వెదురు బొంగులతో తయారు చేసిన కాన్సెప్ట్ కారు
ఇటీవలే మనం చెక్కతో చేసిన కార్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కథనంలో బొంగులతో తయారు చేసిన కారు గురించి తెలుసుకుందాం రండి. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది వెదురు బొంగులను ఉపయోగించి, చేతి అల్లికల ద్వారా తయారు చేసిన బాంబూ కార్.
సన్నగా, ఫ్యూచరిస్టిక్ లుక్ కలిగిన ఈ వెదురు బొంగుల కాన్సెప్ట్ కారును ఇద్దరు డిజైనర్లు సృష్టించారు. ఇది వర్కింగ్ కారు కాదు, జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే. ఈ కారులోని సీట్లు, స్టీరింగ్, బాడీ, గేర్ బాక్స్ అన్నీ వెదురుతో తయారు చేసినవే.
ఈ వెదురు బొంగుల కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కారు పేరు
ఈ వెదురు బొంగుల కారు పేరు ఫినిక్స్ (Phoenix). భవిష్యత్తులో పర్యావరణ సాన్నిహిత్యం కోసం రీసైకిలబిల్ మెటీరియల్స్‌ను ఉపయోగించి కారును సృష్టిస్తే, ఎలా ఉంటుందో తెలిపేందుకే ఈ కాన్సెప్ట్ కారును రూపొందించారు.

డిజైనర్లు
ఈ ఫినిక్స్ బాంబూ కారును డిజైనర్ కెన్నెత్ కోబోన్‌ప్యూ, జర్మన్ ప్రోడక్ట్ డిజైనర్ ఆల్బెర్ట్ బిర్క్‌నర్‌లు డిజైన్ చేశారు.

డిస్పోజల్ కార్
వాడి పారేసే వస్తువల మాదిరిగానే ఇది కూడా ఓ డిస్పోజల్ కారు. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుత కార్ల జీవిత కాలం 10-20 ఏళ్లు ఉంటంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది సగటున 5 ఏళ్లుగా ఉంటుంది. ఇలాంటి దేశాల్లో డిస్పోబల్ కార్లు ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తాయి.

తయారు చేయడానికి పట్టిన సమయం
ఈ ఫినిక్స్ బొంగుల కారును తయారు చేయడాని 10 రోజుల సమయం పట్టింది. వెదురు బొంగులను చక్కగా అల్లి ఈ కారును తయారు చేశారు.

చేతితో అల్లిన కారు
ఈ ఫినిక్స్ కారును నైపుణ్యం కలిగిన చేతి వృత్తి కళాకారులు కనీసం టూల్స్, ఎనర్జీని ఉపయోగించి అల్లారు. ఇది చాలా ధృడంగా ఉంటుంది.

యంత్రాలకు స్వస్తి
ఈ ఫినిక్స్ కారు యంత్రాలకు స్వస్తి పలికి, చేతివృత్తి కళాకారుల నైపుణ్యానికి గుర్తింపు తెచ్చిపెడుతుందని డిజైనర్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








