితే వీటిని మీరు పూర్తి బకెట్ సీట్‌లకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో ఒక టాకోమీటర్‌తో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో మరియు స్టీరింగ్ వీల్ యొక్క ఎడమ వైపున డూప్లికేట్ కీతో వస్తుంది. మొత్తానికి ఇది లగ్జరీ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

మరో లగ్జరీ కార్ కొనుగోలు చేసిన ఫ్యూజన్ జిమ్ యజమాని; ధర రూ. 1.63 కోట్లు

సాధారణంగా అమిత్ సింగ్ ఎక్కువగా లగ్జరీ స్పోర్ట్స్ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా ఇతని వద్ద స్పోర్ట్స్ SUV మోడల్స్ కూడా ఉన్నాయి. అమిత్ సింగ్ వద్ద ఉన్న వివిధ కార్లను గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..

Porsche 718 Boxter (పోర్స్చే 718 బాక్స్టర్):

అమిత్ సింగ్ కలిగి ఉన్న కార్లలో Porsche 718 Boxter ఒకటి. ఇది 718 యొక్క కన్వర్టిబుల్ వెర్షన్ ఉంది. కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు రెడ్ రూఫ్ మాట్టే బ్లాక్ కవర్ కలిగి ఉంది. ఇరు ఒక ప్రముఖ పోర్స్చే కన్వర్టిబుల్ కారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

మరో లగ్జరీ కార్ కొనుగోలు చేసిన ఫ్యూజన్ జిమ్ యజమాని; ధర రూ. 1.63 కోట్లు

Mercedes-Maybach GLS600 (మెర్సిడెస్ మేబాచ్ జిఎల్ఎస్600):

Mercedes Benz యొక్క విలాసవంతమైన కార్లలో మేబాచ్ GLS 600 ఒకటి. ఈ SUV ని డ్యూయల్ టోన్ కలర్స్‌లో ఎంచుకున్న అతికొద్ది మందిలో అమిత్ ఒకరు. దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 2.43 కోట్లు. ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Mercedes-Maybach GLS600 SUV 4.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుది.

మరో లగ్జరీ కార్ కొనుగోలు చేసిన ఫ్యూజన్ జిమ్ యజమాని; ధర రూ. 1.63 కోట్లు

Lamborghini Urus (లంబోర్గిని ఉరుస్):

ప్రపంచ మార్కెట్లో Lamborghini బ్రాండ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ Urus. ఇది భారతీయ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందింది. Lamborghini Urus 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 641 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది. దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 3.15 కోట్లు.

మరో లగ్జరీ కార్ కొనుగోలు చేసిన ఫ్యూజన్ జిమ్ యజమాని; ధర రూ. 1.63 కోట్లు

Lamborghini Huracan Spyder (లంబోర్గిని హురాకాన్ స్పైడర్):

అమిత్ సింగ్ కలిగి వున్న లగ్జరీ కార్లలో ఒకటి ఈ Lamborghini Huracan Spyder. ఈ సూపర్ లగ్జరీ కారు కన్వర్టిబుల్ మరియు 718 బాక్స్‌స్టర్ వలె అదే రెడ్ కలర్ లో ఉంది. Lamborghini Huracan Spyder కారు 610 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ. 4 కోట్లు.

మరో లగ్జరీ కార్ కొనుగోలు చేసిన ఫ్యూజన్ జిమ్ యజమాని; ధర రూ. 1.63 కోట్లు

Ferrari 488 GTB (ఫెరారీ 488 జీటీబీ):

అమిత్ సింగ్ కలిగి వున్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి ఈ Ferrari 488 GTB. భారతీయ మార్కెట్లో ఈ లగ్జరీ కారు ప్రారంభించినప్పుడు దీని ధర రూ. 4.88 కోట్లు. దీనిని అమిత్ రాత్రి సమయంలో నగరంలో తిరగటానికి ఫెరారీని ఉపయోగిస్తాడు. Ferrari 488 GTB కారు 3.9 లీటర్ వి 8 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 660 బిహెచ్‌పి పవర్ మరియు 760 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Fusion gym owner amit singh buys porsche 718 cayman details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X