గాలిలో పాటు రోడ్డు, రైల్వే ట్రాక్‌ల మీద పరుగులు పెట్టే విమానాలు
హైపర్ సోనిక్, ఎలక్ట్రిక్ విమానాలు మరియు మూడు అంతస్థుల క్యాబిన్ విమానాలు వీటన్నింటిని భవిష్యత్తు విమానాలు అంటూ ఎప్పట్నుంచో వార్తల్లో వస్తూనే ఉన్నాయి. కాని వీటన్నింటిని తలదన్నే రీతిలో భవిష్యత్ విమానాలు సరికొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి. అవే పోడ్ విమానాలు.
ఒకే సారి ముడు నాలుగు విమాన క్యాబిన్‌లను వెంటబెట్టుకెళ్లే వాటిని పోడ్ విమానాలు అంటారు. వీటి గురించి సమగ్రంగా క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

భవిష్యత్ విమానాలకు ప్రతి రూపంగా ఉండే ఈ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది అని చెప్పవచ్చు. వీటిని స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్ పాలిటెక్నిక్ ఇన్‌స్ట్యూట్ వారు రూపొందించారు.

ఒక ఫ్రేమ్ రూపంలో ఉండే విమానం వంటి విభాగంలో రెండు లేదామూడు క్యాబిన్‌లను అనుసంధానం చేసి నడపవచ్చు. ఈ విధానాన్ని క్లిప్ ఎయిర్ కాన్సెప్ట్ అంటారు.

ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి, ఫ్లైయింగ్ కాంపోనెంట్ మరియు కాక్‌పిట్, ఇంజన్ సమ్మేళనం గల ఎయిర్ ఫ్రేమ్‌లు ఉంటాయి.

క్లిప్ ఎయిర్
క్లిప్ ఎయిర్ రవాణా విమానయాన రంగంలో మరొక విప్లవాత్మక ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అని చెప్పవచ్చు. ఒకే ఫ్రేమ్‌లో రకరకాల క్యాబిన్‌లను మోసుకెళ్లే అవకాశం ఉండటం వలన ప్రయాణికుల మరియు సరుకు రవాణా కోసం వీటిని వినియోగించవచ్చు.

నూతన డిజైన్ శైలి
ఈ నూతన డిజైన్ శైలిని స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్ పాలిటెక్నిక్ ఇన్‌స్ట్యూట్ వారు అభివృద్ది చేసారు. పోడ్ కార్ల తరహాలోనే వివిధ రకాల పోడ్‌లను వినియోగించుకుని రెండు లేదా మూడు విమాన క్యాబిన్‌లను ఒకే సారి ఎగిరే విధంగా రూపొందించారు.

స్టెల్త్ బాంబర్ డిజైన్
ఇందులో వినియోగించిన ఎయిర్ ఫ్రేమ్ మొత్తం స్టెల్త్ బాంబర్ డిజైన్‌ను పోలి ఉంటుంది. ముఖ్యంగా డిటాచబుల్ కార్గో మరియు ప్యాసింజర్ క్యాబిన్‌లు దీనికి ముఖ్య ఉదాహరణ.

బహుళ రకాలుగా వినియోగం
క్లిప్ ఎయిర్ విధానం ద్వారా ఇతర ఎయిర్ లైన్స్‌కు చెందిన సంస్థల యొక్క క్యాబిన్‌లను తీసుకెళ్లవచ్చు. లేదంటే రకరకాల ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రయాణికులను ఈ క్లిప్ ఎయిర్ విధానం ద్వారా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించవచ్చు.

మధ్య శ్రేణి
క్లిప్ ఎయిర్ రవాణా యొక్క వేగం ఆధునిక మిడ్ సైజ్ ఎయిర్ లైనర్స్‌కు చాలా దగ్గరగా ఉంటుంది.

వైవిధ్యం
క్లిప్ ఎయిర్ డిజైన్ విధానం కొన్ని రకాల రవాణా పద్దతులకు ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎంతో కీలకమైనది కంటైనర్ ట్రాన్స్‌పోర్ట్. క్లిప్ ఎయిర్ విధానం అందుబాటులోకి వస్తే అధునాత రవాణా ద్వారా కంటైనర్లను తరలించవచ్చు.

రోడ్డు, రైలు మార్గాలలో కూడా
క్లిప్ ఎయిర్ విధానం కేవలం గాలిలో ఎగరడానికి మాత్రమే కాదు రవాణా పరిస్థితులకు అనుగుణంగా క్లిప్ ఎయిర్ ద్వారా ఎగిరే పరిస్థితులు లేకుండే రోడ్డు మీద నడపవచ్చు అలాగే పట్టాల మీద పరుగులు పెట్టించవచ్చు.

త్వరగా గింగిరాలు తిరిగే విధంగా
క్లిప్ ఎయిర్ విధానంలో వాడే విమాన క్యాబిన్‌లు 360 డిగ్రీలుగా అత్యంత త్వరగా తిరగడానికి సిద్దంగా ఉంటాయి. ఒక వేళ పోడ్ విమానం సిద్దంగా ఉన్నపుడు క్యాబిన్‌లను అటాచ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే క్యాబిన్‌లకు నేల మీద క్విక్ టర్న్ అరౌండ్ అనే ఆప్షన్ ఇవ్వడం ద్వారా క్లిప్ ఎయిర్ రవాణా మరింత సులభతరం అయింది.

వినియోగదారుల అనుకూలత కోసం
క్లిప్ ఎయిర్ ప్రయాణికులు ఒక దేశంలో బస్సు రూపంలో ప్రయాణించినపుడు, రోడ్డు లేదా రైలు మార్గాల్లోకి వీరి ప్రయాణం మారుతున్నపుడు కూర్చున్న సీటు సౌకర్యవంతంగా లేనపుడు వారి ఆభీష్టం మేరకు కోరుకున్న ప్రదేశంలోకి సీటింగ్‌ను మార్చే అవకాశం ఇందులో కల్పిస్తారు.

అచరణలోకి వస్తుందా ...?
ఏవియేషన్ నిపుణులు అయితే క్లిప్ ఎయిర్ కాన్సెప్ట్ అనేది ఎంతో అద్భుతమైన ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అంటున్నారు. అయితే ఇది త్వరగా అందుబాటులోకి వస్తే బాగుటుంది అని భావిస్తున్నారు.

చాలా క్లిష్టమైనది
ఏవియేషన్ పరంగా ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్ కాని దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి, అందుబాటులోకి తీసుకురావడం అంత సులభమైన పని కాదని ఎయిర్‌ఇన్‌సైట్ వ్యవస్థాపకులు అడిసన్ స్కాన్లాండ్ తెలిపారు.

భవిష్యత్తులో క్లిప్ ఎయిర్ రంగం అభివృద్ది గురించి తెలిపే చిత్రం.

గంటకు 74,00 కిమీ.లు వేగంతో ప్రయాణించే విమానాలు


Click it and Unblock the Notifications








