గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌లో 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే'కు శంకుస్థాపన చేశారు. మోదీ శంకుస్థాపన చేసిన ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి దాదాపుగా రూ. 36,200 కోట్లు వెచ్చించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌లో 10 జిల్లాలను కలుపుతుంది. ఈ మొత్తం ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 594 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

కొత్తగా నిర్మిచనున్న ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్‌ వరకు ఉంటుంది. షాజహాన్‌పూర్‌లో బహిరంగ సభలో ధాని మోడీ ప్రసంగిస్తారు. అదే సమయంలో, ప్రధాని మోడీ ర్యాలీలో షాజహాన్‌పూర్, హర్దోయ్, బదౌన్ , లఖింపూర్ వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్షమంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

గంగా ఎక్స్‌ప్రెస్‌వే కు శంకుస్థాపన చేయడానికి వస్తున్న ప్రధాని మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలకనున్నారు. అదే సమయంలో ఈ రోజు జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి బీజేపీ ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులు కూడా హాజరుకానున్నారు. దాదాపు 594 కి.మీ పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే పనులు 2024 సంవత్సరంలో పూర్తవుయ్యే అవకాశం ఉంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

ఈ రోజు దేశ ప్రధాని శంకుస్థాపన చేసిన ఈ 594 కి.మీ పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీరట్‌లోని బిజోలి నుండి ప్రారంభమై ప్రయాగ్‌రాజ్‌లోని జడ్‌పూర్ దండు గ్రామంలో ముగుస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్ లోని హపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదావోన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ మరియు ప్రతాప్‌గఢ్ అనే జిల్లాలను కలుపుతుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభ సమయంలో దాదాపు 6 లేన్‌లుగా ప్రారంభం కానుంది. ఇది అవసరమైతే 8 లేన్‌లకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వాహనాల నుండి టోల్ ఫీజు వసూలు చేస్తారు. అంతే కాకుండా ఇందులో చాలా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

గంగా ఎక్స్‌ప్రెస్‌వేలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటుంది. ఇందులో ఇటీవల ప్రారంభించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే వలె, భారత సైన్యం యొక్క యుద్ధ విమానాలు టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్ సౌకర్యం ఉంటుంది. ఈ ఎయిర్ స్ట్రిప్ దాదాపు 3.5 కి.మీ పొడవు ఉంటుంది. ఇది షాజహాన్‌పూర్‌లో ఏర్పాటయ్యే ఎక్స్‌ప్రెస్‌వేలో కొంత భాగంలో నిర్మించబడుతుంది. కావున ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలో వెహికల్ ఎమర్జెన్సీ సర్వీసులతో పాటు, ప్రయాణ సమయంలో విశ్రాంతి మరియు ఆహారం కోసం హోటల్ మరియు రెస్ట్‌రూమ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉంటాయి, కావున ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు మరియు బ్యాటరీ ఎక్స్చేంజ్ స్టేషన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే పనులు ఈరోజు ప్రారంభమవుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క పురోగతికి చాలా దోహదపడుతుంది. ఇది రాష్ట్రం యొక్క ఖ్యాతిని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడతుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రయోజనాలను వివరిస్తూ, ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీని అందించడమే కాకుండా వేలాది మందికి ఉపాధిని కల్పిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు వస్తాయని, చిన్న తరహా పరిశ్రమలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయన్నారు. అంతే కాకుండా గంగా ఎక్స్‌ప్రెస్‌వే తూర్పు మరియు పశ్చిమ యుపిలను అనుసంధానించడమే కాకుండా ఢిల్లీకి మరియు తిరిగి వచ్చే ప్రయాణికులకు ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా సమయాన్ని అదా చేస్తుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం మరియు నిర్వహణ కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌లో 30 సంవత్సరాల ఒప్పందం కుదిరింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కిమీ వరకు ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే లలిత్‌పూర్‌లో నిర్మించనున్న విమానాశ్రయాన్ని మరియు బుందేల్‌ఖండ్‌లోని డిఫెన్స్ కారిడార్‌ను కూడా కలుపుతుంది. బుందేల్‌ఖండ్ విమానాశ్రయం దేశీయ విమానాల కోసం ప్రారంభించబడుతుంది, అయితే తరువాత అంతర్జాతీయ విమానాల కోసం కూడా అభివృద్ధి చేయబడుతుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతంటే?

సాధారణంగా ఒక దేశం అభివృద్ధి మార్గం వైపు వెళ్లాలంటే, తప్పనిసరిగా రోడ్డు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉండాలి. అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కావున మనదేశంలో కూడా రోడ్లు బాగా అభిరుద్ది చెందాల్సిన ఆసారాం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించబడింది. అయితే ఇప్పుడు గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభానికి సిద్దమవుతోంది.

Most Read Articles

English summary
Ganga expressway foundation stone laid by pm modi estimated cost 36000 crore details
Story first published: Saturday, December 18, 2021, 17:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X