వాహనాలకు హారన్లుగా ఫ్లూట్, తబలా, వయెలిన్, హార్మోనియం వంటి సంగీత స్వరాలు..!
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్నప్పుడు, ముందున్న డ్రైవర్ అనవసరంగా హారన్ మోగిస్తే, మనం కొంత అసహనంతోనే చూస్తాం. కొంత మంది అయితే అదే పనిగా హారన్ కొడుతుంటారు. హారన్‌ల గోల, చికాకు కలిగించే సౌండ్ ఇప్పుడు ఎక్కువ అయింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఒక కొత్త ఆలోచన చేశారు. వాహన హారన్‌లను భారతీయ సంగీత వాయిద్యాల సౌండ్‌లతో భర్తీ చేయాలని ఆయన ప్రతిపాదించారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, మన సంస్కృతికి మరింత మద్దతుగా నిలిచేలా ఈ ఆలోచన రూపుదిద్దుకుంటోంది. రాబోయే రోజుల్లో, ట్రాఫిక్‌లో సాధారణ హారన్ కాకుండా తబలా మృదంగం లేదా వీణ సుతార రాగాలు వినబోతున్నారు.
దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న వాహన హారన్‌ల వల్ల పెరుగుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికీ అనేక మార్గాలు అన్వేషిస్తోంది. రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇలా ఇంతకు ముందు కూడా ఇటువంటి ప్రకటనలు చేశారు. అధికార యంత్రాంగం గతంలోనూ ఈ సమస్యను పరిష్కరించడానికి కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు చట్టాలు అమలు చేసినా, అవి పూర్తిస్థాయిలో ఫలితం ఇవ్వలేకపోయాయి.

ప్రస్తుతం భారతదేశం అంతటా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాల వద్ద హారన్ మోగించడం చట్టపరంగా నిషిద్ధం. అయినప్పటికీ, రోడ్లపై తిరుగుతున్న అనేక వాహనాలు ఈ నియమాలను పట్టించుకోకుండానే హారన్ మోగిస్తూ ఉంటాయి. ఇది శబ్ద కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. చట్టాల ప్రకారం, వాహన హారన్ గరిష్ట శబ్ద స్థాయి 112 డెసిబెల్స్ (dB) మించకూడదు.
అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. చాలా వాహనాలు గరిష్ట పరిమితిని మించి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ముఖ్యంగా, రైలు హారన్‌ల శబ్దం 130 నుంచి 150 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఇది మనుషుల చెవులకు నష్టం కలిగించే స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలోనే, గడ్కరీ వాహన హారన్‌లను వినడానికి వినసంపుగా ఉండే భారతీయ సంగీత వాయిద్యాల ధ్వనులతో భర్తీ చేయాలన్న ఆలోచనను మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు.

ఈ ప్రయత్నం వల్ల కేవలం శబ్ద కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, రోడ్డు ప్రయాణాన్ని మరింత మధురమైన అనుభవంగా మార్చే దిశగా ఒక సరికొత్త ప్రయోగం అవుతుంది. ఇదే క్రమంలో నితిన్ గడ్కరీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రస్తుతం రోడ్లపై పరుగులు తీస్తున్న కాలుష్య కారక వాహనాలను పూర్తిగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలుగా మార్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన ప్రకటించారు
వాహనాల నమోదు గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు భారతదేశంలో 34.54 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2023 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు జరిగిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వృద్ధి ఏకంగా 50 శాతం పెరుగుదలగా నమోదు కావడం విశేషం. భారత ప్రభుత్వం మాత్రం ఇంకా పెద్ద లక్ష్యాలను పెట్టుకుంది. దేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చాలని, అలాగే భారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని చూస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








